S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/11/2016 - 00:46

నాగచైతన్య ఇప్పుడు మంచి జోరుమీదున్నాడు. ఇప్పటికే ‘ప్రేమమ్’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలతో బిజీగా వున్న నాగచైతన్యతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్. తెలుగులో ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు రూపొందించిన సెల్వ రాఘవన్ ఇప్పుడు నాగచైతన్యతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ సన్నాహాలు కూడా పూర్తికావొచ్చాయి.

03/11/2016 - 00:45

విశాల్ కథానాయకుడిగా పాండ్యరాజ్ దర్శకత్వంలో విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రూపొందించిన చిత్రం కథకళి. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 18న విడుదలకు సిద్ధం చేశారు.

03/11/2016 - 00:45

గత ఏడాది ‘గోపాల గోపాల’ సినిమాను రూపొందించిన దర్శకుడు డాలి దర్శకత్వంలో వెంకటేష్ మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా నటిస్తున్న మారుతి సినిమా ‘బాబు బంగారం’ షూటింగ్ జోరుగా జరుగుతోంది. ఈ సినిమా తరువాత వెంకటేష్ నటించే చిత్రం డాలీతోనే ఉంటుంది.

03/11/2016 - 00:44

అంజలి ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న సినిమా ‘చిత్రాంగద’. శ్రీవిఘ్నేక్ కార్తిక్ సినిమా అండ్ క్రియేటివ్ ద్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీ్ధర్, రెహమాన్ సంయుక్తంగా అశోక్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం కథానాయిక అంజలి ‘డింగ్ డాంగ్’ అంటూ ఓ పాటను ఆలపించడం విశేషం.

03/11/2016 - 00:43

-- అక్కినేని అఖిల్ --
నాగార్జున, కార్తి, తమన్నా ప్రధాన తారాగణంగా పివిపి సినిమా పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో పరం వి.పొట్లూరి, కవిన్ అనె్న రూపొందిస్తున్న చిత్రం ‘ఊపిరి’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో గురువారం ఉదయం విడుదల చేశారు.

03/11/2016 - 00:42

ప్రస్తుతం ‘సరైనోడు’ చిత్రంలో అల్లు అర్జున్ నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మరో సినిమా జోరుగా మొదలుపెట్టనున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలు చేయడానికి సిద్ధమైన అల్లు అర్జున్‌తో ఈ సినిమా చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు శ్రీను వైట్ల. బన్నీకి కథ కూడా చెప్పాడట. కథ బాగా నచ్చడంతో అర్జున్ ముందుకు వచ్చాడని సమాచారం.

03/11/2016 - 00:42

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘2.0’. ‘రోబో’ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దిల్లీలో జరుగుతోంది. అక్కడే మూడు వారాలపాటు షూటింగ్ జరుగుతుందని తెలిసింది. ఈ షెడ్యూల్‌లో కీలక పాత్రధారులు అందరూ పాల్గొంటారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రజనీకాంత్ కెరీర్‌లో ‘రోబో’ సినిమా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

03/09/2016 - 21:48

గోవా భామ ఇలియానా దక్షిణాది సినిమాలు వదిలేసిన తరువాత బాలీవుడ్‌లో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించినా పెద్దగా కలిసిరాలేదు. చేసిన రెండు మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలవడంతో ఈమెకు వచ్చే అవకాశాలు కూడా రావడం మానేశాయి. దాంతో అవకాశాల కోసం వెతుక్కునే పనిలో పడింది. దాంతోపాటు ఖాళీగా వుండలేక సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తూ బాగానే పాపులారిటీ తెచ్చుకుంటోంది.

03/09/2016 - 21:47

ఈమధ్య టాలీవుడ్‌లో పాపులర్ హీరోయిన్లు పలు సినిమాల్లో ప్రత్యేక పాటల్లో నర్తించేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఐటెమ్ సాంగ్‌తో వారికి మరింత ఎక్కువ క్రేజ్ రావడంతో ఈ పాటలపై ఆసక్తి పెంచుకున్నారు. తాజాగా ఈ లిస్టులో మరో గ్లామర్ భామ చేరింది.

03/09/2016 - 21:45

మానస్, సనమ్ శెట్టి జంటగా ఎస్.ఎస్. సినిమాస్ పతాకంపై కళాసందీప్ దర్శకత్వంలో లక్ష్మీనారాయణ రెడ్డి, ఇసనాక సునీల్ రెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘ప్రేమికుడు’. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

Pages