S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/12/2018 - 23:11

మార్కాపురం, మార్చి 12: ఓ పథకం ప్రకారమే భార్యను హత్య చేశాడని, అందుకు ఆమెపై ఉన్న అనుమానే పెనుభూతమని మార్కాపురం డిఎస్పీ ఎన్‌వి రామాంజనేయులు తెలిపారు. సోమవారం ఉదయం స్థానిక సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దారవీడు మండలంలోని ప్రగళ్ళపాడు గ్రామానికి చెందిన గుండ్లా వెంగళయ్యకు అదేమండలంలోని బద్వీడు గ్రామానికి చెందిన నాగమణిని ఇచ్చి 2011లో వివాహం జరిపారు.

03/12/2018 - 22:04

పలాస, మార్చి 12: పలాస మండలం, చిన్ననీలావతి గ్రామానికి చెందిన హార్డ్‌వేర్ వ్యాపారి కొమరపల్లి చంద్రశేఖర్ (45) రామకృష్ణాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న జీడితోటల్లో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం చంద్రశేఖర్ చిన్ననీలావతి గ్రామం నుంచి 15 ఏళ్లు క్రితం కాశీబుగ్గకు వచ్చి వ్యాపారం చేస్తున్నాడు.

03/12/2018 - 02:31

సికింద్రాబాద్, మార్చి 11: అతి వేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. సంఘటనతో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఓ చిన్నారితోపాటు ఆటోడ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. తిరుమలగిరి నుంచి కార్కానా వైపు వేగంగా వస్తున్న ఇన్నోవా కారు చౌరస్తాలో వేగంగా మలుపు తీసుకుంటూ అదుపు తప్పింది. ఎదురుగా వెళ్తున్న స్విఫ్ట్ కారును ఢీకొట్టింది. కారు వెనుకభాగం ధ్వంసమైంది.

03/12/2018 - 02:27

ఆమనగల్లు, మార్చి 11: స్థానిక కాటన్‌మిల్ సమీపంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం-ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో గుర్తుతెలియని వ్యక్తి(20) మృతి చెందినట్లు ఎస్సై మల్లేశ్వర్ తెలిపారు. కల్వకుర్తి నుంచి హైదారాబాద్‌కు ద్విచక్రవాహనం, హైదారాబాద్ నుంచి కల్వకుర్తి వైపు వస్తున్న గుర్తు తెలియని వాహనం ఎదురెదురుగా ఢీకొనగా ఒకరు మృతి చెందగా మరొకరు త్రీవంగా గాయపడినట్లు ఆయన తెలిపారు.

03/12/2018 - 02:24

కొత్తూరు, మార్చి 11: రహదారికి అడ్డంగా రాళ్లు పెట్టి..నాటు తుపాకీ చూపించి..దారి దోపిడీకి పాల్పడిన సంఘటన శనివారం రాత్రి 10:30సమయంలో కొత్తూరు మండలం గూడూరు గ్రామ పంచాయతీ సమీపంలో చోటు చేసుకుంది.

03/12/2018 - 02:23

తాండూరు, మార్చి 11: పసికందుల పారవేతలకు, చిన్నారులను అనాథలుగా రోడ్డుపాలు చేస్తున్న సంఘటనలకు నిలయమైన తాండూరులో ఆదివారం మరో హృదయ విదారక సంఘటన వెలుగు చూసింది. షావుకార్‌పేట్ కాలనీలో ఎస్‌బీఐ బ్యాంక్ వెనక గల్లీలో ఓ మురుగుకాలువలో అప్పుడే పుట్టినట్లు భావిస్తున్న పసికందును గుర్తుతెలియని వ్యక్తులు పారవేసి వెళ్లారు. ఆడశిశువుగా గుర్తించారు.

03/12/2018 - 02:05

కౌడిపల్లి, మార్చి 11. ప్రమాదవశాత్తూ భవనంపై నుంచి కింద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన చిలప్‌చెడ్ మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. అందోల్ మండల కేంద్రానికి చెందిన మొలమోళ్ల నాగరాజు (40) చిలప్‌చెడ్ మండలం సోమక్కపేటలోని తన బంధువులైన భవాని బిక్షపతి ఇంట్లో పండుగ కార్యక్రమానికి వచ్చాడు. శనివారం రాత్రి భోజనం చేసిన అనంతరం పడుకునేందుకు మేడ (డాబా) పైకి వెళ్ళి పడుకున్నాడు.

03/11/2018 - 23:19

నెల్లూరు, మార్చి 11: ఏం కష్టమొచ్చిందో తెలియదు కానీ మరణం కూడా తమ స్నేహాన్ని విడదీయలేదని ఇద్దరు స్నేహితులు తనువు చాలించి నిరూపించారు. నగర శివార్లలోని సుందరయ్య కాలనీకి చెందిన తుమ్మల సుబ్రహ్మణ్యం (22), చింతల సతీష్‌కుమార్ అలియాస్ చిన్ని (23) మంచి స్నేహితులు. నిత్యం కలిసి తిరుగుతూ ఒకరి కష్టాన్ని మరొకరు తమదిగా భావించే మనస్తత్వం కలిగినవారు.

03/11/2018 - 23:02

ముదిగుబ్బ, మార్చి 11 : ముదిగుబ్బ పాతూరులో ఆదివారం ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో వెంకటేష్‌నాయక్ (33) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై మహమ్మద్ గౌస్ తెలిపిన మేరకు ముదిగుబ్బ నుంచి మంగలమడకకు వెళ్తున్న ఆటోలో పొడరాళ్లపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్‌నాయక్‌తోపాటు మరో నలుగురు ప్రయాణిస్తుండగా పాతూరు సమీపంలో కుక్క అడ్డం రావడంతో అదుపుతప్పి బోల్తా పడింది.

03/11/2018 - 03:12

హైదరాబాద్, మార్చి 10: ఆన్‌లైన్ సిస్టమ్ ద్వారా సినిమా టిక్కెట్లను విక్రయించారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న ఈజీ మూవీస్ బాసికా ఇన్ఫోటెక్ సంస్థపై కేసును రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ సంస్థపైన 2009లో సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాసికా ఇన్ఫోటెక్ సంస్థ తమ సంస్థపైన పోలీసులు నమోదు చేసిన కేసులను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Pages