S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/12/2016 - 00:14

‘హార్ట్‌ఎటాక్’ సినిమా తర్వాత ఎన్ని సినిమాలు చేసినా పెద్దగా లాభం లేకపోయింది. తాజాగా వచ్చిన ‘క్షణం’ సినిమాతో హిట్ అందుకున్న బాలీవుడ్ భామ అదాశర్మకు తమిళంలో ఓ క్రేజీ అవకాశం దక్కింది. తమిళ స్టార్ హీరో శింబు హీరోగా నటిస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. ‘ఇదునమ్మఆలు’ చిత్రంలో శింబు మాజీ లవర్ పాత్రలో కనిపించబోతోంది. దాంతోపాటు ఈ సినిమాలో ఓ హాట్ సాంగ్ కూడా చేయనుంది.

03/12/2016 - 00:13

బాలీవుడ్‌లో సంచలన తారగా గుర్తింపు తెచ్చుకుని, గ్లామర్‌తో ఆకట్టుకున్న నేహాధూపియాకు ఈమధ్య కెరీర్ బాగా వెనకబడిపోయింది. ఇప్పటికే హీరోయిన్ల మధ్య గట్టి పోటీ వుండడంతో ఈ బామకు అవకాశాలు కూడా దక్కడంలేదు. అప్పట్లో ‘జూలీ’ సినిమాతో అందాలు ఆరబోసి సంచలనం సృష్టించిన నేహా చాలాకాలంపాటు బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా కొనసాగింది. ఇప్పుడు అవకాశాలు తగ్గడంతో మళ్లీ తన ఉనికిని చాటుకునేందుకు తెగప్రయత్నాలు చేస్తోంది.

03/12/2016 - 00:12

ప్రస్తుతం పెరుగుతున్న కాలుష్యం దృష్ట్యా మనం తినే ఆహారంలో చాలా రసాయన పదార్థాలు కలుస్తున్న విషయం తెలిసిందే. ప్రజలు ఎక్కువగా కెమికల్ ఫుడ్‌ను కాకుండా ఎలాంటి రసాయనాలు ఉపయోగించని ఆర్గానిక్ ఫుడ్‌ను తీసుకోవాలని, ఇలాంటి ఆహారాన్ని ప్రజలకు అందించడానికి ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ ముందుకొచ్చాడు. ప్రకాష్‌రాజ్ ఫౌండేషన్ పేరుతో ఇటీవలే ఆయన తెలంగాణాలోని కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.

03/12/2016 - 00:11

విషురెడ్డి, వర్ధన్‌రెడ్డి, ఐరా ప్రధాన పాత్రల్లో మహంతి పి.కె. దర్శకత్వంలో కొండ్రెడ్డి సతీష్‌చౌదరి నిర్మిస్తున్న ‘వాడు వీడు ఓ కల్పన’ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలంగాణా సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సీడీని ఆవిష్కరించి, ఎ.పి. మంత్రి మాణిక్యాలరావుకు అందజేశారు.

03/12/2016 - 00:08

త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత జంటగా నటిస్తున్న ‘అ..ఆ’
చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను నేడు విడుదల చేశారు.

03/12/2016 - 00:07

అక్కినేని మూడోతరం వారసుడు అక్కినేని అఖిల్ హీరోగా పరిచయవౌతూ రూపొందిన అఖిల్ చిత్రం బాక్సాఫీసువద్ద బోల్తాపడడంతో తన రెండో చిత్రంపై ఎక్కువ దృష్టి సారించారు. ఇప్పటికే పలు కథలు వింటున్న అఖిల్ తన రెంతో సినిమాకు సన్నాహాలు మొదలుపెట్టాడు. ఇటీవలే అఖిల్ సినిమాకు దర్శకుడు ఓకే అయినట్టు తెలుస్తోంది.

03/12/2016 - 00:06

శైలేష్ బొలిశెట్టి, దీక్షాపంత్, అంగనారాయ్ ప్రధాన తారాగణంగా మోహన్‌ప్రసాద్ దర్శకత్వంలో మారిశెట్టి రాఘవయ్య రూపొందిస్తున్న చిత్రం ‘చల్ చల్ గుర్రం’. డీటిఎస్ కార్యక్రమాలు జరుపుకుంటున్న చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు మోహనప్రసాద్ చిత్ర విశేషాలను వివరిస్తూ చల్ చల్ గుర్రంలో దాదాపు 34 పాత్రలుంటాయి. కానీ ఏ పాత్రా మరో పాత్రతో రక్తసంబంధం కలిగి ఉండకపోవటం విశేషం. ఇదొక యునీక్ కానె్సప్ట్.

03/11/2016 - 00:48

నవకళాపారి పతాకంపై శశాంక వౌళి, పావని జంటగా రత్నా దర్శకత్వంలో శ్రీను విద్యగిరి, ప్రసాద్ కుమార్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘కత్రిన కరీన మధ్యలో కమల్‌హాసన్’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ హాల్‌లో విడుదల చేశారు.

03/11/2016 - 00:47

నితిన్, సమంత జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ రూపొందిస్తున్న చిత్రం ‘అ ఆ’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఈమధ్య పొల్లాచ్చిలో ఓ షెడ్యూల్ పూర్తయింది. ప్రస్తుతం వైజాగ్‌లో మరో షెడ్యూల్ జరుపుతున్నారు. నితిన్ హీరోగా వైజాగ్ జగదాంబ థియేటర్ పరిసరాల్లో చిత్రీకరణ సాగుతోంది.

03/11/2016 - 00:47

శర్వానంద్ ఈమధ్య టాలీవుడ్‌లో రింగ్‌రాజాగా దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ‘రన్ రాజా రన్’, ‘ఎక్స్‌ప్రెస్‌రాజా’లాంటి మంచి హిట్స్ ఆయన ఖాతాలో పడ్డాయి. ఇప్పుడు ‘రాజాధిరాజా’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతోపాటు ఆయన మరో సినిమాకు సన్నాహాలు మొదలుపెట్టాడు. శర్వానంద్‌తో ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ వంటి ఫీల్ గుడ్ ప్రేమకథను అందించిన క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది.

Pages