S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/26/2016 - 01:23

కార్తిక్‌రాజు, నిత్యశెట్టి, సామ్ ప్రధాన పాత్రల్లో అయాన్ క్రియేషన్స్ బ్యానర్‌పై చునియా దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం ‘పడేసావే’. ఈ సినిమా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది. యూనిట్ సభ్యులకు నాగార్జున ప్లాటినం డిస్క్ షీల్డ్‌లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘సినిమా మ్యూజిక్ పెద్ద హిట్ అయింది. జెన్యూన్‌గా సినిమా నచ్చి ప్రమోట్ చేయాలనుకున్నాను.

02/26/2016 - 01:22

‘అలా మొదలైంది’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి నిత్యామీనన్. మొదటి సినిమాతోనే మంచి అభినయ సామర్థ్యం ఉన్న నటిగా గుర్తింపుపొందిన ఆమె మొదట్లో బాలనటిగానూ నటించి, ఆ తరువాత జర్నలిజం వైపు మొగ్గు చూపి డిగ్రీ చేసింది. తరువాత పూణె ఫిలిం ఇనిస్టిట్యూట్ సినిమాటోగ్రఫీ కోర్సు చేద్దామని ప్రయత్నించి ‘అలా మొదలైంది’తో మనముందుకు వచ్చింది.

02/26/2016 - 01:19

కథాబలమున్న చిత్రాల్లో నటించడానికి నాగశౌర్య సిద్ధవౌతున్నాడు. లార్గన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ అక్కల రూపొందిస్తున్న ఓ చిత్రానికి ఆయన రెడీ అయ్యాడు. ఈ చిత్రం ద్వారా సాయిచైతన్య అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నారు.

02/26/2016 - 01:18

నా సినిమాలు విడుదలవుతుంటే పెద్ద హీరోల సినిమాలు విడుదల కావడానికి జంకేవని అప్పట్లో పెద్ద ప్రచారం జరిగింది. నా సినిమాలకు అంత సీన్‌లేదు అంటోంది శృంగార తార షకీలా. పెద్ద హీరోల సినిమాలు సంవత్సరానికి రెండు,మూడు విడుదలైతే నా సినిమాలు వారానికి ఒకటి విడుదలయ్యేవి. వాళ్ల సినిమాలు ఆలస్యంగా విడుదలైతే, నా సినిమాలు చాలా వేగంగా విడుదలయ్యేవి. అంతకుతప్పితే మరేం లేదు అని తీసిపారేసింది.

02/26/2016 - 01:15

కామెడీ హీరోగా ఓ ముద్ర వేసుకున్న అల్లరి నరేష్ తన 13ఏళ్ళ కెరీర్‌లో 50 సినిమాలు పూర్తిచేసాడు. ఆయన నటించిన తాజా సినిమా ‘మామ మంచు-అల్లుడు కంచు’ ప్రేక్షకులను నిరాశ పరిచింది. దాంతో ఈసారి ప్రేక్షకులను మెప్పించే కథతో రావాలని నరేష్ కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం నరేష్ ఈశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు.

02/24/2016 - 23:57

నవీద్‌ఖాన్, శ్రీ, రీమా ప్రధాన తారాగణంగా నజీమ్ దర్శకత్వంలో లక్ష్మీశ్రీ క్రియేషన్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం షూటింగ్ పూర్తయింది. హాస్య నటుడు అలీ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

02/24/2016 - 23:56

శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై కె.ఎల్.దామోదర్‌ప్రసాద్ ‘అలామొదలైంది’, ‘అంతకుముందు ఆ తరువాత’లాంటి కుటుంబ కథాచిత్రాల తరువాత బి.వి.నందినిరెడ్డి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా మార్చి 4న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా నిర్మాత దామోదర్‌ప్రసాద్ మాట్లాడుతూ, ‘ఈ సినిమా కోసం 14నెలలుగా వర్క్ చేశాం.

02/24/2016 - 23:54

హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని దైవసన్నిధానంలో బుధవారం ఉదయం సూర్య భగవాన్,
లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా హాజరైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మురళీమోహన్.
విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందస్వామి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జరిగాయి.

02/24/2016 - 23:52

‘ఎలుకా మజాకా’ చిత్రంలో కథ ఓ గమ్మతె్తైంది. వినాయకస్వామిని పట్టించుకోని హీరోను ఎలుక ఎలాంటి ఇబ్బందులకు గురిచేసిందన్న కథనంతో రూపొందించారు. ఇది పిల్లలతో కలసి చూడాల్సిన సినిమా.. అని దర్శకరత్న దాసరి నారాయణరావు తెలిపారు.

02/24/2016 - 23:47

సౌత్ క్రేజీ భామ కాజల్ ఈమధ్య కెరీర్ పరంగా స్పీడుమీదుంది. మూడు భాషల్లో ఆమె నటించిన సినిమాలు ఇప్పటికే మంచి సక్సెస్‌ను సాధించాయి. దాంతోకాస్త జోరు పెంచింది కూడా.

Pages