S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/20/2016 - 20:49

విశాల్, అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన తారాగణంగా శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై సుందర్.సి దర్శకత్వంలో తమటం కుమార్‌రెడ్డి అందిస్తున్న చిత్రం ‘మదగజరాజ’. ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ఆడియో విడుదల కార్యక్రమంలో బిగ్ సీడీని, ఆడియో సీడీని హీరో విశాల్ విడుదల చేసి నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌కు అందించారు.

04/19/2016 - 21:13

‘ఒకే రకమైన పాత్రల్లో నటించాలంటే నాకు బోర్ కొట్టేస్తోంది. అందుకనే విభిన్నమైన పాత్రలు చేయాలని ఉంది’ అని అంటోంది అందాల భామ రకుల్‌ప్రీత్‌సింగ్. ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘సరైనోడు’. అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈనెల 22న విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్‌తో ఇంటర్వ్యూ..
మీ పాత్ర గురించి?

04/19/2016 - 21:09

వరుణ్‌తేజ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్ నిర్మించే చిత్రానికి ‘మిస్టర్’ టైటిల్‌ను ఖరారు చేశారు. మే 15 నుండి స్పెయిన్‌లో చిత్రీకరణ మొదలుకానుందని తెలిసింది. లావణ్య త్రిపాఠి, హెబాపటేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

04/19/2016 - 21:06

‘అల్లుడు శీను’ చిత్రంలో ప్రత్యేక పాటలో నటించి ఔరా అనిపించింది అందాల భామ తమన్నా. ఓవైపు క్రేజీ హీరోయిన్‌గా సినిమాలు చేస్తూనే మరోవైపు సెలెక్టివ్‌గా ప్రత్యేక పాటల్లో నర్తిస్తోంది. మరోసారి ‘స్పీడున్నోడు’ చిత్రంలో కూడా ప్రత్యేక పాటలో మెరిసిన తమన్నా మరోసారి ఈ తరహా పాటల్లో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

04/19/2016 - 21:04

ప్రముఖ నటుడు సూర్య, సమంత, నిత్యామీనన్ ముఖ్యపాత్రల్లో విక్రం కె.కుమార్ దర్శకత్వంలో 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్, స్టూడియో గ్రీన్ పతాకాలపై సూర్య నిర్మిస్తున్న చిత్రం ‘24’.

04/19/2016 - 21:02

కళయరసన్, రమీజ్‌రాజా, మాయ, కాళీ వెంకట్ ప్రధాన పాత్రల్లో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.జ్ఞానవేల్‌రాజా నిర్మించిన తమిళ చిత్రం డార్లింగ్-2. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం తమిళంలో మంచి వసూళ్లు సాధిస్తూ హిట్‌వైపు దూసుకుపోతూండగా తెలుగులోకి అందిస్తున్నారు. ఎవర్‌గ్రీన్ క్రియేషన్స్ పతాకంపై వరుణ్‌చౌదర్ గోగినేని సమర్పణలో మాధురి బొల్లు నిర్మిస్తున్నారు.

04/19/2016 - 21:01

రాజ్‌కృష్ణ, కీర్తన జంటగా అజిత్ క్రియేషన్స్ పతాకంపై బాలకృష్ణారెడ్డి దర్శకత్వంలో టి.రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘రుద్ర ఐ.పి.ఎస్’. ఈ చిత్రంలోని పాటలు సోమవారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ప్రముఖ సీనియర్ దర్శకుడు సాగర్ సీడీలను ఆవిష్కరించారు. అనంతరం ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ, రాజ్‌కృష్ణ చక్కగా నటించాడని, తప్పకుండా ఈ సినిమాతో తనకు హీరోగా మంచి పేరు వస్తుంది.

04/19/2016 - 20:58

‘జబర్దస్త్’ యాంకర్ రష్మి ప్రధాన పాత్రలో జానీ దర్శకత్వంలో కొత్త చిత్రం రూపొందుతోంది. సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ రూపొందించిన ‘కిల్లింగ్ వీరప్పన్’, విశాల్ ‘కథకళి’ చిత్రాల్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసిన శ్రీకృష్ణా క్రియేషన్స్ పతాకంపై గౌరీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ఇది. హారర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పేరు ఇంకా ఖరారు కాలేదు. నిర్మాత గౌరీకృష్ణ ఈ సినిమా విశేషాలు చెప్పారు.

04/19/2016 - 20:56

‘శ్రీమంతుడు’ సక్సెస్ తరువాత నాగచైతన్యతో ‘ప్రేమమ్’ సినిమాలో నటిస్తోంది అందాలభామ శ్రుతిహాసన్. ప్రస్తుతం మరే సినిమా చేయడానికి ఆసక్తి చూపని ఆమె తాజాగా నితిన్ సరసన హీరోయిన్‌గా నటిస్తుందంటూ వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘అ ఆ’ చిత్రంలో నటిస్తున్నాడు నితిన్. ఈ సినిమా మే 6న విడుదలకు సిద్ధమవుతోంది.

04/17/2016 - 21:30

‘తెలుగులో ఎక్కువగా సెకండ్ లీడ్ పాత్రలు చేస్తున్నారని అడుగుతున్నారు. నేను సెకండ్ లీడా ఫస్ట్ లీడా అని చూసుకోను. పాత్ర నచ్చితే చేయడానికి రెడీ’ అని అంటోంది హీరోయిన్ కేథరిన్ త్రెస్సా. ‘ఇద్దరమ్మాయిలతో’.. చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది.

Pages