S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/24/2016 - 00:18

నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ నిత్యామీనన్. పుట్టుకతో మలయాళీ అయినా తెలుగు నేర్చుకుని డబ్బింగ్‌తోపాటుగా పాటలు పాడటం కూడా చేసేస్తోంది. ఇప్పటివరకూ గ్లామర్ పాత్రలకు తాను దూరం అని చెప్పిన ఈ భామ ఇప్పుడు గ్లామర్ రూట్‌లోకి టర్న్ అయ్యేలా కనిపిస్తోంది. ఎన్టీఆర్ సరసన జనతా గ్యారేజ్ చిత్రంలో నటిస్తున్న నిత్య, ఓవైపు కన్నడ సినిమాల్లో కూడా చేస్తోంది.

04/24/2016 - 00:18

రాజ్‌కమల్ కథానాయకుడిగా చలనచిత్ర కంబైన్స్ పతాకంపై టి.రాము దర్శకత్వంలో మనీష్ గౌడ్, మనీషా రూపొందిస్తున్న చిత్రం ‘వజ్రకోడూర్’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా దర్శకుడు టి.రాము మాట్లాడుతూ- త్వరలో సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసి మేలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

04/24/2016 - 00:16

ప్రస్తుతం తెలుగు తెరపై వేసవికి రానున్న చిత్రాల భారీ క్రేజ్ ఏర్పడింది. భారీ అంచనాలతో రాబోతున్న ‘బ్రహ్మోత్సవం’ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్ ఆర్‌ఎఫ్‌సిలో మొదలుకానుంది. ఐదురోజులపాటు జరగనున్న ఈ షెడ్యూల్‌లో ఓ పాటతోపాటుగా ప్యాచ్‌వర్క్ సన్నివేశాలు చిత్రీకరణ జరగనుంది. కుటుంబ కథా చిత్రంగా రూపొందిస్తున్న ఈ సినిమా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఆకట్టుకునే భావోద్వేగాల కథనంతో రూపొందిస్తున్నారని సమాచారం.

04/24/2016 - 00:15

క్రాంతిమాధవ్ దర్శకత్వంలో సునీల్ చేయనున్న చిత్రం త్వరలో సెట్స్‌కు వెళ్లనుంది. ‘ఓనమాలు’, ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న క్రాంతిమాధవ్ ఈ సినిమాను గతంలో ప్రారంభించారు. ప్రీ కార్యక్రమాలన్నీ పూర్తిచేసిన ఆయన ఇపుడు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నారు. ఈ సినిమాకు ‘సంతోషం సగం బలం’ అనే పేరు పరిశీలనలో వుంది. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

04/24/2016 - 00:11

‘ఒక విచిత్రం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆది పినిశెట్టి ఆ తరువాత విభిన్నమైన సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. తెలుగులో కంటే కూడా తమిళంలో మంచి పాపులారిటీ ఉంది. తాజాగా ఈయన నెగిటివ్ రోల్‌లో నటించిన చిత్రం ‘సరైనోడు’. ఈ చిత్రంలో విలన్‌గా కనిపించిన ఆదికు మంచి అభినందనలు అందుతున్నాయి.

04/22/2016 - 21:59

యోధ, హర్షిత జంటగా రవికిరణ్ దర్శకత్వంలో ఎస్.ఆర్. మీడియా పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా నిర్మాతలు చిక్కా సత్యనారాయణ, మత్తి రత్నాకర్‌లు నిర్మిస్తున్న చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ క్లాప్‌నివ్వగా, నిర్మాత సురేష్ కొండేటి కెమెరా స్విచ్చాన్ చేశారు.

04/22/2016 - 21:57

విభిన్నమైన కథాంశంతో తాను నటిస్తున్న వందో సినిమాను తెలుగువారికి, తన అభిమానులకు అంకితమిస్తున్నానని హీరో బాలకృష్ణ అన్నారు. అన్నపూర్ణ స్టూడియోలో శుక్రవారం గౌతమీపుత్ర శాతకర్ణి ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలుగువాడైన శాతకర్ణి గురించి అందరికీ తెలియచేయాలన్న లక్ష్యంతో తాను ఈ కథను ఎంచుకున్నానని, తెలుగువారంతా గర్వించదగ్గ నాయకుడు శాతకర్ణి అని ఆయన అన్నారు.

04/22/2016 - 21:55

ఈమధ్య కృష్ణవంశీ ప్రయత్నాలన్నీ బెడిసికొడుతున్నాయి. ఎన్నో ఆశలతో చేసిన ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా పరాజయంతో డీలాపడ్డ కృష్ణవంశీ అనుష్కతో రుద్రాక్ష అనే థ్రిల్లర్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమా చర్చల దశలోనే ఆగిపోయింది. మరోవైపు బాలయ్యతో రైతు కథతో చిత్రం చేద్దామనుకున్నా వర్కవుట్ కాలేదు. దాంతో కృష్ణవంశీ మరో ప్లాన్‌లో వున్నాడు.

04/22/2016 - 21:53

ప్రముఖ నటుడు రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కబాలి’. ఇప్పటికే టాకీ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇప్పటికే సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోన్న ఈ సినిమా విడుదలపై దర్శక నిర్మాతలు సందిగ్ధంలో వున్నారు. నిజానికి మేలో విడుదల చేయాలనుకున్న ఈ చిత్రాన్ని జూన్‌కు పొడిగించినట్లు తెలుస్తోంది.

04/22/2016 - 21:51

సంచలన తారగా దక్షిణాదిలో పాపులారిటీ సంపాదించుకున్న నయనతార ఈమధ్య సినిమాలు ఎక్కువగా చేయడంలేదు. ఇదివరకే ‘మయూరి’ సినిమాతో విజయాన్ని అందుకున్న ఈమె, ప్రసుతం తెలుగులో వెంకటేష్ సరసన బాబు బంగారం చిత్రంలో నటిస్తోంది. తమిళంలో కూడా ఒకే సినిమాలో నటిస్తున్న నయనతార ఇపుడు స్పీడు పెంచింది. ప్రస్తుతం విక్రమ్ హీరోగా తమిళంలో రూపొందుతున్న ‘ఇరుముగన్’ సినిమా కోసం గ్లామర్ డోస్ పెంచిందట.

Pages