S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/22/2016 - 22:34

నాగార్జున, కార్తి, తమన్నా ప్రధాన పాత్రల్లో పెరల్ వి.పొట్లూరి సమర్పణలో పివిపి సినిమాస్ బ్యానర్‌పై దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ, భాషల్లో పరమ్ వి.పొట్లూరి, కవిన్ అనే్న నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఊపిరి’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని మార్చి 25న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

03/22/2016 - 22:31

అంపశయ్య నవీన్ తీర్చిదిద్దిన నవల తెరకెక్కుతోంది. శ్యామ్‌కుమార్, పావని ప్రధాన తారాగణంగా జైనీ క్రియేషన్స్, ఓం నమో భగవతే వాసుదేవాయ ఫిలిమ్స్ పతాకాలపై సంయుక్తంగా ప్రభాకర్‌జైనీ దర్శకత్వంలో విజయలక్ష్మి జైనీ రూపొందిస్తున్న చిత్రం ‘అంపశయ్య’. తెలుగుతోపాటు తమిళం, మలయాళంలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

03/22/2016 - 22:29

బీప్ టోన్ స్టూడియోస్, శ్రీ కామాక్షి మల్టీ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బాలకృష్ణ కోలా, వామిక జంటగా గీతాంజలి శ్రీరాఘవ దర్శకత్వంలో కోలా భాస్కర్, కంచెర్ల పార్థసారధి రూపొందిస్తున్న చిత్రం ‘నన్ను వదిలి నీవు పోలేవులే’. చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఏప్రిల్ 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

03/22/2016 - 22:27

శ్రీను, శ్రీవల్లి జంటగా ఖమ్మం క్రియేషన్స్ పతాకంపై నెప్పలి కృష్ణ దర్శకత్వంలో సరోజిని, దేవా, కోటయ్య, రమణారెడ్డి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘మయసభ’. ఈ చిత్రానికి సంబంధించిన 50 శాతం షూటింగ్ పూర్తిచేశారు.

03/22/2016 - 22:17

పటమటలంక నవీన్, ఈశ్వర్‌రెడ్డి, సుహాస్, నిశాంత్ ప్రధాన పాత్రల్లో సినీ అవుట్‌లుక్ క్రియేషన్స్ బ్యానర్‌పై పటమటలంక ప్రవీణ్ దర్శకత్వంలో కళ్యాన్‌కుమార్ నిర్మిస్తోన్న లఘు చిత్రం ‘రాజావారి మిత్రబృందం’. ఈ సినిమాను ఈ నెలలో యూట్యూబ్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు పడమట లంక ప్రవీణ్ మాట్లాడుతూ ‘హరిశ్చంద్రుడు లాంటి నీతిమంతుడు నేటి యుగంలో ఉంటే ఎలా వుంటుందనేదే సినిమా కథ.

03/22/2016 - 22:14

మంచు మనోజ్, జగపతిబాబు, వడ్డే నవీన్, ప్రకాష్‌రాజ్, సురభి ప్రధాన తారాగణంగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ శుభశే్వత ఫిలింస్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘అటాక్’. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో వరుణ్, తేజ, శే్వతలాన, సి.వి.రావు సంయుక్తంగా నిర్మించారు. రవిశంకర్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరారాబాద్‌లో జరిగింది. ఆడియో సీడిని రామ్‌గోపాల్‌వర్మ విడుదల చేశారు.

03/20/2016 - 23:13

టి.ఎస్.ఆర్. ప్రధాన పాత్రధారిగా సంగాల దయానంద క్రియేషన్స్ పతాకంపై కుమార్‌రాజా దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘క్రీస్తు యేసు’. ఈ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తికావస్తున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ..

03/20/2016 - 23:11

అడవి శేషు, అదాశర్మ, అనసూయ ముఖ్యపాత్రల్లో నటించిన ‘క్షణం’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి హిట్‌ని సొంతం చేసుకుంది.

03/20/2016 - 23:10

క్రేజీ హీరోయిన్లు స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటిస్తూనే మరోవైపు ప్రత్యేక పాటల్లో కనిపించి, తమ క్రేజ్‌ని మరింత పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లు దాదాపుగా ఈ ఐటమ్‌సాంగ్స్ చేసి మంచి క్రేజ్ దక్కించుకున్నవాళ్లే. ఇప్పుడు ఈ పరంపర సౌత్‌కి పాకింది. ఇప్పటికే తమన్నా, అనుష్కలాంటి హీరోయిన్లు ప్రత్యేక పాటల్లో కనిపించి, ఔరా అనిపించారు.

03/20/2016 - 23:07

ఎన్టీఆర్, సమంత, నిత్యామీనన్ ముఖ్యపాత్రల్లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జనతా గ్యారేజ్’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబాయిలో జరుపుకుంటోంది. దాదాపు వారంపాటు అక్కడ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. ఈనెల 22తో అక్కడి షెడ్యూల్ పూర్తికానుంది. ఆ తర్వాత 25నుండి హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

Pages