S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/05/2016 - 00:43

ప్రస్తుతం బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందుతున్న గ్లామర్ భామ దీపికా పదుకొనె త్వరలోనే తెలుగు సినిమాల్లో నటించేందుకు రంగం సిద్ధమైంది. మహేష్‌బాబు సరసన ఆమె హీరోయిన్‌గా నటిస్తుందంటూ వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలో నటిస్తున్న మహేష్‌బాబు తన తదుపరి చిత్రానికి రెడీ అయ్యాడు.

05/05/2016 - 00:42

దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా గుర్తింపుతెచ్చుకున్న శ్రుతిహాసన్ ‘శ్రీమంతుడు’ సినిమా తరువాత దక్షిణాదిపై పెద్దగా ఆసక్తి చూపడంలేదు. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా సెటిల్ అవ్వాలనే రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. తెలుగులో ‘ప్రేమమ్’ సినిమాలో మాత్రమే నటిస్తున్న ఈమె, తాజాగా కమల్ హీరోగా నటిస్తున్న ‘శభాష్ నాయుడు’ చిత్రంలో నటిస్తోంది.

05/05/2016 - 00:39

విశాల్, శ్రీదివ్య జంటగా ముత్తయ్య దర్శకత్వంలో విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రూపొందిన ఈ చిత్రాన్ని ‘రాయుడు’ పేరుతో హరి వేంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఇటీవలే గ్లామర్ హీరోయిన్స్ శ్రుతిహాసన్, తమన్నా, రకుల్‌ప్రీత్‌సింగ్ విడుదల చేశారు.

05/05/2016 - 00:38

‘పటాస్’ సినిమాతో దర్శకుడిగా పరిచమై తొలి చిత్రంతోనే మంచి కమర్షియల్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు అనిల్ రావిపూడి. ఆ సినిమా తరువాత సాయిధరమ్‌తేజ్, రాశీఖన్నాలతో తెరకెక్కించిన చిత్రం ‘సుప్రీమ్’. దిల్‌రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ రోజు విడుదలవుతున్న సందర్భంగా అనిల్ రావిపూడితో ఇంటర్వ్యూ...

05/05/2016 - 00:28

సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న రోబో 2.0 చిత్రం ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటోంది. తారామణిలో వున్న ఫిలింసిటీలో ఎండల్ని లెక్కచేయకుండా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం వచ్చేనెలవరకూ అక్కడే షూటింగ్ జరగనుందట. ఆ తరువాత తదుపరి షెడ్యూల్‌ను మొరాకోలో చిత్రీకరిస్తారని తెలిసింది.

05/05/2016 - 00:24

దక్షిణాదిలో గ్లామర్ హీరోయిన్‌గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న ప్రియమణికి ఇటీవస బెంగుళూరులో జరిగిన అత్యాచారం, హత్య సంఘటన తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఇండియాలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, పెద్ద పెద్ద నగరాల్లోనే ఇలాంటి సంఘటనలు జరిగితే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా వుంటుందోనని, ఇక్కడ రక్షణ లేదు కాబట్టే మహిళలు రక్షణ వున్న ప్రాంతానికి వెళ్లిపోవడం ఉత్తమమని ట్విట్టర్‌లో కామెంట్ చేసింది.

05/05/2016 - 00:23

విమల్, శివకార్తికేయన్, రెజీనా, బిందుమాధవి హీరో హీరోయిన్లుగా పాండీరాజ్ దర్శకత్వంలో తమిళంలో ఘనవిజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ అందిస్తున్న చిత్రం ‘కేడీ బిల్లా కిలాడీ రంగా’. ఈ చిత్రంలోని ట్రైలర్స్ హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. నిర్మాత మల్కాపురం శివకుమార్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

05/05/2016 - 00:21

సాయిరోనక్, అతిథి సింగ్ జంటగా వినోద్ లింగాల దర్శకత్వంలో ఐవింక్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘గుప్పెడంత ప్రేమ’. ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో సందీప్‌కిషన్ ఆడియో సీడీని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ట్రైలర్స్, పాటలు బాగున్నాయని, యూత్‌కి కనెక్ట్ అయ్యే పాయింట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని అన్నారు.

05/05/2016 - 00:19

తెలుగు పరిశ్రమలో పలు శాఖల్లో తనదైన గుర్తింపుతో ఐదు దశాబ్దాల కాలంగా వెలుగొందుతున్న ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు 72వ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్హా, మోహన్‌బాబు, జగపతిబాబు, నరేష్, కోడి రామకృష్ణ, బాబూమోహన్, ఎన్.శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శత్రుఘ్నసిన్హా మాట్లాడుతూ, దాసరిగారు ఒక జీనియస్.

05/03/2016 - 21:15

యామిని, భావన, రుహిణి, వర్ష హీరోయిన్లుగా శ్రీ సాయి గణపతి క్రియేషన్స్ పతాకంపై ‘అంజన’రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. చిత్రపటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకులు కొండా విజయ్‌కుమార్ క్లాప్ కొట్టగా, దర్శకులు సుకుమార్ సోదరుడు విజయ్ కెమెరా స్విచ్చాన్ చేశారు.

Pages