S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/05/2015 - 07:02

‘గీతాంజలి’ సినిమాతో మంచి హిట్‌ను అందుకున్న తెలుగు భామ అంజలికి ప్రస్తుతం అవకాశాలు జోరందుకున్నాయి. ప్రముఖ నటుడు బాలకృష్ణ సరసన ‘డిక్టేటర్’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న అంజలి, మరోవైపు గెస్ట్‌పాత్రలకు కూడా ఓకె చెబుతోంది. ఇటీవలే ‘శంకరాభరణం’ చిత్రంలో గెస్ట్ పాత్రలో నటించిన ఈ భామకు తాజాగా మరో క్రేజీ అవకాశం దక్కింది. మంచు విష్ణు హీరోగా నటించే చిత్రంలో రెండో హీరోయిన్‌గా అంజలి ఎంపికైంది.

12/05/2015 - 07:01

టిఎస్‌ఆర్ ఏసుక్రీస్తు పాత్రలో సంగాల దయానంద క్రియేషన్స్ పతాకంపై చండ్ర పార్వతమ్మ నిర్మించిన చిత్రం క్రీస్తుఏసు. ఈ చిత్రంలోని పాటలు ఇటీవలే హైదరాబాద్‌లో విడుదలయ్యాయి.

12/05/2015 - 07:01

సంగీత దర్శకుడు భీమ్స్

12/05/2015 - 07:00

ఈ ఏడాది రామ్‌చరణ్‌కు పెద్దగా అనుకూలించినట్టులేదు. నటించిన రెండు సినిమాలు పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో వున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘బ్రూస్‌లీ’ చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఇపుడు తమిళంలో సూపర్‌హిట్ అయిన ‘తని ఒరువన్’ సినిమా రీమేక్‌లో నటించేందుకు రెడీ అయ్యాడు.

12/05/2015 - 06:59

గోపీచంద్, రెజీనా జంటగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో వి.ఆనంద్ ప్రసాద్ రూపొందించిన చిత్రం ‘సౌఖ్యం’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన టీజర్‌కు విశేష స్పందన లభిస్తోందని, కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ‘సౌఖ్యం’ సినిమా షూటింగ్ అంతా పూర్తయిందని తెలిపారు.

12/05/2015 - 06:59

జగపతిబాబు, మీరానందన్ జంటగా విప్లవ్ దర్శకత్వంలో కె.ఎస్.వి. ఫిలింస్ పతాకంపై నిర్మాత కె.ఎస్.వి. నిర్మించిన చిత్రం ‘హితుడు’.

12/05/2015 - 06:58

అందాన్ని ప్రదర్శించడానికి వయసుతో పనిలేదని నిరూపిస్తోంది ఆల్ ఇండియా అతిలోక సుందరి శ్రీదేవి. ముదిమి మీదపడుతున్నా చూపులు తిప్పుకోలేనట్లు సైజ్ జీరో లెవెల్లో హొయలు పోతూ ఫొటోషూట్ చేసింది శ్రీదేవి. ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి విజయ్‌తో చేసిన పులి సినిమాలో పాత్రకు మంచి గుర్తింపే వచ్చింది. ఓ రకంగా ప్రతినాయికగా నటించిన పులి చిత్రంలో ఆమె నటనకు మార్కులే పడ్డాయి.

12/05/2015 - 06:58

ప్రముఖ నటుడు రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘కబాలీ’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా రాధికా ఆప్టే నటిస్తోంది. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే తెలుగులో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుపుతున్నారు. మలేసియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే ఈ చిత్రంలో రజనీకాంత్ మాఫియా డాన్ పాత్రలో నటిస్తున్నాడు.

12/05/2015 - 06:57

వరస వర్షాలతో అతలాకుతలమైన చెన్నై వరద బాధితులను ఆదుకునేందుకు చలనచిత్ర రంగం చేయూతనిస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన ఎందరో ప్రముఖులు ఇప్పటికే తమవంతు సహాయం అందించారు. కాగా దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ తాజాగా కోటి రూపాయల విరాళం ప్రకటించారు. తెలుగు చిత్రసీమకు చెందిన అల్లు అర్జున్ రూ. 25 లక్షలు, ప్రభాస్, కృష్ణంరాజు రూ. 15 లక్షలు, ఏపీలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలకోసం రూ.

12/03/2015 - 00:41

తెలుగులో పవన్‌కళ్యాణ్‌కున్న ఇమేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఆయన సరసన హీరోయిన్‌గా నటించాలని చాలామంది హీరోయిన్లు తహతహలాడుతూంటారు. ఈ విషయంపై చాలామంది పవన్‌తో నటించాలనుందనే విషయాన్ని బయటపెట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా లక్ష్మీరాయ్‌కు మాత్రం ఆ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. పవన్‌కళ్యాణ్ తాజాగా నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ సినిమాలో ఈమె ఓ ఐటెం సాంగ్ చేస్తున్న విషయం తెలిసిందే.

Pages