S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/12/2016 - 21:14

జగదీష్, లిపి జంటగా జె.కె.జి.చౌదరి దర్శకత్వంలో లిపి బార్గవ ప్రొడక్షన్స్, విమన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత డి.వి.మోహన్ నిర్మిస్తున్న చిత్రం ‘అటు ఇటుకాని హృదయంతోటి’.

04/12/2016 - 21:13

‘ఆగడు’, ‘బ్రూస్‌లీ’ చిత్రాల పరాజయంతో కాస్త వెనుకబడిన శ్రీను వైట్ల మళ్లీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన మెగా హీరో వరుణ్‌తేజ్‌తో ఓ సినిమా చేయడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుకానున్న ఈ చిత్రాన్ని ఈనెల 27న ప్రారంభించడానికి సిద్ధమయ్యారట.

04/12/2016 - 21:11

అనిల్, నేహ, నిఖిత హీరో హీరోయిన్లుగా పి.రాధాకృష్ణ దర్శకత్వంలో శ్రీపాద ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కిషోర్‌కుమార్ కోట నిర్మిస్తున్న చిత్రం ‘వజ్రాలు కావాలా నాయన’. ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ క్లాప్‌నివ్వగా కిషోర్‌కుమార్ కోట స్విచ్చాన్ చేశారు.

04/12/2016 - 21:04

హైదరాబాదీ సినిమాల్లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గుల్లు దాదా (అద్నాన్ షాజిద్‌ఖాన్) తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. రాజేష్ పుత్ర దర్శకత్వంలో డిక్కీ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

04/10/2016 - 22:29

నిఖిల్, ఇషిక, నీరజ్, సమ్రీన్, జాహ్నసాయి, కావేరి, లికిత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తూ రామ్‌కుమార్ దర్శకత్వంలో జగదాంబ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకటాచారి ఎర్రోజు నిర్మిస్తున్న చిత్రం ‘అంతా విచిత్రం’. ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజ్‌కందుకూరి క్లాప్‌నివ్వగా రవి జి. కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

04/10/2016 - 22:27

మిల్క్భీమ తమన్నా తాజా గా ఊపిరి సినిమా విజయంతో జోరుమీదుం ది. ఇప్పటికే బాహుబలి సినిమాతో అంతర్జాతీయంగా ఖ్యాతితెచ్చుకున్న ఈమెకు ఇప్పుడు క్రేజ్ బాగా పెరిగిపోయింది. తమిళ, తెలుగు భాషల్లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న ఈ భామ ఈమధ్య బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అక్కడ సక్సెస్‌రేట్ అంతంత మాత్రంగానే ఉండడంతో సౌత్ పైనే ఎక్కువ దృష్టి పెట్టింది. తాజాగా మరోసారి బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసింది.

04/10/2016 - 22:24

క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు తెరకు పరిచయమై, ఎనిమిది భాషల్లో దాదాపు 250కి పైగా సినిమాల్లో నటించి, గుర్తింపు తెచ్చుకుంది నటి రమ్యశ్రీ. ఆమె తొలిసారిగా దర్శకత్వం వహిస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓ మల్లి’. రఘుబాబు, ఆకాష్, ఎల్బీశ్రీరామ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఈనెల 15న విడుదలవుతున్న సందర్భంగా నటి, దర్శకురాలు, నిర్మాత రమ్యశ్రీ చెప్పిన విశేషాలు..ఆమె మాటల్లోనే..

04/10/2016 - 22:20

ఆనంద్ నంద, రష్మీగౌతమ్ జంటగా బాలాజీ నాగలింగం సమర్పణలో వి సినీ స్టూడియోస్ పతాకంపై డి.దివాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాణాగారి బంగళా. ఈ సినిమాలోని పాటలు శనివారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రముఖ దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి సీడీని ఆవిష్కరించారు.

04/10/2016 - 22:17

చేపకళ్ల చిన్నది కాజల్ అగర్వాల్ కెరీర్ రోజురోజుకీ తగ్గిపోతోంది అనడానికి ఈ ఉదాహరణ చాలంటూ టాలీవుడ్ సినీ పండితులు ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రాన్ని చూపిస్తున్నారు. ఈ చిత్రంలో యువరాణిగా నటించిన కాజల్, అటు ప్రతిభపరంగా, ఇటు గ్లామర్ పరంగా ఎటువంటి మెరుపులు మెరిపించలేకపోయిందని అంటున్నారు. మగధీరలో అద్భుతమైన నటనను కనబర్చిన ఆమె ఈ చిత్రానికి వచ్చేసరికి కుదేలైంది అంటున్నారు.

04/10/2016 - 22:15

సిద్ధార్థ్ జాదవ్, జ్యోతి సుభాష్, శరత్ బుటాడియా, శశాంక్ షిండే, జాకీర్ హుస్సేన్ కీలక పాత్రల్లో నటించిన మరాఠి చిత్రం ‘నైజాం సర్కరోడ’. నైజాం, తెలంగాణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో వౌళి ఫిలింస్ పతాకంపై రాజవౌళి అందిస్తున్నారు. రాజ్ దుర్గే దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించిన అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Pages