S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/12/2016 - 20:57

ప్రముఖ నటుడు పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రం షూటింగ్ జోరుగా జరుపుకుంటోంది. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే కేరళలో అందాల భామ కాజల్, పవన్‌లపై ఓ పాటను చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ షెడ్యూల్‌లో ప్రస్తుతం కామెడీ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

02/12/2016 - 20:57

జాతీయ నటుడిగా గుర్తింపు తెచ్చుకుని విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకున్న నటుడు కమల్‌హాసన్. లోకనాయకుడిగా పేరు తెచ్చుకున్న కమల్‌కు ఎప్పటినుంచో ఓ కోరిక వుందని అర్థమవుతోంది. ఆ కోరిక ఏంటంటే, హాలీవుడ్ సినిమాలో నటించడం. ఈమధ్య భారతీయ నటులు హాలీవుడ్‌లో కూడా తమ హవాను సృష్టించుకుంటున్నారు. తాజాగా కమల్ కూడా ఓ సినిమాకు శ్రీకారం చుట్టారని తెలిసింది.

02/11/2016 - 23:28

దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘ఉస్తాద్ హోటల్’ చిత్రాన్ని తెలుగులోకి ‘జతగా’ పేరుతో విడుదల చేస్తున్నారు. పలు హిట్ చిత్రాల్ని అందించిన సురేష్ కొండేటి నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైన సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు చెప్పారు.

02/11/2016 - 23:25

ఈమధ్య టాలీవుడ్‌లో హీరోయిన్ల హవా బాగా ఎక్కువవుతోంది. గ్లామర్‌తో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తూ వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు అందాల భామలు. ఈ కోవలో అందరికంటే ముందుంటోంది ముద్దుగుమ్మ రాశిఖన్నా. చేసిన కొద్ది చిత్రాలతోనే క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ ఫేవరెట్ అయ్యింది. పలువురు హీరో లు రాశిఖన్నానే కావాలని అడుగుతున్నారట.

02/11/2016 - 23:22

ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు సత్యం మనవడిగా తెలుగు తెరకు పరిచయమై తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు డి.జె.వసంత్. తాజాగా ఆయన సంగీత దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పీడున్నోడు’. బెల్లంకొండ శ్రీనివాస్, సోనారిక జంటగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతున్న సందర్భంగా సంగీత దర్శకుడు వసంత్‌తో ఇంటర్వ్యూ...
* రెస్పాన్స్ ఎలా వుంది?

02/11/2016 - 23:18

ప్రముఖ నటుడు నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ మాట్రిక్ టీం వర్క్స్ పతాకంపై అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న చిత్రం ‘నిర్మలా కానె్వంట్’. జి.నాగకోటేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రేయా శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా ఆస్కార్ గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ తనయుడు ఎ.ఆర్.అమీన్ నేపథ్య గాయకుడిగా పరిచయం అవుతున్నాడు.

02/11/2016 - 23:15

యాంగ్రీ యంగ్‌మెన్‌గా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరో రాజశేఖర్‌కు ఈమధ్య సినిమాలు తగ్గిపోయాయి. గత ఏడాది ‘గడ్డం గ్యాంగ్’ సినిమా చేసినా అది అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇప్పటికే ఆయన నటించిన ‘పట్టపగలు’ చిత్రం విడుదలకు సిద్ధంగా వుంది. దాదాపు ఏడాది కాలంగా ముఖానికి రంగేసుకోని రాజశేఖర్ ఇపుడు విలన్ పాత్రలో నటించేందుకు సిద్ధమయ్యాడు.

02/11/2016 - 23:14

భరణి కుమార్, అంజలి, విష్ణు, శిరీష, భాగ్యరాజ్ ముఖ్యపాత్రల్లో హెచ్.వేణుగోపాల్ దర్శకత్వంలో ఎన్.పద్మ సమర్పణలో శ్రీ శివాంబిక సాయి మూవీ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కుతున్న హరర్ ఎంటర్‌టైనర్ ‘రోడ్డుమీద దయ్యం’. ఇటీవలే షూటింగ్‌తోపాటు డబ్బింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలవుతున్న సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత వేణుగోపాల్ వివరాలు తెలియజేస్తూ, హారర్ సస్పెన్స్ అంశాలతో తెరకెక్కిన సినిమా ఇది.

02/11/2016 - 22:59

విభిన్న కథా చిత్రాలు, సహజత్వానికి దగ్గరగా వుండే సినిమాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు నరసింహ నంది. మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు అందుకున్న ఈ దర్శకుడు తాజాగా రూపొందించిన చిత్రం ‘లజ్జ’. ఈ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది మధుమిత. శ్రీ లక్ష్మీ నరసింహ సినిమాస్ పతాకంపై ఇటీవల విడుదలైన ఈ సినిమాతో నటిగా సంచలనం సృష్టించిన హీరోయిన్ మధుమిత చెప్పిన విశేషాలు ఆమె మాటల్లో...

02/11/2016 - 22:56

‘ప్రతి హీరో తన స్వంత
బ్యానర్‌లో ఓ సినిమా చేయాలి. అప్పుడే నిర్మాత కష్టాలేమిటో తెలుస్తాయి’ అని
అంటున్నాడు యువ హీరో ఆది. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గరం’. మదన్ దర్శకత్వంలో శ్రీ శ్రీనివాసాయి స్క్రీన్స్ పతాకంపై పి.సురేఖ
నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ రోజు విడుదలవుతున్న సందర్భంగా హీరో ఆదితో ముఖాముఖి.

Pages