S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/03/2018 - 02:23

హైదరాబాద్, మార్చి 2: కంట్రీక్లబ్ పేరు చెప్పి ఆన్‌లైన్‌లో డిపాజిట్లు సేకరించి పలువురిని మోసం చేసిస నేరగాడికి ఆరవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.1.10 లక్షలు జరిమాన విధించింది. ఈ కేసుకు సంబంధించి సిఐడి అదనపు డిజిపి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

03/03/2018 - 01:28

హైదరాబాద్, మార్చి 2: సుప్రీం కోర్టు, మానవ హక్కుల సంఘాలు గతంలో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం మావోయస్టుల మృతదేహాలను తరలించిన భద్రాచలం ఆస్పత్రిలోనే పోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అలాగే, పోస్టుమార్టంను వీడియోలో చిత్రీకరించాలని సూచించింది.

03/02/2018 - 23:24

బనగానపల్లె, మార్చి 2:నందివర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని వెంకటాపురం గ్రామ సమీపంలో శుక్రవారం ప్రమాదవశాత్తూ ట్రాక్టర్‌పై నుంచి పడి కమాల్‌బాషా(32) మృతిచెందాడు. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాలు.. కమాల్‌బాషా ట్రాక్టర్‌ను కడిగేందుకు గ్రామ సమీపంలోని చేపలకుంట వద్దకు తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తూ ఎగిరి కిందపడడంతో ట్రాలీ టైర్లు అతడిపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

03/02/2018 - 23:10

టేకులపల్లి, మార్చి 2: టేకులపల్లి మండలంలోని గంగారం ఆశ్రమ ఉన్నత గిరిజన పాఠశాల హాస్టల్‌లో జరిగిన హోలీ పండగ వేడుకల్లో విషాదం నింపింది. గురువారం హోలీ వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో 10వ తరగతి చదువుతున్న హాస్టల్ విద్యార్థి అజ్మీర ప్రసాద్ (14) రంగులు పూసుకుంటూ ఆడుతూ హాస్టల్ రెండో అంతస్తు సన్ సైడ్ మీదకు ఎక్కే క్రమంలో కాలుజారి కింద పడిపోయాడు.

03/02/2018 - 05:33

వనస్థలిపురం, మార్చి 1: కుటుంబ తగాదాలు, మద్యం మత్తులో తలపై దిండు మోపి భార్యను భర్త చంపిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా పాలేరు ప్రాంతానికి చెందిన భూక్య సందీప్, సూర్యాపేట జిల్లా అనంతారం గ్రామానికి చెందిన రాణీ(26)కి ఏడేళ్ల్ల క్రితం వివాహం జరిగింది. వీరికి పూజిత (6)యశ్వంత్ (4) సంతానం ఉన్నారు.

03/02/2018 - 05:33

సైదాబాద్, మార్చి 1: ఆర్థిక ఇబ్బందులతో వాచ్‌మన్ బలన్మరణం చెందిన సంఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా చందంపేట్ మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన లింగయ్య(54) బతుకుదెరువు కోసం నగరానికి కుటుంబంతో కలిసి వలసవచ్చాడు.

03/02/2018 - 05:24

తోట్లవల్లూరు, మార్చి 1: మండలంలోని రొయ్యూరు ఉచిత ఇసుక క్వారీలో గురువారం సాయంత్రం ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ జొన్నలగడ్డ రాజశేఖర్(23) మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. కంచికచర్ల మండలం జమ్మవరం గ్రామానికి చెందిన రాజశేఖర్ యనమలకుదురులో కనగాల రామలింగేశ్వరరావు వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గురువారం ఇసుక కోసం ట్రాక్టర్ వేసుకొచ్చాడు.

03/02/2018 - 05:17

సంగెం, మార్చి 1: తమ ఆస్తి తగాదాలను పరిష్కరించడం లేదని డెత్ నోట్‌లో కొంతమంది పేర్లురాసి పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం సంగెం మండలం గవిచర్ల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..

03/02/2018 - 05:16

వరంగల్, మార్చి 1: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని గురువారం వరంగల్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు నుండి సుమారు 8లక్షల విలవగల 16 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు వివరాలను వెల్లడించారు.

03/02/2018 - 04:49

హైదరాబాద్, మార్చి 1: మైనర్ బాలికను మాయమాటలు చెప్పి లోబర్చుకుని పలు సార్లు అత్యాచారం జరిపిన వృద్ధుడి వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగర పశ్చిమ మండల పోలీస్ పరిధిలోని హబీబ్‌నగర్‌లో ఈ దారుణ సంఘటన జరిగింది. 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికను అదే ప్రాంతానికి చెందిన 76 ఏళ్ల వృద్ధుడు మహ్మద్ అబ్ధుల్ వాహబ్ మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. పలు సార్లు అత్యాచారం చేశాడు.

Pages