S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/08/2016 - 21:04

రామ్ కథానాయకుడిగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లి. పతాకంపై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైంది. రామ్‌పై శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి.ఎం. క్లాప్‌కొట్టగా రవికిశోర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ చంద్ ఆచంట, అనీల్ సుంకర మాట్లాడుతూ, మే మూడవ వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు.

04/07/2016 - 21:20

బాలీవుడ్ భామ బిపాసాబసు త్వరలో ఓ ఇంటిది కాబోతోంది. ప్రేమికుడు కరణ్‌సింగ్ గ్రోవర్‌తో బిపాసా వివాహం ఈనెల 30న జరగనుంది. ఈ విషయాన్ని కరణ్, బిపాసా ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇన్నాళ్లూ తమ ప్రేమవ్యవహారాన్ని రచ్చకీడ్చకుండా ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పిన ఈ జంట వివాహానికి అత్యంత ఆప్తులను మాత్రమే ఆహ్వానిస్తున్నారు.

04/07/2016 - 21:18

‘అమ్మా నాన్న తమిళ అమ్మాయి’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అసిన్, అటుపై పలు సినిమాలతో హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. గజనీ సినిమాతో బాలీవుడ్‌లో కూడా అంతే ఇమేజ్ తెచ్చుకున్న ఈ భామ ఎక్కువగా హిందీలో సినిమాలు చేయలేకపోయింది. దాంతో గత ఏడాది బిజినెస్‌మెన్ అయిన రాహుల్ శర్మను వివాహం చేసుకున్న అసిన్, ఇప్పుడు ఇంటికే పరిమితం అవుతోంది.

04/07/2016 - 21:16

తిబ్ధ్నిలబ2ల్థ జ్ఞూ్ర+

04/07/2016 - 21:14

వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై ప్రశాంత్, ప్రసన్న, మణికంఠ సన్ని, పూజిత ప్రధాన తారాగణంగా శివశ్రీ దర్శకత్వంలో మళ్ల విజయప్రసాద్ రూపొందిస్తున్న చిత్రం ‘ఇంకేంటి నువ్వే చెప్పు’. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జరుపుతున్నారు.

04/07/2016 - 21:12

‘్భలే భలే మగాడివోయ్’ సినిమా తరువాత ఆచి తూచి సినిమాలు చేస్తున్నాడు నాని. ‘క్రిష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమా తరువాత దాదాపు పది సినిమాలు కాదనన్నాడు. తనను హీరోగా మార్చిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో మళ్లీ నటిస్తున్నాడు.

04/07/2016 - 21:11

కొద్దికాలంగా సరైన హిట్‌కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్న దర్శకుడు తేజ, తాజగా ‘అహం’ పేరుతో ఓ సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఆయన స్క్రిప్ట్ దగ్గర్నుంచే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో ప్రముఖ హీరో రాజశేఖర్ నటించనున్నారని కొద్దిరోజుల క్రితమే ప్రకటించగా, తాజాగా ఈ ప్రాజెక్టునుంచి ఆయన బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.

04/07/2016 - 21:08

చిత్రం శ్రీను, శ్రీవల్లి ప్రధాన తారాగణంగా ఖమ్మం క్రియేషన్స్ పతాకంపై నెప్పలి కృష్ణ దర్శకత్వంలో సరోజిని, దేవ, కోటయ్య, రమణారెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘మయసభ’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ముగింపు దశలో వుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- సింగిల్ షెడ్యూల్‌లో ఈ చిత్రాన్ని పూర్తిచేస్తున్నామని, ఖమ్మం, కృష్ణాజిల్లా మైలవరం, హైదరాబాద్‌లలో షూటింగ్ చేశామని తెలిపారు.

04/07/2016 - 21:06

‘అలా మొదలైంది’తో తెలుగులో సంచలనం సృష్టించిన దర్శకురాలు నందినీరెడ్డి. తరువాత తన రెండో సినిమా ‘జబర్‌దస్త్’తో తీవ్ర విమర్శల పాలయ్యింది. దాదాపు మూడేళ్ళ అనంతరం నందినిరెడ్డి మరోసారి తానేంటో నిరూపించే ప్రయత్నంతో తీసిన ‘కళ్యాణ వైభోగమే’తో మంచి విజయం సాధించింది. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో యువ హీరో నితిన్‌తో సినిమా చేసేందుకు శ్రీకారం చుట్టిందట నందినీరెడ్డి.

04/07/2016 - 21:04

కృష్ణ, విజయనిర్మల ప్రధాన తారాగణంగా ఎస్.బి.ఎస్. ప్రొడక్షన్స్ పతాకంపై ముప్పలనేని శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం శ్రీశ్రీ. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి తొలి కాపీ సిద్ధం చేశారు.

Pages