S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/05/2016 - 23:48

సుమంత్ అశ్విన్, పూజాజవేరి జంటగా శ్రీ సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మనూ దర్శకత్వంలో జె.వంశీకృష్ణ రూపొందిస్తున్న చిత్రం ‘రైట్ రైట్’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేశారు. నిర్మాత మాట్లాడుతూ, తొలి షెడ్యూల్ అరకు, ఒడిస్సాలో, రెండో షెడ్యూల్ వికారాబాద్ బస్టాండ్, అడవిలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించామని తెలిపారు.

04/05/2016 - 23:47

కార్తిక్, భాను జంటగా ఎస్.ఆర్.పి. విజువల్స్ పతాకంపై నానిఆచార్య థర్శకత్వంలో శివరాజ్‌పాటిల్ రూపొందిస్తున్న ఇద్దరిమధ్య 18 సినిమాకు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో మంగళవారం ఉదయం ప్రారంభమైంది.

04/05/2016 - 23:44

‘ప్రేమకథాచిత్రమ్’తో హీరోయిన్‌గా ఆకట్టుకుని, ఇప్పటివరకు హోలీ పాత్రలతో ఆకట్టుకున్న ఈ భామకు ఇప్పుడు అవకాశాలు పట్టేయాలంటే గ్లామర్ అస్త్రం వాడక తప్పదనే విషయం అర్థం అయినట్టుంది హీరోయిన్ నందిత. అందుకే కథ డిమాండ్ చేస్తే గ్లామర్‌కు రెడీ అంటుంది. హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న నందిత, ప్రేమకథాచిత్రమ్ తరువాత మళ్లీ హిట్ దక్కలేదు. దాంతో ఈ భామకు ఈమధ్య అవకాశాలు బాగా తగ్గాయి.

04/05/2016 - 23:42

తమిళంలో విజయవంతమైన జీవా చిత్రాన్ని విశాల్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి తెలుగులో అందిస్తున్నారు. విష్ణు, శ్రీదివ్య జంట గా నటించిన ఈ చిత్రానికి సుశీంద్రన్ దర్శకత్వం వహించారు. విశాల్, ఆర్య ఈ సినిమాను రూపొందించారు. తెలుగులో పేరు నిర్ణయించని ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాత హరి తెలిపారు.

04/05/2016 - 23:41

బాలీవుడ్ గ్లామర్ గర్ల్ బెబో.. అదేనండి కరీనాకపూర్ పెళ్లిచేసుకుని బాలీవుడ్‌లో మళ్లీ సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈమెకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. అర్జున్‌కపూర్‌తో కలిసి నటిస్తున్న ‘కి అండ్ కా’ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తరువాత మరో రెండు సినిమాలు చేస్తున్న ఈ భామకు ఇప్పుడు హాలీవుడ్ ఛాన్స్ దక్కింది.

04/05/2016 - 23:39

తెలుగులో అగ్రతారగా వెలుగుతున్న రకుల్‌ప్రీత్‌సింగ్ అంతకంటే ముందు తమిళ చిత్రసీమలో కొన్ని సినిమాలు చేసింది. నటుడు అరుణ్ విజయ్‌కు జంటగా ‘తడైయారు తాక్క’ చిత్రం ద్వారా తమిళ పరిశ్రమకు పరిచయమైన రకుల్‌ప్రీత్‌సింగ్ ఆ తరువాత ‘పుత్తగమ్’, ‘ఎన్నమో ఏదో’ వంటి సినిమాలలో నటించినా అవి తనకు అనుకున్నంత గుర్తింపుతెచ్చి పెట్టలేదు.

04/05/2016 - 23:38

తెలుగులోకంటే కూడా తమిళంలోనే జోరుగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న అందాలతార హన్సికకు ఇప్పుడు కోలీవుడ్‌లో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు బొద్దుగా.. ముద్దుగా ఉంది. ఇలా ఉంటే కోలీవుడ్ జనాలకు బాగానచ్చింది కాబట్టి దాంతో హన్సిక కూడా బొద్దుగా ఉండేందుకే ఆసక్తి చూపింది. మరి ఎందుకో ఏమో ఈమధ్య పెద్దగా అవకాశాలు రాకపోవడం..

04/05/2016 - 23:37

బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా లొకేషన్ల కోసం దర్శకుడు క్రిష్ యూరోప్, ఆఫ్రికాలోని కొన్ని దేశాలను సందర్శించారు. కథలో ప్రధాన భాగమైన యుద్ధ సన్నివేశాల కోసం ఉత్తరాఫ్రికాలోని మొరాకో దేశాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

04/04/2016 - 00:09

ప్రముఖ నటుడు పవన్‌కళ్యాణ్ నటిస్తున్న సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. కె.ఎస్.రవీంద్ర (బాబి) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో పవన్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. తెలుగుతోపాటు హిందీలో ఈనెల 8న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

04/04/2016 - 00:07

జి.వి.ప్రకాష్‌కుమార్, ఆనంది జంటగా లైకా ప్రొడక్షన్స్ పతాకంపై శ్యామ్ ఆంటోన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నాకు ఇంకోపేరుంది’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, బాషా చిత్రంలో రజనీకాంత్ చెప్పిన డైలాగే సినిమాకి పేరుగా నిర్ణయించామని, యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ చిత్రం యువతకు నచ్చుతుందని తెలిపారు.

Pages