S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/14/2016 - 20:50

రామ్‌చరణ్ కథానాయకుడుగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా

02/14/2016 - 20:49

రాజవౌళి రూపొందించిన ‘బాహుబలి’ ప్రభంజనం చైనా దాకా వెళ్లింది. ఈ సినిమా అంతర్జాతీయ సాంకేతిక విలువలతో రూపొందడంతో పలు హాలీవుడ్ పత్రికల మన్ననలు కూడా పొందింది. విదేశాల్లోని ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది. పలు అంతర్జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించిన ‘బాహుబలి’కి చైనా, జపాన్, జర్మనీ, లాటిన్ అమెరికాలలో విడుదల చేసేంత రెస్పాన్స్ లభించింది.

02/14/2016 - 20:48

‘గౌరవం’ చిత్రంతో హీరోగా మారిన అల్లు శిరీష్ మూడో చిత్రంకోసం చాలాకాలం ఆగి, దర్శకుడు పరశురామ్‌తో ఓ చిత్రం చేయడానికి ముందుకొచ్చారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తికావస్తోంది. కాగా ఫస్ట్‌లుక్‌ను వాలెంటైన్స్‌డే సందర్భంగా ఆదివారం విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘శ్రీరస్తు-శుభమస్తు’ అన్న పేరు కూడా నిర్ణయించారు.

02/14/2016 - 20:48

తల్లిదండ్రులు ఎవరో తెలియని అనాథ పిల్లలు వీధులలో ఎలా బ్రతుకుతున్నారు? వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొని సంఘంలో జీవన పోరాటం చేస్తున్నారు? చివరికి వారి భవిష్యత్ నేరమయంగా ఎందుకు మారుతోంది? అనే నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని దర్శకుడు నంది వెంకటరెడ్డి తెలిపారు.

02/14/2016 - 20:47

‘అలా ఎలా’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హేబాపటేల్ ఆ తర్వాత దర్శకుడు సుకుమార్ కంట్లోపడడంతో ఆయన రాసిన కథతో వచ్చిన ‘కుమారి 21ఎఫ్’ సినిమాతో కథానాయికగా అవకాశాన్ని కొట్టేసింది. రాజ్‌తరుణ్ సరసన నటించి, మంచి క్రేజ్ పొందిన హేబా ప్రస్తుతం జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఓ మల్టీస్టార్ చిత్రంలో నటిస్తోంది.

02/14/2016 - 20:46

శ్రీకాంత్ కథానాయకుడుగా నటించిన టెర్రర్ చిత్రం స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగుతూ ప్రేక్షకులకు థ్రిల్లింగ్ కలిగిస్తుందని దర్శకుడు సతీష్‌కాశెట్టి తెలిపారు. శ్రీకాంత్, నిఖిత జంటగా అఖండ భారత క్రియేషన్స్ పతాకంపై షేక్ మస్తాన్ రూపొందించిన టెర్రర్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలిపారు.

02/14/2016 - 20:46

బాలీవుడ్‌లో విలన్‌గా తెరంగేట్రం చేస్తున్నానని, ఈనెల 19న ఈ చిత్రం విడుదల కానుందని నటుడు భూషణ్ తెలిపారు. ‘రక్తకన్నీరు’ నాగభూషణం మనవడుగా గుర్తింపు పొందిన భూషణ్ గతంలో ‘ఏక్ పోలీస్’, ‘పదహారేళ్ల వయసు’, ‘మ్యావ్’ వంటి చిత్రాల ద్వారా గుర్తింపు పొందాడు. టాలీవుడ్ నుండి రానా, రామ్‌చరణ్ బాలీవుడ్‌కు వెళ్లినట్లుగా ఇప్పుడు ‘రిథమ్’ చిత్రంతో తాను బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నానని ఆయన వివరించారు.

02/13/2016 - 21:53

ఇప్పుడు హీరోయిన్ల దారి మొత్తం గ్లామర్‌వైపే మళ్లింది. ఎవరు ఎంత ఎక్కువగా అందాలను ఆరబోస్తే వారికే అవకాశాలు వచ్చి పడుతున్నాయి. లేదూ, నేను ఇలాగే వుంటానంటే ఇండస్ట్రీలో మనుగడ కష్టమే. ఈ విషయం ఇప్పటి హీరోయిన్లందరికీ బాగా తెలిసిందే. తాజాగా గ్లామర్‌ను ఆరబోసేందుకు మాగ్‌జైన్ ఫొటో షూట్లతో రెచ్చగొడుతున్నారు కూడా.

02/13/2016 - 21:52

తమిళ, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తూ ఓ మోస్తరు హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న అందాల భామ లక్ష్మీరాయ్‌కి ‘కాంచన’ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. ఆ సినిమా తరువాత చాలా అవకాశాలు దక్కాయి. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ తాజాగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పట్లో ఎరోటిక్ మూవీగా సంచలనం సృష్టించిన ‘జూలి’ చిత్రానికి సీక్వెల్‌గా ‘జూలి-2’ రూపొందుతోంది.

02/13/2016 - 21:50

తెలుగు పరిశ్రమలో కమెడియన్‌గా పాపులరై హీరోగా మారి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న నటులు వున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్టులోకి సునీల్ కూడా చేరిపోయాడు. కమెడియన్‌గా స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న సునీల్, ‘అందాల రాముడు’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా తరువాత వచ్చిన ‘మర్యాద రామన్న’ చిత్రం అతనికి మంచి కమర్షియల్ హిట్‌ని అందించింది.

Pages