S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/19/2018 - 01:36

గచ్చిబౌలి, మార్చి 18: మద్యం మత్తులో యువతి కారును వేగంగా నడిపి యాక్టివాను ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న సంఘటన రాయదుర్గ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బొరబండలో రామాయణం శ్రీనివాసులు నివాసముంటున్నాడు. అతని కుమారుడు చిరంజీవి(20) జూమోటో ఫుడ్ డెలీవరీలో డెలీవరీ బాయ్‌గా పని చేస్తున్నాడు.

03/19/2018 - 00:32

రాజమహేంద్రవరం, మార్చి 18: తెలుగు సంవత్సరాది రోజున తండ్రీ కొడుకులు ఆత్మహత్యకు పాల్పడటం జెఎన్ రోడ్డు ప్రాంతంలో విషాదాన్ని నింపింది. ఇద్దరూ తొలుత పురుగుల మందు సేవించి, ఆతరువాత ఒకే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

03/19/2018 - 00:23

కామారెడ్డి/దోమకొండ, మార్చి 18: ఉగాది పండగను భక్తిశ్రద్ధలతో, ఉత్సాహ వాతావరణంలో జరుపుకునే సందర్భంలో ఒకింత అపశృతి చోటు చేసుకుంది. జిల్లాలోని దోమకొండ మండల కేంద్రంలోని శివరామ్ మందిరం వద్ద ఎడ్లబండ్ల ప్రదక్షిణలో ఎడ్లు బెదరడంతో ఎండ్లబండిపై బాల్‌రెడ్డి అనే వ్యక్తి పడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

03/18/2018 - 23:54

మాగనూర్, మార్చి 18: మహబూబ్‌నగర్ జిల్లా మాగనూర్ మండల కేంద్రంలో ఆదివారం ఇద్దరు చిన్నారులు గుళికల మందు పిచికారి చేసిన పొలంలోని మంచినీరు అనుకుని తాగడంతో ఓ చిన్నారి మృతి చెందగా మరో చిన్నారి బాలిక పరిస్థితి విషమంగా ఉంది. మాగనూర్ మండల కేంద్రానికి చెందిన రఫీ అనే రైతుకు చెందిన ఇద్దరు చిన్నారులు మధినా, షమ్రీన్‌లు తమ పొలం దగ్గరకు వెళ్లారు.

03/18/2018 - 23:30

తోటపల్లిగూడూరు, మార్చి 18: మండలంలోని నరుకూరు సెంటర్‌లో కుటుంబ ఆస్తి తగాదాల కారణంగా ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసు, స్థానికుల సమాచారం మేరకు, వేగూరు పద్మమ్మకు చాలా కాలంగా ఆస్తి తగాదాలు ఉండేవి. ఈ క్రమంలో పద్మమ్మ భర్త వెంకటరమణయ్యపై వారి సోదరుడు బలరామయ్య గతంలో నెల్లూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఉన్నాడు. అప్పటి నుంచి వేగూరు వెంకటరమణయ్య పరారీలో ఉన్నాడు.

03/18/2018 - 23:25

నాగలాపురం, మార్చి 18: మండలంలోని బీరకుప్పం పరిధిలోవున్న భూపతేశ్వర కోనలో తమిళనాడుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి గల్లంతైన సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్‌ఐ చంద్రశేఖర్ కధనం మేరకు తమిళనాడుకు చెందిన 6మంది యువకులు భూపతేశ్వర కోన ప్రాజెక్టు వద్దకు వచ్చారు. వీరిలో చెన్నయ్ ఐనవరానికి చెందిన ఆనంద్ (21) అనే ఇంజినీరింగ్ విద్యార్థి ప్రమాదవశాత్తు మడుగులో పడి గల్లంతయ్యాడు.

03/18/2018 - 22:31

బేతంచెర్ల, మార్చి 18:అనుమానంతో కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్తను ఆదివారం అరెస్టు చేసినట్లు సీఐ కంభగిరి రాముడు తెలిపారు. వివరాలు.. ఈ నెల 16వ తేదీ మండల పరిధిలోని గోర్లగుట్ట గ్రామంలో వేముల లత (28)ను భర్త వడ్డే లక్ష్మీనారాయణ కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత పారిపోయిన లక్ష్మీనారాయణ ద్విచక్ర వాహనంతో పాటు కొండల్లో ఉంటూ పరిస్థితిని పరిశీలిస్తూ ఆదివారం స్వగ్రామం తిమ్మాపురానికి బయల్దేరాడు.

03/18/2018 - 22:23

లేపాక్షి, మార్చి 18 : మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో భూమిక (6) నీటి సంపులో పడి ఆదివారం మృతి చెందింది. వివరాల్లోకి వెళితే భూమిక తల్లి మారెక్క ఉగాది పండుగ సందర్భంగా ఇంట్లో పూజలు నిర్వహించి పిల్లలకు భోజనాన్ని వడ్డించి పూర్తయిన తర్వాత ఆడుకోవడానికి బయటకు వెళ్లారు. ఓ ఇంటి ముందు ఉన్న సంపుపై తుప్పు పట్టిన ఓ ఇనుప రేకును మూసి ఉన్నారు.

03/18/2018 - 22:23

అగళి, మార్చి 18 : మండల పరిధిలోని కరిదాసనపల్లికి చెందిన రామకృష్ణ (58) కర్నాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం తన కుమార్తెను పిలుచుకు వచ్చేందుకు కర్నాటక హందికుంటే గ్రామానికి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా తళ్లహళ్లి సమీపంలో గుర్తు తెలియని కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగి అక్కకడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

03/19/2018 - 01:14

హైదరాబాద్, మార్చి 18: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాంపల్లి లేబర్ కోర్టు ప్రిసైడింగ్ అధికారి మల్లంపాటి గాంధీని ఆదివారం తెల్లవారు జామున వారాసిగూడలోని ఆయన నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్టు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లోని ఆయన బంధువుల నివాసాల్లో సోదా నిర్వహించారు.

Pages