S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/18/2016 - 21:47

బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన ‘క్వీన్’ చిత్రాన్ని రీమేక్ చేయడానికి గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం త్రిష, నయనతారలను అడిగారు. వారిద్దరూ ససేమిరా అనడంతో సరైన నటికోసం ఇన్నాళ్లు ఎదురుచూశారు. ఈ చిత్రానికి రేవతి దర్శకత్వం వహిస్తుండగా, మరో దర్శకురాలు సుహాసిని మణిరత్నం సంభాషణలు అందిస్తుండడం విశేషం.

03/18/2016 - 21:43

త్రిష, గణేష్ వెంకట్రామన్ ప్రధాన పా త్రల్లో గోవి దర్శకత్వంలో గిరిధర్ ప్రొడక్షన్స్ హౌస్ పతాకంపై మామిడిపల్లి గిరిధర్ నిర్మిస్తున్న చిత్రం ‘నాయకి’. రాజ్‌కందుకూరి సమర్పకులు. ఈ చిత్రం టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు టీజర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, టీజర్ చాలా ఇంప్రెస్‌గా వుందని, సినిమా తప్పకుండా బాగుంటుందనే నమ్మకం కలిగిందని అన్నారు.

03/18/2016 - 02:22

రుద్ర, వెనె్నల, సంజయ్, బంగారం ప్రధాన తారాగణంగా ఎం.వి.సాగర్ దర్శకత్వంలో కెల్లం కిరణ్‌కుమార్ రూపొందించిన చిత్రం ‘వీరి వీరి గుమ్మడిపండు’. శివకృతి క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా వుంది.

03/18/2016 - 02:20

శ్రీనివాసరెడ్డి, ధీరేంద్ర, ప్రవీణ్, బిందు, కారుణ్య హీరో హీరోయిన్లుగా శ్రీకర్‌బాబు దర్శకత్వంలో వేద ఎంటర్‌ప్రైజెస్ ప్రొడక్షన్ నెంబర్ 2 సినిమా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. దగ్గుబాటి వరుణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రసన్నకుమార్ క్లాప్ కొట్టగా.. అశోక్‌కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రేలంగి నరసింహారావు గౌరవ దర్శకత్వం వహించారు.

03/18/2016 - 02:18

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో ప్రత్యేకంగా సిని మా పరిశ్రమ అభివృద్ధికి పైసా కూడా కేటాయించకపోవడం నిరాశాజనకంగా వుందని తెలంగాణ సిని మా ప్రొటెక్షన్ ఫోరం ప్రతినిధి రఫి ఆవేదన వ్యక్తం చేశారు.

03/18/2016 - 02:15

సతీష్‌బాబు, మెరినా అబ్రహం జంటగా రిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాజు కుంపట్ల దర్శకత్వంలో జనార్దన్ మందుముల నిర్మిస్తోన్న చిత్రం ‘రొమాన్స్ విత్ ఫైనాన్స్’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని మార్చి 18న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో సతీష్‌బాబు గురువారం విలేకర్లతో ముచ్చటించారు.

03/18/2016 - 02:13

‘్భలే భలే మగాడివోయ్’ హిట్‌తో దర్శకుడిగా స్టార్ స్టేటస్ కొట్టేసిన మారుతి, ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌తో ‘బాబు బంగారం’ పేరుతో ఓ కామెడీ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. వెంకీ స్టైల్లో సరదాగా సాగే ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో ఓ స్పెషల్ సాంగ్‌లో పంజాబీ మోడల్ సోనమ్ భజ్వా కనిపించనున్నారని తెలుస్తోంది.

03/18/2016 - 02:11

శ్రీ ఓమ్ డి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై అజ్మీర చందూ దర్శకత్వంలో ఆదర్శబాబు, పావని జంటగా రూపొందించిన చిత్రం ‘నాన్న.. నేను.. వర్ష’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

03/18/2016 - 02:06

సినిమాల్లో వచ్చే లిప్‌లాక్ సన్నివేశాలు.. రొమాంటిక్ సన్నివేశాలు కథ డిమాండ్ చేస్తే ఎలాంటి సన్నివేశాల్లోనైనా నటించడానికి రెడీ అని అంటోంది అందాలభామ అలీషా! తారా అలీషా ఎవరో తెలుసా? అప్పట్లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘100 పర్సెంట్ లవ్’ చిత్రంలో కీలక పాత్రలో నటించి, ఆ తరువాత జె.డి.చక్రవర్తి దర్శకత్వంలో ‘మనీ మనీ మోర్ మనీ’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది ఈమే.

03/18/2016 - 02:04

కోరుకుంటున్నానని చెప్పారు. రామ్ కార్తిక్ మాట్లాడుతూ, రెండు వందలకు పైగా థియేటర్స్‌లో సినిమాను రిలీజ్ చేస్తున్నామని, సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోందని, ఈ సినిమాలో నాకు ఛాన్స్ రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ సినిమాకు సంగీతం:కమలాకర్, కెమెరామెన్:సంతోష్ శానమోని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:కొల్లు శివనాగేంద్రరావు, ఎడిటర్:వి.నాగిరెడ్డి, దర్శకుడు:బెల్లం రామకృష్ణారెడ్డి.

Pages