S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/15/2016 - 21:18

అభిజిత్, రేష్మ జంటగా శ్రీ చరణ్ కార్తీకేయ మూవీస్ పతాకంపై విజయ్ శ్రీనివాస్ దర్శకత్వంలో శోభారాణి, నౌరోజిరెడ్డి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం జీలకర్ర బెల్లం. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. సినిమా పాటల సీడీని దర్శకుడు దశరథ్ విడుదల చేసి మొదటి కాపీని దాస్య నాయక్‌కు అందించారు.

04/15/2016 - 21:16

నూతన నటీనటులతో గౌతమ్ కానె్సప్ట్ పతాకంపై కె.చిరంజీవి (చెన్ని) దర్శకత్వంలో పి.వెంకటేశ్వర్లు రూపొందిస్తున్న ఓ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

04/15/2016 - 21:13

వికాస్, కల్యాణి జంటగా దుర్గాదేవి ఫిలింస్ పతాకంపై ఎన్.డి.ఉదయ్‌కుమార్ దర్శకత్వంలో కవనరెడ్డి నాగేశ్వర రావు రూపొందిస్తున్న చిత్రం ‘తుహిరే మేరీ జాన్’. ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేశారు.

04/15/2016 - 21:00

గ్లామర్ భామ ఇలియానాకు ఈమధ్య మరీ బ్యాడ్ టైమ్ ఎక్కువైనట్లుంది. ఇప్పటికే బాలీవుడ్‌లో సరైన హిట్ లేదు. దానికితోడు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ప్రస్తుతం చేస్తున్న ఒకే ఒక్క సినిమా ‘రుస్తుం’.

04/14/2016 - 22:37

మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టి ఆ తరువాత హీరోయిన్‌గా మారిన అందాలతార అమీ జాక్సన్‌కు వరుసగా భారీ అవకాశాలే దక్కుతున్నాయి. ఎన్నో ఆశలతో చేసిన ‘ఐ’ చిత్రం భారీ పరాజయం పాలవడంతో కాస్త నిరాశ చెందిన ఈ భామ మళ్లీ కొత్త ఉత్సాహంతో సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్ సరసన శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రోబో 2.0’ చిత్రంలో నటిస్తోంది.

04/14/2016 - 22:35

ప్రముఖ తమిళ నటుడు విజయ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘తేరీ’. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి ఇదివరకే ‘పోలీసోడు’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. కొన్ని అనివార్య కారణాలవల్ల ఆ పేరును ‘పోలీసు’గా మార్చారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు భారీ స్థాయిలో విడుదలవుతోంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

04/14/2016 - 22:34

నితిన్, సమంత జంటగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోన్న ‘అ.. ఆ’ (అనసూయ రామలింగం వర్సెస్ ఆనందవిహారి) ఈ సినిమా టీజర్ విడుదలైంది.

04/14/2016 - 22:32

గోపీచంద్, రాశీఖన్నా జంటగా ఎ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో సాయిరాం క్రియేషన్స్ పతాకంపై ఐశ్వర్య నిర్మిస్తున్న చిత్రం ఆక్సిజన్. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత ఐశ్వర్య మాట్లాడుతూ, యాక్షన్ హీరో గోపీచంద్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే మూడు షెడ్యూళ్లను పూర్తిచేసుకుంది.

04/14/2016 - 22:31

రామ్‌శంకర్, నికిషాపటేల్ జంటగా వాసుదేవ్ దర్శకత్వంలో మేకా బాలసుబ్రహ్మణ్యం, సురేష్ వర్మ ఇందుకూరి, నక్కా రామేశ్వరి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘అరకు రోడ్డులో’. ఈ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి.

04/14/2016 - 22:29

నాగార్జున, కార్తి, తమన్నా ముఖ్యపాత్రల్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పి.వి.పి సినిమా పతాకంపై ఇటీవలే విడుదలై అందరి మన్ననలు అందుకుంటోన్న చిత్రం ‘ఊపిరి’. ఈ సినిమా థాంక్స్ మీట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు.

Pages