S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/01/2016 - 21:43

సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా నటించిన సినిమా ‘సుప్రీమ్’. ఫస్ట్ మూవీ ‘పటాస్’తో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న రెండవ సినిమా ఇది. ‘దిల్’రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా మే 5వ తేదీన విడుదలవుతుంది. 150వ చిత్రం ప్రారంభం సమయంలో మావయ్య చిరంజీవిని చూస్తే ఆయన చరిష్మా ఇంకా తగ్గలేదన్పించిందని అంటున్న సాయిధరమ్‌తేజ్ మీడియాతో అనేక విషయాలు ముచ్చటించారు.

05/01/2016 - 21:34

గత ఏడాది మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ప్రేమమ్‌‘ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. నాగచైతన్య, శ్రుతిహాసన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడు. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం వచ్చేనెల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి మరింత హైప్ తెచ్చేందుకు యూనిట్ సన్నాహాలు మొదలుపెట్టింది.

05/01/2016 - 05:36

విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు నటుడు సూర్య. చేస్తున్న ప్రతి సినిమాలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ఎన్నో ప్రయోగాలు చేశాడు. తాజాగా ఆయన నటిస్తున్న మరో ప్రయోగాత్మక చిత్రం ‘24’. సమంత, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ కె.కుమార్ దర్శకుడు. ఈ చిత్రం ఈనెల 6న తమిళ, తెలుగు భాషల్లో విడుదలవుతున్న సందర్భంగా సూర్యతో ఇంటర్వ్యూ..

04/30/2016 - 21:30

సాయిధరమ్ తేజ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు సంయుక్తంగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన తొలి సన్నివేశాన్ని హైదరాబాద్ సంస్థ కార్యాలయంలో చిత్రీకరించారు. అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, వి.వి.వినాయక్ తొలి క్లాప్‌నిచ్చారు.

04/30/2016 - 21:27

సందీప్‌కిషన్, నిత్యామీనన్ జంటగా రాజసింహ తాడినాడ దర్శకత్వంలో బోగాది అంజిరెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

04/30/2016 - 21:25

తమిళంలో విజయవంతమైన ‘పిచ్చైకారన్’ చిత్రాన్ని తెలుగులో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వరా పతాకంపై చదలవాడ పద్మావతి అనువదిస్తున్నారు. విజయ్ ఆంటోని, సత్య టైటస్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ హాల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జయసుధ ఆడియోను విడుదల చేసి తొలి కాపీని విజయ్ ఆంటోనికి అందజేశారు.

04/30/2016 - 21:23

రాజ్ విరాట్ కథానాయకుడిగా రెయిన్‌బో పిక్చర్స్ పతాకంపై రాజేష్‌కుమార్.బి. దర్శకత్వంలో జి.కె.ఆర్, రాజేంద్ర సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘లవ్ మిస్సైల్’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం మణికొండ సంస్థ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజేష్‌కుమార్.బి.

04/30/2016 - 21:21

నితిన్, సమంత జంటగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై త్రివిక్రమ్ దర్శకత్వంలో సూర్యదేవర రాధాకృష్ణ రూపొందిస్తున్న చిత్రం ‘అ.. ఆ’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం ఈ నెల 2న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ కార్యక్రమానికి పవన్‌కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు.

04/30/2016 - 21:18

హనీష్, చిరాశ్రీ జంటగా శ్రీ కనకదుర్గ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె.సూర్యనారాయణ దర్శకత్వంలో ఎం.మారుతి ప్రసాద్, ఎన్.రాధాకృష్ణ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఆమె అతడైతే’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

04/30/2016 - 21:16

‘ఐ’ చిత్రంతో పరుగులో వెనకపడిన అమీ జాక్సన్ ఇక అమీ తుమీ తేల్చుకోవాలనుకుంటోంది. ‘ఐ’ చిత్రం శంకర్ దర్శకత్వంలో విడుదలైనపుడు ఆ చిత్రంతో తనకు అవకాశాలు బాగా వస్తాయని ఆశించింది. కానీ ఆ చిత్రం అనుకున్నంత విజయం పొందకపోవడం అమీకి మైనస్‌గా మారింది. అందుకే తాజాగా ఎప్పటికప్పుడు తన సోషల్ నెట్‌వర్క్ వెబ్‌సైట్లలో సంచలనాలు రేపే ఫొటోలను పెట్టి బాలీవుడ్ దర్శక నిర్మాతలను ఆకట్టుకుంటోంది.

Pages