S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/07/2016 - 21:43

ప్రస్తుతం ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో నటిస్తున్నాడు ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తరువాత ఆయన నటించే మరో చిత్రానికి అప్పుడే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం వహించే ఈ చిత్రం ఆగస్టులో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే కథ సిద్ధమైందని తెలిసింది.

05/06/2016 - 21:33

తమిళ హీరోలకు సినిమాల్లో ప్రయోగాలు చేయడం ఇవాళ కొత్తకాదు. కమల్‌హాసన్ నుండి ఇప్పుడొస్తున్న హీరోలవరకూ అందరూ విభిన్న పాత్రలతో వైవిధ్యమైన ప్రయోగాలు చేసినవారే. తాజాగా సూర్య ‘24’ చిత్రంలో మూడు పాత్రలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కోవలో ఆయన తమ్ముడు కార్తి మూడు పాత్రల్లో నటించేందుకు సిద్ధమయ్యాడు. ‘కాష్మోరా’ పేరుతో తెరకెక్కే ఈ చిత్రంలో మూడు పాత్రల్లో కన్పించనున్నాడు.

05/06/2016 - 21:32

ప్రస్థానం సినిమాలో నెగెటివ్ పాత్రతో ఆకట్టుకుని ఆ తరువాత హీరోగా మారి పలు చిత్రాల్లో నటించాడు సందీప్‌కిషన్. చూడ్డానికి పక్కింటి అబ్బాయిలా కనిపించే సందీప్, విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. రాజసింహ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ రోజు సందీప్‌కిషన్ జన్మదినం సందర్భంగా ఆయనతో ఇంటర్వ్యూ..

05/06/2016 - 21:23

పాకిస్తాన్ జైలులో మగ్గి హత్యకు గురైన భారతీయ పౌరుడు సరబ్‌జిత్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘సరబ్‌జిత్’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ముంబైలో ఓ టీవీ రియాల్టి షోలో పాల్గొన్న బాలీవుడ్ తార ఐశ్వర్యరాయ్. మనీష్ మల్రోత్రా రూపొందించిన ప్రత్యేక దుస్తుల్లో మిలమిల మెరిసిన ఐష్ ఈ చిత్రంలో సరబ్‌జిత్ సోదరిగా నటిస్తున్న విషయం తెలిసిందే. సరబ్‌జిత్ విడుదలకోసం అతడి సోదరి చేసిన పోరాడిన తీరు అందరికీ తెలిసిందే.

05/06/2016 - 21:21

శుక్రవారం విడుదలైన బ్రహ్మోత్సవం కొత్త స్టిల్‌లో సమంతతో మహేశ్‌బాబు. ఈ నెల 20న చిత్రం రిలీజ్‌కానుండగా నేడు ఆడియో వేడుక నిర్వహించనున్నారు. ఈ చిత్రంలో ప్రణీత, కాజల్ కూడా హీరోయన్లుగా నటిస్తున్నారు.

05/06/2016 - 21:19

సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న అందాల భామ కాజల్, ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో బిజీగా వుంది. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాల్లో వరసగా ఛాన్సులు కొట్టేస్తున్న ఈమె ప్రస్తుతం మహేష్ సరసన బ్రహ్మోత్సవం, తమిళ్‌లో విజయ్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం కాజల్‌కు టాలీవుడ్‌లో క్రేజ్ బాగానే వుంది. ముఖ్యంగా ఆమె సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లను బాగానే ఫాలో అవుతోంది.

05/06/2016 - 21:18

సీనియర్ దర్శకుడు భరత్ దర్శకత్వంలో సి.బి.డి.టి. ప్రొడక్షన్స్ పతాకంపై డి.ఎ.ఎస్.పటేల్ నిర్మిస్తున్న చిత్రం ‘గండ్రగొడ్డలి’. ఆవు చంపిన పులినెత్తురు ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న చిత్రం ఇటీవలే ప్రారంభమైంది.

05/06/2016 - 21:16

ప్రస్తుతం హారర్ చిత్రాల హవా ఎక్కువవ్వడంతో దక్షిణాదిలో ఈ చిత్రాలను రూపొందించేందుకు దర్శక నిర్మాతలు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. మరోవైపు హీరోయిన్లు కూడా ఈ తరహా చిత్రాల్లో నటించి క్రేజ్ తెచ్చుకునేందుకు పోటీపడుతున్నారు. ప్రస్తుతం ‘నాయకి’ చిత్రంలో నటిస్తోన్న త్రిష, ఇటీవలే తన 32వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మరో హారర్ సినిమాలో నటించేందుకు ఓకె చెప్పిందట.

05/06/2016 - 21:14

ఇటీవలే ‘సర్దార్ గబ్బసింగ్’ సినిమాలో పవన్‌తో కలిసి స్పెషల్ సాంగ్‌లో ఆడి పాడిన రాయ్ లక్ష్మి మరోసారి ఐటెం సాంగ్ చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తెలుగులో ఘనవిజయం సాధించిన ‘పటాస్’ చిత్రాన్ని తమిళంలో రాఘవ లారెన్స్ హీరోగా ‘మెట్ట శివ కెట్ట శివ’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా నిక్కీగల్రాణి నటిస్తోంది. ఈ చిత్రంలో రాయ్‌లక్ష్మి ఐటెం సాంగ్ చేయనుంది.

05/06/2016 - 21:12

పవన్‌కళ్యాణ్ తన తదుపరి చిత్రాన్ని ఇటీవలే మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఎస్.జె.సూర్య దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఫ్యాక్షన్ లీడర్ ప్రేమకథతో సాగే ఈ చిత్రంలో హీరోయిన్ కోసం అనే్వషణ జరుగుతోంది. ఇప్పటికే మలయాళ భామ హీరోయిన్‌గా నటిస్తోందని వార్తలొస్తున్నాయి. మరోవైపు ఈ చిత్రంలో క్రేజీ హీరోయిన్ శ్రుతిహాసన్‌ను హీరోయిన్‌గా నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Pages