S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/11/2015 - 21:24

మరాఠా యోధుడు పేష్వి బాజీరావ్ జీవితచరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న ‘బాజీరావ్ మస్తానీ’ చిత్రం ప్రమోషన్‌కోసం

12/11/2015 - 21:21

సాయి వినాయక ఫిలింస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో కె.లక్ష్మణ్ రూపొందిస్తున్న ‘మనసు పిలిచింది’ చిత్రానికి సంబంధించిన పాటల రికార్డింగ్ కార్యక్రమం హైదరాబాద్ రామనారాయణ స్టూడియోలో ప్రారంభమైంది. ఎ.ఆర్.సన్ని సంగీత దర్శకత్వంలో పాటలు రికార్డు చేస్తున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్.కె మాట్లాడుతూ, మొత్తం ఐదు పాటలు సన్నివేశపరంగా చిత్రంలో ఉన్నాయని, గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథగా చిత్రీకరిస్తున్నామని తెలిపారు.

12/11/2015 - 21:20

ఆది, ఆదాశర్మ జంటగా శ్రీనివాసాయి స్క్రీన్స్ పతాకంపై మదన్ దర్శకత్వంలో పి.సురేఖ రూపొందించిన చిత్రం ‘గరం’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ టీజర్‌ను హైదరాబాద్‌లో హీరో ప్రభాస్ విడుదల చేశారు.

12/11/2015 - 21:16

దర్శకుడు లక్ష్మణ్ మురారి తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న చిత్రానికి ‘రజనీకాంత్ డ్రెస్సింగ్ రూమ్’గా ఖరారు చేశారు. కలర్ విజన్ అనే అంశం ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఆత్మల నేపథ్యం గూర్చి చర్చించనున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మురారి మాట్లాడుతూ, 45 నిమిషాల గ్రాఫిక్స్ కార్యక్రమాల కోసం లాస్‌ఏంజిల్స్‌లోని ప్రిస్విన్ స్టూడియోతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.

12/11/2015 - 21:14

ప్రస్తుతం అల్లు అర్జున్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇప్పటివరకు చేయనటువంటి యాక్షన్‌ను బన్నీ చేస్తున్నాడట. రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరిదశలో వుంది. బోయపాటి శైలిలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘సరైనోడు’ అనే టైటిల్‌ను పెట్టే ఆలోచనలో వుంది యూనిట్.

12/11/2015 - 21:12

తెలుగులో వరుస సినిమాలు చేస్తూ అదే రేంజ్‌లో విజయాలు అందుకుంటూ దూసుకుపోతోంది గ్లామర్ భామ రెజీనా. అందం, అభినయం అన్నీ పుష్కలంగా వున్న ఈ భామకు అదృష్టం మాత్రం కాస్త తక్కువనే చెప్పాలి. వరుసగా హిట్స్ అందుకుంటున్నా కూడా ఈమెకు స్టార్ హీరోల సరసన నటించే అవకాశం మాత్రం దక్కడంలేదు. ఇప్పటికే గోపీచంద్, సాయిధరమ్‌తేజ్, రవితేజ, మనోజ్ వంటి హీరోల సరసన నటించిన ఈ భామకు స్టార్ హీరోల సరసన నటించాలని తెగ ఆసక్తిగా వుంది.

12/10/2015 - 03:17

అప్పట్లో హీరోయిన్‌గా హోలీ పాత్రలతో ఆకట్టుకున్న సుహాసిని అటుపై తల్లి, అక్క పాత్రల్లో నటిస్తూ సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషలతోపాటు మలయాళంలో కూడా నటిస్తూ బిజీగా వున్న సుహాసినికి బాలీవుడ్‌లో క్రేజీ అవకాశం దక్కింది. బాలీవుడ్‌లో ఓ సినిమాలో కీలక పాత్ర చేయడానికి అవకాశం వచ్చిందట. తనకు మంచి గుర్తింపునిచ్చే పాత్ర కావడంతో చేయడానికి కూడా ఓకె చెప్పిందట సుహాసిని.

12/10/2015 - 03:15

ఎన్టీఆర్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా సుకుమార్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘నాన్నకు ప్రేమతో’. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్‌లో జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు త్వరగా పూర్తిచేసి సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

12/10/2015 - 03:13

విభిన్న సినిమాలతో వరుస విజయాలు అందుకుంటున్న యువ హీరో నిఖిల్, తాజాగా ‘శంకరాభరణం’ సినిమాతో ముందుకొచ్చాడు. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న నిఖిల్ తన తదుపరి చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు వుంటారని, ఇప్పటికే తాప్సీ ఓ హీరోయిన్‌గా ఎంపికైంది.

12/10/2015 - 03:12

బాలీవుడ్ నటి రాణిముఖర్జీ తల్లయింది. ముంబైలోని బ్రీచ్‌కాండి ఆస్పత్రిలో ఆమె ఇవాళ ఆడపిల్లను ప్రసవించింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. నిర్మాత ఆదిత్యచోప్రాను గతేడాది ఏప్రిల్ 21న వివాహం చేసుకున్న రాణిముఖర్జీ దంపతులు తమ గారాలపట్టికి ‘అదీర’ అని పేరుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని మరో నిర్మాత కరణ్‌జోహార్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Pages