S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/13/2016 - 02:55

చైనా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో భారతదేశంనుండి పాల్గొన్న ఆదిత్య చిత్రానికి అవార్డు లభించింది. చైనా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికై ఉత్తమ బాలల చిత్రంగా అవార్డు అందుకున్న ఆదిత్య (క్రియేటివ్ జీనియస్) చిత్రాన్ని సంతోష్ ఫిలింస్ పతాకంపై భీమగాని సుధాకర్‌గౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.

03/13/2016 - 02:53

* చిత్ర నిర్మాణానికి సన్నాహాలు
* ముందుకొచ్చిన ముగ్గురు యువకులు

03/13/2016 - 02:52

శివాజీ, నమ్రత, నిశాదేశ్ ప్రధాన పాత్రల్లో ఇషాక్ దర్శకత్వంలో లక్ష్మీ వేంకటేశ్వర ఫిలింస్ పతాకంపై జగదీష్ నిర్మించిన చిత్రం ‘సీసా’.

03/13/2016 - 02:52

తన ఆరోగ్యం బాగానే ఉందని సుప్రసిద్ధ యాంకర్ సుమ చెప్పారు. గొంతు సంబంధిత సమస్యతో తాను మూడు నెలల విశ్రాంతి తీసుకోనున్నట్లు వచ్చిన వార్తలు చూసి అభిమానులు ఆందోళన చెందారని, అయితే తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, ఎప్పటిలా షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని ఆమె స్పష్టం చేశారు.

03/13/2016 - 02:51

తనదైన స్టైల్‌తో సినిమాలు రూపొందిస్తూ టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు పూరి జగన్నాధ్. ఇటీవలే ‘లోఫర్’ చిత్రాన్ని రూపొందించిన ఆయన ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషల్లో ‘రోగ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తరువాత పూరి హిందీలో ఓ చిత్రం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. హిందీలో ప్రముఖ నటుడు సంజయ్‌దత్ హీరోగా ఈ చిత్రం ఉంటుందని తెలిసింది.

03/13/2016 - 02:50

శ్రీలంకనుండి వచ్చిన జాక్విలిన్ ఫెర్నాండెజ్ ముంబైకి నక్కతోక తొక్కి వచ్చిందని బాలీవుడ్ సినీ పండితులు చెబుతున్నారు. ఏకంగా సల్మాన్‌ఖాన్‌తోనే ‘కిక్’ చిత్రంలో నటించాక జాక్విలిన్‌కు స్టార్ తిరిగింది. ప్రతి విషయాన్ని స్టైల్‌గా ఆచరించి చూపించే జాక్విలిన్ ముంబైలో హల్‌చల్ చేస్తోంది. ఉదయానే్న నిద్రలేచిన దగ్గర్నుంచి తాను ఎక్కడికివెళితే అక్కడే ఫొటోలు తీసి అందరికీ చేరేలా చేస్తోంది.

03/13/2016 - 02:49

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ వందో చిత్రానికి సన్నాహాలు జోరందుకున్నాయి. ఇప్పటికే పలువురు దర్శకుల పేర్లు వినిపించిన విషయం తెలిసిందే. ఫైనల్‌గా ఈ సినిమా ఓకె అయినట్టు సమాచారం. ప్రముఖ దర్శకుడు క్రిష్ చెప్పిన కథ బాగా నచ్చడంతో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట బాలకృష్ణ. అమరావతి బ్యాక్‌డ్రాప్‌లో గౌతమిపుత్ర శాతకర్ణి అనే రాజు కథతో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలిసింది.

03/12/2016 - 00:20

ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఎఆర్ రెహమాన్ నిర్మాతగా, స్క్రిప్ట్‌రైటర్‌గా కొత్త బాధ్యతలు చేపడుతూ నిర్మిస్తున్న ‘99 సాంగ్స్’ సినిమా పోస్టర్ అత్యద్భుతంగా ఉందని బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమా షూటింగ్ తొందరగా ప్రారంభం కావాలని అమీర్ ‘ట్విట్టర్’లో శుభాకాంక్షలు తెలిపాడు.

03/12/2016 - 00:19

తెలుగు వారికి సుపరిచిత మైన ప్రముఖ యాంకర్ సుమ అస్వస్థతకు గురయ్యారు. స్వరపేటిక ఇనె్ఫక్షన్‌తో బాధపడుతున్న ఆమె మూడు నెలలపాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. స్పష్టమైన ఉచ్ఛారణ, సమయ స్ఫూర్తితో తెలుగువారి మెప్పు పొందిన సుమ యాంకర్, సినీకార్యక్రమాల ప్రజెంటర్‌గా రాణించారు. కొద్దికాలం క్రితం ఇదే సమస్యతో సుమ ఇబ్బందులు పడ్డారు.

03/12/2016 - 00:15

హీరోయిన్‌గా పరిచయమై పలు చిత్రాల్లో నటించినప్పటికీ పాపం కెరీర్ పరంగా ఒక్క కమర్షియల్ హిట్ దక్కలేదు. దాంతో గ్లామర్‌ను నమ్ముకొని అవకాశాలు కొట్టేసింది అందాల భామ శ్రద్ధాదాస్. ఇటీవలే ‘గుంటూర్ టాకీస్’లో రెచ్చిపోయి మరీ బోల్డ్‌గా నటించి, అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఈ భామకు మంచి పేరే దక్కింది. ఇప్పటికే తమిళ, హిందీ, కన్నడ భాషల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నా లాభం లేకపోయింది.

Pages