S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/27/2016 - 21:02

త్రిష కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న చిత్రం ‘నాయకి’. రాజ్ కందుకూరి సమర్పణలో గిరిధర్ ప్రొడక్షన్స్ హౌస్ పతాకంపై గిరిధర్ మామిడిపల్లి, పద్మజ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి గోవి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసి, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. వీడియో మోషన్‌పోస్టర్‌ను హైదరాబాద్‌లో కథానాయిక త్రిష విడుదల చేశారు.

02/27/2016 - 21:00

తెలుగులో పలు చిత్రాల్లో హాస్య నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి బండ జ్యోతి శుక్రవారం అర్ధరాత్రి తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పలు చిత్రాల్లో సహాయ నటిగా కూడా కనిపించింది. విజయరామరాజు, కళ్యాణరాముడు, స్వయంవరం, భద్రాచలం, గణేష్, డైరీ వంటి పలు చిత్రాల్లో నటించిన బండ జ్యోతి మృతిపట్ల సినీ పరిశ్రమ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.

02/27/2016 - 20:57

ఇప్పటివరకూ మోడ్రన్‌గా కనిపించిన నేను మొదటిసారిగా స్లమ్‌లో వుండే అమ్మాయిగా మాస్ పాత్రలో కనిపిస్తాను. ఈ పాత్ర చేయడం నాకు కొత్తగా అనిపించిందని అంటోంది హీరోయిన్ రేష్మీ. సినిమాల్లో హీరోయిన్‌గా కంటే కూడా జబర్దస్త్ ప్రోగ్రామ్ యాంకర్‌గా బాగా పాపులర్ అయిన ఈమె నటిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు టాకీస్’.

02/27/2016 - 20:54

అలామొదలైంది సినిమాతో దర్శకురాలిగా పరిచయమై తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది నందినీ రెడ్డి. ఆ తర్వాత ఆమె రూపొందించిన జబర్దస్త్ చిత్రం అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.

02/26/2016 - 21:03

వైభవ్, రమ్యా నంబీసన్ జంటగా తమిళంలో రూపొందిన ‘డమాల్ డుమీల్’ చిత్రాన్ని ధనాధన్ పేరుతో తెలుగులోకి విడుదల చేస్తున్నారు. శివ వై.ప్రసాద్, శ్రీనివాస్ అనంతనేని. బ్లాక్‌బస్టర్ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి.

02/26/2016 - 21:02

సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వం వహిస్తూ, హీరోగా నటిస్తున్న చిత్రం ‘మనలో ఒకడు.’ యూనీ క్రాఫ్ట్ మూవీస్ పతాకంపై జి.సి.జగన్మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో శుక్రవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి మాజీ మంత్రి వేణుగోపాలాచారి క్లాప్ నివ్వగా, వేమూరి రాధాకృష్ణ స్విచ్ ఆన్ చేశారు. చలసాని శ్రీనివాస్ గౌరవ దర్శకత్వం వహించారు.

02/26/2016 - 21:01

దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుని, గ్లామర్ భామగా పలు అవకాశాలతో దూసుకుపోతోంది శృతిహాసన్. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు బాలీవుడ్‌లో నిలదొక్కుకోవాలనే కోరిక ఇంకా తీరనట్టుంది. నిజానికి బాలీవుడ్‌లోనే హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టిన శృతికి అక్కడ తీవ్ర నిరాశ ఎదురైంది.

02/26/2016 - 21:00

-రాశీఖన్నా

02/26/2016 - 20:59

‘అందాల రాక్షసి’తో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా సెటిలైన లావణ్యా త్రిపాఠీకి ఈమధ్య వరుసగా రెండు విజయాలు దక్కాయి. నానితో భలేభలే మగాడివోయ్, నాగార్జునతో సోగ్గాడే చిన్నినాయనా సినిమాలతో సూపర్‌హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఈ భామకు ఇప్పుడు అవకాశాల జోరు పెరిగింది. ఇప్పటికే మూడు సినిమాల్లో నటిస్తున్న లావణ్యకు మరో క్రేజీ అవకాశం దక్కింది. వరుణ్‌తేజ్ సరసన హీరోయిన్‌గా ఛాన్స్ కోట్టేసింది.

02/26/2016 - 20:59

నాగార్జున, కార్తి, తమన్నా ప్రధాన తారాగణంగా పి.వి.పి. సినిమా పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రసాద్ వి.పొట్లూరి రూపొందిస్తున్న చిత్రం ‘ఊపిరి’. దీనికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఆడియో మార్చి 1న విడుదల చేస్తారు.

Pages