S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/03/2016 - 21:13

తెలుగు పరిశ్రమలో దాసరి నారాయణరావుకు ఓ ప్రత్యేక ఇమేజ్ ఉంది. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. దర్శకుడికి స్టార్ ఇమేజ్‌ని తీసుకువచ్చింది ఆయనే. దర్శకుడిగానే కాక నటుడు, రచయిత, నిర్మాత, పంపిణీదారుడు- ఇలా పలు రంగాల్లో తనదైన ఇమేజ్‌ను సృష్టించుకున్న దాసరి ప్రస్తుతం తెలుగు పరిశ్రమకు పెద్దదిక్కులా మారారు.

05/03/2016 - 21:11

తెలుగులో ‘ఏ మాయ చేసావె’ సినిమాతో నెగెటివ్ పాత్రతో ఎంట్రీ ఇచ్చి ‘ఎస్సెమ్మెస్’ చిత్రంతో హీరోగా మారాడు సుధీర్‌బాబు. ఆ తరువాత పలు చిత్రాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మహేష్‌బాబు బావ అయిన సుధీర్ తాజాగా ‘్భగీ’ చిత్రంతో బాలీవుడ్‌లోకి విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా సుధీర్ నటనకు ప్రశంసలు దక్కాయి.

05/03/2016 - 21:08

సుమంత్ అశ్విన్, పూజా జవేరి జంటగా శ్రీ సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మను దర్శకత్వంలో జె.వెంకటేశ్వర్లు నిర్మిస్తున్న చిత్రం ‘రైట్ రైట్’. ఇటీవలే పాటల చిత్రీకరణ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

05/03/2016 - 21:07

‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది రాశీఖన్నా. ఆ తరువాత నటించిన సినిమాలతో గ్లామర్ హీరోయిన్‌గా స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది. తాజాగా ఈమె నటిస్తున్న చిత్రం ‘సుప్రీమ్’. సాయిధరమ్‌తేజ్ హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 5న విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ రాశి చెప్పిన విశేషాలు..
కామెడీ ట్రై చేశా

05/03/2016 - 21:04

నితిన్, సమంత, అనుపమా పరమేశ్వరన్ ముఖ్యపాత్రల్లో త్రివిక్రమ్ దర్శకత్వంలో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తోన్న చిత్రం ‘అ..ఆ’. ఈ చిత్రంలోని పాటలు సోమవారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పవన్‌కళ్యాణ్ సీడీలను ఆవిష్కరించారు.

05/03/2016 - 21:02

బాలీవుడ్ అందాల భామ సోనమ్‌కపూర్‌కు ఈమధ్య పెద్దగా సినిమాలు లేవు. చేసిన సినిమాలన్నీ పరాజయాల పాలవడంతో పాపం ఈమెకు అవకాశాలు సన్నగిల్లాయి. ఇప్పటికే పలుమార్లు మేగజైన్లకోసం హాట్ హాట్‌గా ఫొటో షూట్‌లు ఇచ్చినా కూడా పెద్దగా లాభం లేకపోయింది. ప్రస్తుతం ఒక్క సినిమా కూడా చేయడంలేదు. కానీ అప్పుడప్పుడు ఫొటోషూట్‌లతో రెచ్చిపోయి ఛాన్స్‌లు కొట్టేసే ప్రయత్నం మాత్రం మానడంలేదు.

05/02/2016 - 03:14

విశాల్, అంజలి, వరలక్ష్మి హీరోహీరోయిన్లుగా సుందర్ సి. దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రాన్ని తెలుగులో మదగజరాజ పేరుతో విడుదల చేస్తున్నారు. శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై తమటం కుమార్‌రెడ్డి నిర్మాత. ఈ చిత్రం ఈనెల రెండో వారంలో విడుదలవుతున్న సందర్భంగా నిర్మాతలు వివరాలు తెలియజేస్తూ, సుందర్ సి.

05/01/2016 - 21:50

సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న గ్లామర్ భామ తమన్నా తాజాగా ‘ఊపిరి’ సినిమాతో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే పలు క్రేజీ అవకాశాలతో దూసుకుపోతున్న ఈ భామకు తమిళంలో కూడా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం తమిళంలో ‘దర్మదురై’ చిత్రంలో నటిస్తోంది. దాంతోపాటు విశాల్ సరసన మరో సినిమా చేయడానికి ఓకే చెప్పింది.

05/01/2016 - 21:47

పి.డి.రాజు ప్రధాన పాత్రలో జె.జాన్‌బాబు దర్శకత్వంలో సువర్ణ క్రియేషన్స్ పతాకంపై టి.సుధాకర్ నిర్మిస్తున్న చిత్రం ‘తొలి కిరణం’. మూడు పాటలు మినహా షూటింగ్ పూర్తిచేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు జాన్‌బాబు మాట్లాడుతూ, ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను సహజసిద్ధంగా తెరకెక్కించేందుకు జెరూసలం, ఈజిప్ట్ దేశాలకు వెళ్లనున్నామని.

05/01/2016 - 21:45

జాతీయ నటుడు కమల్‌హాసన్ ‘చీకటిరాజ్యం’ సినిమా తర్వాత చేస్తున్న చిత్రం ‘శభాష్‌నాయుడు’. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిపి కమల్‌హాసన్ నిర్మిస్తున్నాడు. టి.కె.రాజీవ్‌కుమార్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది.

Pages