S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/21/2018 - 01:04

పెద్దపల్లి రూరల్, మార్చి 20: మద్యం తాగిన మత్తులో జరిగిన ఘర్షణ చివరకు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుచిది. క్షణికావేశంతో కని పెంచిన కొడుకే ఇనుప రాడుతో తలపై కొట్టి తండ్రిని హతమార్చిన ఉదంతమిది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

03/21/2018 - 00:58

రామడుగు, మార్చి 20: వివాహం జరిగి నాలుగు నెలలు కాకముందే ఓ నవవధువు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని గోపాలరావుపేట గ్రామంలో మంగళవారం జరిగింది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం రాగుల వినిత (22) ఇదే గ్రామానికి చెందిన యువకునితో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. గత కొద్ది రోజుల నుండి మృతురాలికి పీడ కళలు వస్తున్నాయని, ఎవరో చేతబడి చేశారనే అనుమానంతో పలు ఆసుపత్రుల్లో చూపించారు.

03/21/2018 - 00:18

కడప క్రైం,మార్చి 20: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లింగ్‌తో సంబంధాలున్న ఇద్దరు స్మగ్లర్లపై జిల్లా ఎస్పీ పీడీ చట్టం ప్రయోగించారు. అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అహ్మద్ తంబీ మైదీన్, అంతర్ రాష్ట్రీయ ఎర్రచందనం స్మగ్లర్ సిగరపాటి శ్రీనివాసులుపై ఎస్పీ అట్టాడ బాబూజీ మంగళవారం పీడీ చట్టం ప్రయోగించారు. అహ్మద్ తంబి మైద్దీన్ వయస్సు 50సంవత్సరాలు, ఇతను తమిళనాడు రాష్ట్రం నాగపట్టణం జిల్లాలోని నాగూర్‌కు చెందిన వాడు.

03/20/2018 - 04:29

కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 19: కూకట్‌పల్లిలో సంచలనం సృష్టించిన ఇంటర్ విద్యార్థి సుధీర్ హత్య కేసులో ఇద్దరు నిందితులను కూకట్‌పల్లి పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో విలేఖరుల సమావేశం నిర్వహించి నిందితుల వివరాలను ఏసీపీ భుజంగరావు వెల్లడించారు.

03/20/2018 - 04:27

శంషాబాద్, మార్చి 19: నకిలీ పాస్‌పోర్టుతో నగరానికి చేరుకున్న ఒక వ్యక్తిని పోలీసులు రిమాండ్ చేశారు. శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న సంఘటన వివరాలు... కేరళ రాష్ట్రానికి చెందిన సయ్యద్ రఫీ (35) ఉపాధి కోసం రియాద్‌కు వెళ్లాడు. అక్కడ యజమానులు పాస్ట్‌పోర్టు తీసుకోవడంతో స్వదేశానికి వచ్చేందుకు ఏజెంట్ ద్వారా అనిల్‌కుమార్ పేరుతో ఉన్న మరో పాస్‌పోర్టును కొనుగోలు చేశాడు.

03/20/2018 - 04:21

అవనిగడ్డ, మార్చి 19: అదనపుకట్నం కోసం ఓ మహిళను చిత్రహింసలు పెట్టడంతో పాటు శరీరం అంతా వాతలు పెట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక పోలీసుస్టేషన్ పరిధిలోని మోపిదేవి కాలనీకి చెందిన కర్లపూడి కిరణ్‌కు చిరువోలుకు చెందిన దోవారి జ్యోతితో 2012 ఏప్రిల్ 27న వివాహమైంది. ఆ సందర్భంగా రూ.35వేలు నగదు, ఉంగరం, నాలుగు సెంట్ల స్థలం కట్నంగా ఇచ్చారు.

03/20/2018 - 03:45

కొత్తగూడెం, మార్చి 19: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బొమ్మనపల్లి సమీపంలోని పాయమ్మ చెరువుకు సోమవారం మధ్యాహ్నం ఈతకు వెళ్లిన నలుగురు విద్యార్థులు మృతి చెందారు. ఒంటిపూట బడి ముగిసిన తరువాత ఈతకు వెళ్లిన విద్యార్థులు ప్రమాదవశాత్తూ చెరువులో మునిగి మృతి చెందారు.

03/20/2018 - 03:44

రామగిరి, మార్చి 19: సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్‌ను, నల్లగొండ ఎస్పీ ఎ.వి.రంగనాథ్‌ను విమర్శిస్తూ దుష్ప్రచారం చేసిన హైద్రాబాద్ వాసి అనంచిన్న వెంకటేశ్వర్‌రావును అరెస్టు చేసి సోమవారం కోర్టుకు రిమాండ్ చేసినట్టు నల్లగొండ టూటౌన్ ఎస్‌ఐ మధు తెలిపారు.

03/20/2018 - 03:21

సైదాపూర్, మార్చి 19: మండలంలోని ఎక్లాస్‌పూర్ గ్రామానికి చెందిన తాడవేని నాగరాజు (24) అనే యువకుడు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సైదాపూర్ ఎస్‌ఐ నూతి శ్రీ్ధర్ తెలిపిన వివరాల ప్రకారం..నాగరాజుకు తల్లి అనారోగ్యంతో ఉండగా, తండ్రి ఏమీ పని చేయకపోగా కుటుంబ భారం మృతుడు నాగరాజుపై పడింది.

03/20/2018 - 02:39

హైదరాబాద్, మార్చి 19: వెంగళరావునగరంలోని రాష్ట్ర శిశువిహార్‌లో ఆరునెలల చిన్నారి ఆదివారం రాత్రి మృతిచెందింది. శిశువిహార్ సిబ్బంది నిర్లక్ష్యమే ఇం దుకు కారణమని బాలల హక్కుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే... గత ఆరు నెలల క్రితం నగరంలోని ఓ ప్రాంతలో చిన్నారిని గమనించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి చిన్నారిని తీసుకువచ్చి శిశువిహార్‌లో చేర్చారు.

Pages