S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/04/2016 - 00:06

ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలన్నట్టుగా నయనతార నటిగా అనుభవాన్ని
సంపాదించిన కొద్దీ ఒక్కొక్క కండిషన్‌ను నేర్చుకొని మరీ పాటిస్తోంది. ఓ వైపు
ఎక్స్‌పోజింగ్ చేస్తూనే మళ్లీ కాల్షీట్స్ కోసం వెళ్లినవారితో ‘కండిషన్స్ అప్లై’

04/04/2016 - 00:05

లౌక్యం, జిల్ సినిమాలతో మంచి విజయాలు అందుకున్న గోపీచంద్‌కు సౌఖ్యం డిజాస్టర్‌గా మిగిల్చింది. ఆ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం ఆక్సిజన్. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. గోపీచంద్ సరసన రాశీఖన్నా, మలయాళ బ్యూటీ ఇమానియల్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు ఆర్మీ ఆఫీసర్‌గా కనిపిస్తాడట.

04/04/2016 - 00:03

బాలీవుడ్‌లో సీరియల్ కిస్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఇమ్రాన్ హష్మీ. ఇమ్రాన్ షహ్మీ సినిమాలో లిప్‌లాక్ సన్నివేశాలు ఉండని సినిమాయే లేదు. ఆయన తాజాగా నటిస్తున్న మరో చిత్రం అజహర్. ప్రముఖ టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో అజహర్ రెండో భార్య సంగీతా బిజిలానీ పాత్రలో బాలీవుడ్ భామ నర్గీస్‌పక్రి నటిస్తోంది.

04/04/2016 - 00:02

రావంత్, పావని జంటగా కార్తికేయ ప్రొడక్షన్స్ పతాకంపై ధనుంజయ్ దర్శకత్వంలో పల్లా రమణయాదవ్ రూపొందిస్తున్న చిత్రం ‘నా హృదయం ఊగిసలాడే’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, చీరాల పరిసర ప్రాంతాల్లో షూటింగ్ అంతా పూర్తిచేశామని, సంగీతం హైలెట్‌గా నిలిచే పాటలన్నీ అందరికీ నచ్చుతాయని తెలిపారు.

04/03/2016 - 23:59

సూపర్ స్టార్ రజనీకాంత్, సంచలన దర్శకుడు శంకర్ కలయికలో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతూన్న రోబో 2.0 చిత్రం ఇటీవల ఢిల్లీలోని నెహ్రూ స్టేడియంలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకున్న విషయం తెలిసిందే. రజనీ, అక్షయ్‌కుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. మరో షెడ్యూల్‌ను మొరాకోలో చిత్రీకరించాలని అనుకున్నా, ఎండలు తీవ్రంగా ఉండడంతో ఈ షెడ్యూల్‌ని చెన్నయ్‌కి మార్చారు.

04/03/2016 - 23:57

కన్నడంలో విజయవంతమైన హారర్ చిత్రాన్ని తెలుగులో ‘లాస్ట్‌బస్’ పేరిట శ్రీ మంజునాథ మూవీ మేకర్స్ పతాకంపై అందిస్తున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్న ఈ చిత్రంలో అవినాష్ నరసింహ రాజు, మేఘశ్రీ భాగవతార్, ప్రకాష్ బేలవాడి ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

04/03/2016 - 23:56

నందమూరి బాలకృష్ణ తన వందో చిత్రానికి జోరుగా సన్నాహాలు మొదలుపెట్టిన సంగతి
తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం పేరును ఉగాది రోజున ప్రకటిస్తారట.
అమరావతి నేపథ్యంలో గౌతమీపుత్ర శాతకర్ణి కథతో తెరకెక్కే ఈ చిత్రం కొత్త తరహాలో
ఉండాలని బాలయ్య భావిస్తున్నారట. నటీనటులను కూడా బాలీవుడ్ నుంచి దిగుమతి

04/03/2016 - 23:54

సాయిరోనక్, అతిథిసింగ్, ఐశ్వర్య ప్రధాన తారాగణంగా ఐ వింక్ ప్రొడక్షన్స్ పతాకంపై వినోద్ లింగాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుప్పెడంత ప్రేమ. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల సందర్భంగా వినోద్ మాట్లాడుతూ, ఫస్ట్‌లవ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రం ఫీల్‌గుడ్ మూవీగా ఉంటుందని, ఫస్ట్‌లుక్ టీజర్లకు మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు.

04/03/2016 - 23:53

‘పరిశ్రమకు వచ్చి దాదాపుగా పదేళ్లవుతోంది. ఎన్నో రకాల పాత్రలు చేసినా సరైన సంతృప్తి దొరకలేదు. నటిగా నన్ను నేను ఆవిష్కరించుకునే పాత్రలు రాలేదు. గ్లామర్‌కు పరిమితం అయిపోయా’ అని బాధపడుతోంది అందాల తార కాజల్. గుర్తింపు వచ్చింది కానీ మనస్సుకు నచ్చిన పాత్ర ఒకటి మాత్రం చేయలేకపోయానంటోంది. హాస్య ప్రధానంగా సాగే ఓ చిత్రంలో ఫుల్‌లెంగ్త్ కామెడీ రోల్ చేయాలని కాజల్ కోరికట.

04/02/2016 - 21:29

‘ఊపిరి’ చిత్రం ఆసక్తికరంగా, అసభ్యకరమైన సన్నివేశాలు లేకుండా, అర్ధవంతమైన విలువలతో ఆఖరిదాకా సాగింది. సినిమా అన్నతర్వాత వినోదమన్నా వుండాలి, విజ్ఞానమన్నా వుండాలి, సందేశమైనా వుండాలి. ఈ మూడు ఈ చిత్రంలో ఉన్నాయి. అందుకే మంచి సినిమాకు ఆదరణ వుంటుందని ఈ సినిమా నిరూపించింది’ అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు.

Pages