S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/27/2016 - 01:16

ఎంగేజ్‌మెంట్ అయిన తరువాత త్రిష వరుణ్‌తో విడిపోయింది. ఆ బాధను
మర్చిపోవడానికి ఈమధ్య ఎక్కువగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇప్పటికే 30 ప్లస్ వయసు దాటిన ఈమె లేటెస్టుగా ‘నాయకి’ పేరుతో తెరకెక్కుతున్న హారర్ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
దీని తరువాత త్రిష మరో క్రేజీ పాత్రలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు

03/25/2016 - 21:51

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న చిత్రం ‘అ ఆ’. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వచ్చే నెలలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో నితిన్ ఎన్నారైగా నటిస్తున్నాడు.

03/25/2016 - 21:50

వి2 ఫిల్మ్స్ ప్రై. లి. పతాకంపై రాంమోహన్.సిహెచ్. దర్శకత్వంలో అశోక్ గోటి రూపొందించిన చిత్రం ‘పిడుగు’. వినీత్, మోనికా సింగ్ జంటగా నటించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఏప్రిల్ 1న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్, పాటలకు మంచి స్పందన వస్తోందని, హీరోగా పరిచయమైన వినీత్ కమర్షియల్ హీరోగా రాణిస్తాడని తెలిపారు.

03/25/2016 - 21:48

అనేక చిత్రాలలో విలన్‌గా, క్యారెక్టర్ నటుడిగా, హాస్యనటుడిగా ప్రేక్షకుల అభిమానం పొందిన జయప్రకాష్‌రెడ్డికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి తాడిపత్రి సామ్రాజ్యమ్మ (84) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం వారి స్వస్థలం గుంటూరులో కన్నుమూశారు. ఈమెకు నలుగురు సంతానం. వారిలో పెద్దకుమారుడు జయప్రకాష్‌రెడ్డి. ఆమె అంత్యక్రియలను గుంటూరులో శనివారం నిర్వహించనున్నారు.

03/25/2016 - 21:47

బాలకృష్ణ హీరోగా నటించబోయే వందో సినిమా ఏమై వుంటుంది అన్నదే ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ కోసం బాలకృష్ణ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఇప్పటికీ సరైన నిర్ణయాన్ని చిత్ర ప్రముఖులు ప్రకటించలేదు. ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారా అని అనేక పేర్లు ఊహాగానాలుగా వినిపించగా, చివరకు క్రిష్ పేరు ఖరారైంది.

03/25/2016 - 21:45

ఆనంద్ బచ్చు, రాజ్‌బాల, రాధిక, లౌక్య, పప్పుశ్రీనివాస్ ప్రధాన తారాగణంగా విజయశేఖర్ సంక్రాంతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘7 టు 4’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఏప్రిల్ 1న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు విజయశేఖర్ మాట్లాడుతూ, ఒకే ఒక రాత్రిలో జరిగే పలు ఆసక్తికర సంఘటనలతో థ్రిల్లింగ్ నేరేషన్‌తో సాగే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్, ఆడియోను విడుదల చేశామని అన్నారు.

03/25/2016 - 21:43

కృష్ణ, విజయనిర్మల నటించిన ఎస్.బి.ఎస్. ప్రొడక్షన్స్ పతాకంపై ముప్పలనేని శివ దర్శకత్వంలో శ్రీ సాయిదీప్ చాట్ల, వై.బాలురెడ్డి, షేక్ సిరాజులు సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘శ్రీశ్రీ’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది.

03/25/2016 - 21:42

అలీరజా, సీతా నారాయణన్ జంటగా ఎన్.లక్ష్మీనందా దర్శకత్వంలో మువ్వా సత్యనారాయణ రూపొందిస్తున్న చిత్రం ‘రామ్ ఎన్నారై’ (పవర్ ఆఫ్ రిలేషన్‌షిప్). ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, మానవ సంబంధాల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కథ కథనాలు హైలెట్‌గా వుంటాయని, శ్రావణ్ అందించిన పాటలు అందరికీ నచ్చుతాయని తెలిపారు.

03/25/2016 - 21:40

రామ్‌శంకర్, నికిషా పటేల్ జంటగా వాసుదేవ్ దర్శకత్వంలో మేకా బాలసుబ్రహ్మణ్యం, సురేష్ వర్మ ఇందుకూరి, నక్కా రామేశ్వరి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘అరకు రోడ్డులో’. ఈ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలు ముగింపు దశలో వున్నాయి.

03/25/2016 - 21:38

డైరెక్ట్ తెలుగు చిత్రంలో తొలిసారిగా ‘ఊపిరి’ చిత్రంలో నటించి మంచి ఆదరణనే పొందుతున్నాడు కార్తీ. ఆయన తాజాగా మణిరత్నం చిత్రంలో నటించనున్నాడని సమాచారం. మణిరత్నం సినిమా అంటే భారీ అంచనాలు ఉంటాయని వేరే చెప్పక్కర్లేదు. హీరోయిన్ సాయి పల్లవి జంటగా ఓ రొమాంటిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో కార్తీ పైలెట్‌గా నటిస్తున్నాడు.

Pages