S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/13/2016 - 21:37

బాలీవుడ్‌లో దబ్బూ రత్నాని కేలండర్‌కు విశిష్టస్థానం ఉంది. నూతన సంవత్సరానికి సంబంధించిన కేలండర్‌ను ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. హిందీ చిత్రరంగానికి చెందిన అతిరథమహారథులు హాజరైన ఈ వేడుకలో అలనాటి తారలు, ఈతరం భామలు హాజరైనారు.

01/13/2016 - 21:31

‘బ్రూస్‌లీ’ సినిమా తర్వాత మెగా హీరో రామ్‌చరణ్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో హిట్టయిన ‘తని ఒరువన్’ చిత్రం ఆధారంగా ఇది రూపొందనుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంచితే, తమిళ దర్శకుడు విష్ణువర్థన్ దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేయనున్నట్టు తాజాగా వార్తలొస్తున్నాయి.

01/13/2016 - 21:29

పురాతన దేవాలయాలు నాడు, నేడు ఎలా వున్నాయి అనే అంశంతో ‘సేవ్ టెంపుల్స్’ పేరిట చిత్రీకరించిన డాక్యుమెంటరీలలో ఉత్తమమైనవాటిని ఎంపిక చేసి హైదరాబాద్‌లో నిర్వహించే అంతర్జాతీయ డాక్యుమెంటరీ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించనున్నారు. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, సేవ్ టెంపుల్స్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ డాక్యుమెంటరీ చలన చిత్రోత్సవం- 2016ను హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. సాంస్కృతిక ప్రచార సారధి డా.

01/13/2016 - 21:23

తెలుగు సినిమాకు సంక్రాంతి పండుగ వేళ పోటీ తప్పదని అంటున్నారు హీరో నాగార్జున. ఈ సంక్రాంతికి నాలుగు తెలుగు సినిమాలు విడుదల అవుతుండటంపై ఆయన ఈ వ్యాఖ్య చేశారు. సోగ్గాడే చిన్నినాయన సినిమా సంక్రాంతి నాడు విడుదలవుతున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. నిజానికి ఈ కథలో తాతా మనవడు గూర్చి చెప్పారని, కానీ అలా చేయాలంటే చాలారకాల సమస్యలు ఉంటాయని తండ్రీ కొడుకులుగా మార్చామని చెప్పారు.

01/13/2016 - 03:34

ఈమధ్య దక్షిణాది హీరోయిన్లు గ్లామర్ వదిలిపెట్టి హారర్ పాత్రలవైపు మళ్లారు. ఇప్పటికే పలు హారర్ చిత్రాలతో చాలామంది హీరోయిన్లు సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కూడా. లేటెస్టుగా ఈ లిస్టులోకి చేరనుంది మరో గ్లామర్ భామ తమన్నా. క్రేజీ హీరోయిన్‌గా తమిళ, తెలుగుభాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఇప్పుడు చంద్రముఖి పాత్రలో నటించనుంది.

01/13/2016 - 03:32

ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్.సి దర్శకత్వంలో రూపొందిన ‘అరన్మణి’ (చంద్రకళ) చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘అరన్మణి-2’ చిత్రాన్ని రూపొందించారు. తెలుగులో ‘కళావతి’గా విడుదల కానుంది. త్రిష, హన్సిక, సిద్దార్థ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని గుడ్ సినిమా గ్రూప్, సర్వంత్‌రామ్ క్రియేషన్స్ పతాకాలపై విడుదల కానుంది.

01/13/2016 - 03:30

తండ్రీ కొడుకులమధ్య వుండే సెంటిమెంట్‌తో
ఇప్పటివరకూ చాలా చిత్రాలు వచ్చాయి. కానీ వాటికి ఈ సినిమాకూ చాలా తేడా వుంటుంది. ముఖ్యంగా ఎమోషన్ విషయంలో ప్రేక్షకుడికి దగ్గరగా కనెక్ట్ అయ్యే అంశమిది. తండ్రికోసం ఓ కొడుకు ఏం చేశాడు అనే అంశంగా సాగుతుంది. నిజానికి ఎన్టీఆర్‌కు ముందు వేరే కథ చెప్పాను. ఆ తరువాత మా నాన్న మృతి చెందడంతో బాగా ఎమోషన్‌గా ఫీలయ్యాను. ఆ సమయంలో వచ్చిన ఆలోచనే ఇది.

01/13/2016 - 03:26

‘పనిపట్ల కమిట్‌మెంట్‌తో ఉంటాను. నా సంతోషం నాకు ముఖ్యం. నచ్చిన పనిని చేసుకుంటూ వెళ్లడమే నాకు తెలుసు’ అంటోంది అందాల భామ సురభి. ‘బీరువా’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ‘రఘువరన్ బి.టెక్’ చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఎక్స్‌ప్రెస్ రాజా’. శర్వానంద్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది సురభి. మేర్లపాక గాంధి దర్శకత్వంలో యు.వి.

01/13/2016 - 03:24

టాలీవుడ్‌లో క్రేజీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పవన్‌కళ్యాణ్ ‘నాన్నకు ప్రేమతో’ నిర్మాత భోగవల్లి ప్రసాద్‌పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో కేసు వేయడం చర్చనీయాంశమైంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘అత్తారింటికి దారేది’ చిత్రం రూపొందింది. ఎన్నో వివాదాల మధ్య విడుదలైన ఆ చిత్రం సంచలన విజయం సాధించి తెలుగులోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

01/13/2016 - 03:22

అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ‘సరైనోడు?’ చిత్రం జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించే ఈ చిత్రం సమ్మర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సంక్రాంతి పండగ సందర్భంగా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేస్తారు. దాంతోపాటు పాటలను ఫిబ్రవరి 14న విడుదల చేసి మార్చిలో చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Pages