S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/26/2016 - 21:10

అల్లు అర్జున్, రకుల్‌ప్రీత్‌సింగ్, కేథరిన్ ప్రధాన పాత్రల్లో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించిన చిత్రం ‘సరైనోడు’. బోయపాటి శ్రీను దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు.

04/26/2016 - 21:08

సుమంత్ అశ్విన్ కథానాయకుడుగా శ్రీ సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జె.వంశీకృష్ణ రూపొందిస్తున్న చిత్రం ‘రైట్ రైట్’. మను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇటీవల పూర్తయింది. జె.బి. అందించిన పాటలలో ‘అల్లి బిల్లి చక్కిలి గిలి రెక్కలే విప్పేను లిల్లి’ అనే పాటను హీరో రామ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

04/26/2016 - 21:06

అలనాటి అందాల తార శ్రీదేవి, తనయ జాహ్నవితో కలసి వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తోంది. మంచుతోనున్న పర్వతాల నడుమ తీసుకున్న సెల్ఫీని సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసిన వారు తాము ఎక్కడ విడిది చేశారో స్పష్టం చేయలేదు. కరణ్ జోహార్ దర్శకత్వంలో రూపొందనున్న ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2’ చిత్రంలో జాహ్నవి నటించనున్న విషయం తెలిసిందే.

04/26/2016 - 21:04

శ్రీ చరణ్ కార్తికేయ మూవీస్ పతాకంపై అభిజిత్, రేష్మ జంటగా విజయ్ శ్రీనివాస్ దర్శకత్వంలో శోభారాణి, నౌరోజిరెడ్డి సంయుక్తంగా రూపొందించిన చిత్రం జీలకర్ర బెల్లం. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిలిమ్ ఛాంబర్ హాలులో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత నౌరోజిరెడ్డి మాట్లాడుతూ..

04/26/2016 - 21:03

బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నర్గిస్ ఫక్రికి కెరీర్ పెద్దగా సంతృప్తిని ఇవ్వడంలేదు. ఇప్పటికే రెండుమూడు హిట్ సినిమాలు తన ఖాతాల్లోపడ్డా కూడా అవకాశాలు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. ప్రస్తుతం క్రికెటర్ అజరుద్దీన్ జీవిత కథతో తీస్తున్న అజహర్ చిత్రం పైనే ఆశలు పెట్టుకుంది. లేటెస్ట్‌గా ఓ ఇంటర్వ్యూలో ఈ భామ చెప్పిన విషయాలు సంచలనం కలిగిస్తున్నాయి.

04/26/2016 - 21:00

శైలేష్ బొలిశెట్టి, దీక్షాపంత్, అంగనారాయ్ ప్రధాన తారాగణంగా ఎం.ఆర్. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహనప్రసాద్ దర్శకత్వంలో ఎం.రాఘవయ్య రూపొందిస్తున్న చిత్రం ‘చల్ చల్ గుర్రం’. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

04/24/2016 - 22:09

నూతన నటీనటులు రామకృష్ణ, ఆంకిత జంటగా జయకమల్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై అమనిగంటి వెంకట శివప్రసాద్ దర్శకత్వంలో అయితం ఎన్.కమల్ రూపొందిస్తున్న చిత్రం ‘ఉందా.. లేదా..?’. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్ సినిమా ఆఫీస్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దర్శకుడు వెంకట శివప్రసాద్ మాట్లాడుతూ..

04/24/2016 - 22:08

కె.ఎస్.ఎల్ ఫిలిమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కిరణ్, సుమి, గిడ్డేష్, సమీర ప్రధాన తారాగణంగా శేఖర్‌చంద్ర దర్శకత్వంలో కరె శ్రీనివాస్ రూపొందిస్తున్న చిత్రం వజ్రాలవేట. ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి.

04/24/2016 - 22:06

నూతన నటీనటులు సాయిరోనక్, అతిథిసింగ్, ఐశ్వర్య ప్రధాన తారాగణంగా ఐ వింక్ ప్రొడక్షన్స్ పతాకంపై వినోద్ లింగాల దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘గుప్పెడంత ప్రేమ’ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

04/24/2016 - 22:04

సుశాంత్, సోనమ్‌ప్రీత్ బజ్వా జంటగా శ్రీనాగ్ కార్పొరేషన్, శ్రీ జిఫిలిమ్స్ పతాకాలపై జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల రూపొందిస్తున్న చిత్రం ‘ఆటాడుకుందాం రా’ (జస్ట్ ఛిల్). ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

Pages