S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/22/2016 - 21:49

బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించి అందాలు ఆరబోసిన గ్లామర్ భామ నర్గిస్ ఫక్రికి పెద్దగా సినిమా అవకాశాలు లేవు. మరోవైపు సక్సెస్ రేట్ కూడా తక్కువగా వున్న ఈమెకు స్టార్ హీరోల సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావడంలేదు. ఆమధ్య సల్మాన్‌తో నటించిన కిక్ చిత్రంలో మెరిసినప్పటికీ లాభం లేకుండా పోయింది. మరోవైపు స్కిన్ షోకు ఎలాంటి అభ్యంతరం చెప్పని ఈమె ప్రస్తుతం అజహర్‌పైనే ఆశలు పెట్టుకుంది.

04/22/2016 - 21:47

ముంబైలో ఓ స్టూడియోలో షూటింగ్‌కు
హాజరైన బాలీవుడ్ భామ ప్రాచీ దేశాయ్

చిత్రం ప్రాచీ దేశాయ్

04/21/2016 - 21:13

హ్యాట్రిక్ విజయంతో మంచి జోరుమీదున్నాడు అక్కినేని అందగాడు నాగార్జున. ముఖ్యంగా ‘ఊపిరి’ సినిమాలో ఆయన నటనకు మంచి ప్రశంసలు అందుతున్నాయి. దాంతో ఆయనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమా తరువాత నాగార్జున నటించిన భక్తిరస చిత్రం కోసం సన్నాహాలు జోరందుకున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైన ఈ చిత్రం జూన్‌లో ప్రారంభం కానున్నదట.

04/21/2016 - 21:11

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జనతా గ్యారేజ్’ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే భారీ హంగులతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షస్ట్‌లుక్‌ను ఎన్టీఆర్ పుట్టినరోజు అంటే మే 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.

04/21/2016 - 21:09

నితిన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అ..ఆ’ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో నితిన్ సమంతలమధ్య పాట చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఈ సెట్‌లోకి వచ్చాడు పవన్‌కళ్యాణ్. పవన్‌కళ్యాణ్ సెట్లోకి సడెన్‌గా రావడంతో అందరూ షాక్ అయ్యారు. సినిమా గురించి వివరాలని అడిగి తెలుసుకుని త్రివిక్రమ్, నితిన్‌లతో కొద్దిసేపు పవన్ ముచ్చటించారు.

04/21/2016 - 21:07

‘బ్రహ్మోత్సవం’ చిత్రం వచ్చే నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తరువాత మహేష్‌బాబు నటించే చిత్రానికి సన్నాహాలు జోరందుకున్నాయి. ప్రముఖ తమిళ దర్శకుడు మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో రూపొందనుంది. ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తిస్తున్న ఈ చిత్రం మేలో ప్రారంభం కానుంది. సామాజిక కథాంశం నేపథ్యంలో రూపొందే ఈ సినిమాలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తారు.

04/21/2016 - 21:05

సవ్యసాచి కథానాయకుడిగా జి.ఎన్.ఎస్.ప్రసాద్ దర్శకత్వంలో రామ్ ప్రియాంకా మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2 చిత్రం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈడ్పుగంటి శేషగిరి నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు జి.రామ్‌ప్రసాద్ క్లాప్‌నివ్వగా, నిర్మాత బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విచ్చాన్ చేశారు. అనంతరం నిర్మాత మాట్లాడుతూ- ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

04/21/2016 - 21:04

ప్రస్తుతం ‘సరైనోడు’ చిత్రంలో నటిస్తున్న అల్లు అర్జున్ తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోగా తనదైన ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా మంచి ఫాలోయింగ్ వుంది. ఇప్పటికే మలయాళంలో బన్నీని మల్లు అర్జున్ అని పిలుస్తారు. ఆయన సినిమాలకు అక్కడ యమ క్రేజ్ ఉంది.

04/21/2016 - 21:03

చరణ్, రాజ్, సంపూర్ణేష్‌బాబు, హమీదా, రోషన్ ప్రధాన తారాగణంగా రాజేష్ పులి దర్శకత్వంలో మారుతీ టీమ్ వర్క్స్, శ్రీవెంకట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై రూపొందుతోన్న భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరూ చిత్రంలోని పాటలు ఇటీవలే విడుదలై మంచి హిట్ సాధించిన నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో ప్లాటినమ్ డిస్క్ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు మారుతి యూనిట్‌కు షీల్డులు అందజేశారు.

04/21/2016 - 21:01

‘బాహుబలి’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది తమన్నా. గ్లామర్‌తోపాటు పెర్‌ఫార్‌మెన్స్‌కు స్కోప్ వున్న పాత్రలో నటిస్తూ టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. ఇటీవలే ‘ఊపిరి’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తమన్నా, తాజాగా తమిళంలో క్రేజీ అవకాశాన్ని కొట్టేసింది. ప్రముఖ తమిళ స్టార్ హీరో అజిత్ సరసన హీరోయిన్‌గా ఎంపికైంది.

Pages