S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/10/2016 - 22:06

అందాల నాయకి రకుల్‌ప్రీత్‌సింగ్ అంటేనే గ్లామర్ క్వీన్. అటువంటి అందగత్తె ఎటువంటి మేకప్ లేకుండా సాదా సీదా అమ్మాయిగా కనిపిస్తే ఎలా వుంటుంది? ఇదిగో ఇలా వుంటుంది అనంటున్నారు ‘సరైనోడు’ దర్శక నిర్మాతలు. ఈ చిత్రంలో ఆమెతోపాటుగా కాథరిన్ ట్రెస్సా కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్‌సింగ్ మెయిన్ హీరోయిన్ అయినా డీగ్లామర్ రోల్‌లో కనిపించనున్నదట.

04/10/2016 - 21:15

నాగచైతన్య, మంజిమా మోహన్ జంటగా గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహసం శ్వాసగా సాగిపో చిత్రం త్వరలో విడుదలకు సిద్ధవౌతోంది. ఏం మాయ చేశావే సంచలన హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలోని పాటల్ని ఈనెల 25న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

04/10/2016 - 21:12

విజయ్, సమంత, అమీజాక్సన్ ప్రధాన పాత్రల్లో అట్లికుమార్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం తేరీ. ఈ చిత్రాన్ని పోలీసోడు పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు.

04/09/2016 - 22:07

అందాల భామ శ్రుతిహాసన్‌కు దక్షిణాదిలో మంచి పాపులారిటీ వుంది. ముఖ్యంగా తెలుగులో ఈమెకు శ్రీమంతుడు, ఎవడు, రేసుగుర్రం సినిమాల విజయాలతో జోరుమీదున్నా కూడా ప్రస్తుతం తెలుగులో చెప్పుకోదగ్గ చిత్రాల్లో మాత్రం నటించడంలేదు. మరోవైపు తమిళంలో కూడా అంతంతమాత్రంగానే సినిమాలను ఎంచుకుంటోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో చేస్తున్న ఒకే ఒక చిత్రం ‘ప్రేమమ్’. ఇందులో కూడా తన పాత్ర కొద్దిసేపే ఉంటుంది.

04/09/2016 - 22:04

ఇంతకాలం కమర్షియల్, మాస్ చిత్రాలతో అభిమానులను అలరించిన ఎన్టీఆర్ ఇప్పుడు తొలిసారిగా ఓ ప్రేమకథ ఇతివృత్తంగా తీయబోయే సినిమాలో నటించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ‘జనతా గ్యారేజ్’ షూటింగ్‌లో బిజీగా వున్న ఎన్టీఆర్ ఈ సినిమాను ఆగస్టుతో పూర్తిచేయనున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

04/09/2016 - 22:54

కార్తీక్, శే్వతావర్మ జంటగా జి.కె.సినిమాస్ పతాకంపై నౌషాద్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లవ్ చెయ్యాలా వద్దా’. జి.వి.రమణ, సి.సంతోష్ నిర్మాతలు.

04/09/2016 - 21:52

జబర్దస్త్ యాంకర్ రష్మీగౌతమ్, చరణ్‌దీప్ ముఖ్యపాత్రల్లో జి.ఎస్.ఎస్.పి.కల్యాణ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘అంతం’. రాంగోపాల్‌వర్మకు వీరాభిమానిని కావడంతో ఈ టైటిల్ పెట్టానని అంటున్నాడు దర్శక నిర్మాత. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

04/09/2016 - 21:43

ప్రదీప్, ధీరేంద్ర, కిరణ్, సాయితేజ, అంబేద్కర్, మమత ప్రధాన పాత్రలుగా తార, నీలు కోఆపరేషన్ బ్యానర్ పతాకంపై ఎం.ఎస్.బాబు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మంత్రం తంత్రం యంత్రం’ చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు క్లాప్‌నివ్వగా, వరంగల్ ఎం.పి. దయాకర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, గీత రచయిత చంద్రబోస్ గౌరవ దర్శకత్వం వహించారు.

04/09/2016 - 21:40

దశాబ్దకాలం పైగా టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన గ్లామర్ భామ త్రిషకు ఈమధ్య కొంత గ్యాప్ తరువాత రీఎంట్రీ ఇచ్చింది. రీఎంట్రీతో పలు క్రేజీ అవకాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకుపోతున్న ఈ భామ ఇప్పుడు కేవలం సినిమాలపైనే దృష్టిపెట్టింది. త్రిష తాజాగా నటిస్తున్న ‘నాయకి’ చిత్రం కోసం ఓ పాట పాడిందన్న విషయం తెలిసిందే.

04/09/2016 - 21:35

జి.వి.ప్రకాష్, శ్రీదివ్య జంటగా మణి నాగరాజ్ తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న చిత్రం ‘పెన్సిల్’. ఎం.పురుషోత్తమ్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ హైదరాబాద్‌లో విడుదల చేశారు. ప్రముఖ నటుడు సూర్య ట్రైలర్‌ను ఆవిష్కరించారు. అనంతరం నిర్మాత మాట్లాడుతూ- అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కుతున్న చిత్రమిది.

Pages