S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/19/2018 - 03:36

కరీంనగర్ రూరల్, మార్చి 17: కరీంనగర్ రూరల్ పోలీసు స్టేషన్ పరిదిలోని వల్లంపాడ్ స్టేజి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాండ్ల సునిత (38) అనే మహిళ మృతి చెందినట్లు రూరల్ సిఐ శశిధర్‌రెడ్డి తెలిపారు.

03/18/2018 - 03:15

రాంచీ, మార్చి 17: బిహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, జగన్నాథ్ మిశ్రా నిందితులుగా ఉన్న నాలుగో దాణా కుంభకోణం కేసులో తీర్పును సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. రెండు దశాబ్దాల క్రితం డుమ్కా ట్రెజరీ నుంచి 3.13 కోట్ల రూపాయలు అక్రమంగా విత్‌డ్రా చేశారని మాజీ సీఎంలపై అభియోగం. ఈ కేసులో తీర్పు వాయిదా పడడం ఇది రెండోసారి.

03/18/2018 - 02:42

ఆమనగల్లు, మార్చి 17: కడ్తాల్ మండల పరిధిలోని మైసిగండి సమీపంలో హైదారాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఎస్సై సుందరయ్య తెలిపిన వివరాల ప్రకారం..

03/18/2018 - 00:45

హైదరాబాద్, మార్చి 17: తెలంగాణ నార్తరన్ విద్యుత్ డిస్కాం జూనియర్ లైన్‌మెన్ ఉద్యోగాలకు మహిళల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించాలని హైకోర్టు ఆదేశించింది. హమేరా అంజుం, వి మమత, మరో ఐదుగురు మహిళలు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించి పై ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి ఎంఎస్ రామచంద్రరావు విచారించారు.

03/18/2018 - 00:10

తాడిపత్రి, మార్చి 17: దైవ దర్శనానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో తల్లీ కూతుర్లు రమీజా(42), రేష్మి(21) దుర్మరణం పాలైన సంఘటన శనివారం పట్టణంలో చోటు చేసుకుంది.

03/17/2018 - 03:38

కోడూరు, మార్చి 16: కోడూరు మండలం పాలకాయతిప్ప సముద్రంలో చేపల వేటకు వెళ్లిన సైకం వెంకటరాజు గురువారం రాత్రి గల్లంతయ్యాడు. తాను ఉన్న బోట్‌లో ఇంకా ఐదుగురు మత్స్యకారులు ఉండగా శుక్రవారం ఉదయం వెంకటరాజు కనిపించకపోవటంతో మిగిలిన వారు ఆందోళనకు గురయ్యారు. నాగాయలంక గుల్లలమోద గ్రామానికి చెందిన జాలర్ల బృందం మూడు రోజుల క్రితం సముద్రంలో వేటకు బయలుదేరి వెళ్లింది.

03/17/2018 - 03:27

జీడిమెట్ల, మార్చి 16: రోడ్డు ప్రమాదంలో ఇద్ద రు వ్యక్తులు మృతి చెందిన సంఘటన దుందిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పటాన్‌చెరు, అమీన్‌పూర్‌కు చెందిన ఊటికూరి మహే శ్ (28) ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. ఇస్నాపూర్‌కు చెందిన చెడుదూటి సాయితేజ (21) ఎలక్ట్రీషియన్. ఇద్దరు కలిసి టీఎస్ 15 ఈఎస్ 3767 నంబరు గల రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహనంపై స్వగ్రామం నుండి తూప్రాన్‌కు వెళ్తున్నారు.

03/17/2018 - 03:24

గచ్చిబౌలి, మార్చి 16: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్‌సియు)లో ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థినిపై కొందరు అత్యాచార యత్నానికి ప్రయత్నించారు. ఈ సంఘటనకు సంబంధించి శుక్రవారం గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ సంఘటన హెచ్‌సియులో కలకలం రేపింది.

03/17/2018 - 03:25

హైదరాబాద్, మార్చి 16: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకునేందుకు ట్రాఫిక్ పోలీసులు చేపడుతున్న స్పెషల్ డ్రైవ్‌లో వందల సంఖ్యలో పట్టుబడుతున్నారు. నగర ట్రాఫిక్ జాయింట్ సిపి అందించిన వివరాల ప్రకారం ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి15 వరకు చేపట్టిన డ్రైవ్‌లో 6,781 మందిపై చార్చిషీట్లు దాఖలు చేయగా, వారిలో 1103 మందికి జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.

03/17/2018 - 03:06

హైదరాబాద్, మార్చి 16: దొంగిలించిన డెబిట్ కార్డు ద్వారా ఈ-కామర్స్ లావాదేవీలు నిర్వహించి రూ.6.30 లక్షలు స్వాహా చేసిన కేసులో ముగ్గురు నిందితులను సిసిఎస్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి సిసిఎస్ డిసిపి కార్యాలయం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమాజిగూడకు చెందిన నిషా కటారియా అనే మహిళ ఫిబ్రవరి 5న సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Pages