S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/12/2016 - 02:38

ఇటీవలే వచ్చిన ‘నేను..శైలజ’ చిత్రంతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ కీర్తి సురేష్. తెలుగులో ఆమెకు ఇది మొదటి సినిమా. ఈ సినిమా తరువాత ఇపుడు కీర్తి సురేష్‌కు టాలీవుడ్‌లో మరింత క్రేజ్ పెరిగింది. ఇప్పుడు ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. మెగా హీరో సరసన ఆమె నటింబోతోందని తెలుస్తోంది.

01/12/2016 - 02:36

అజయ్ భరత్, అర్జున్, వెంకటేష్, సుస్మిత, బిందు, బార్బి ప్రధాన తారాగణంగా భరత్ ఫిలిం ఫాక్టరీ పతాకంపై ఫిరోజ్ రాజా దర్శకత్వంలో భరత్‌కుమార్ పీలం రూపొందించిన చిత్రం ‘రాజుగారింట్లో 7వ రోజు’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు.

01/12/2016 - 02:35

వాస్తవ సంఘటనలు, వ్యక్తుల నిజ జీవిత చరిత్రలను కథాంశాలుగా తీసుకుని రూపొందించిన చిత్రాలు ఎప్పుడూ మంచి విజయాన్ని అందుకుంటూనే వుంటాయి.

01/12/2016 - 02:34

రాజ్‌తరుణ్, ఆర్తన జంటగా శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై కె.వి.శ్రీధర్ రెడ్డి, హరీశ్ దుగ్గిశెట్టి నిర్మిస్తున్న చిత్రం ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’. ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. దర్శకుడు ఎన్.శంకర్ సీడీలను ఆవిష్కరించారు.

01/11/2016 - 04:17

నవన్ చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా మయూఖా క్రియేషన్స్ పతాకంపై జగదీష్ తలశిల దర్శకత్వంలో సాయిప్రసాద్ కామినేని రూపొందించిన ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ చిత్రం ఈనెలాఖరుకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- నూతన సంవత్సర కానుకగా ఈనెల 1న విడుదల చేద్దామనుకున్నామనీ, కానీ కారణాంతరాలవల్ల ఈనెలాఖరుకు విడుదల చేస్తున్నామని అన్నారు.

01/11/2016 - 04:12

నవీన్ సంజయ్, వౌనిక జంటగా కావేరి ట్రావెల్స్ సమర్పణలో తమ్మినీడు సతీష్‌బాబు దర్శకత్వంలో ఎంపి నాయుడు రూపొందిస్తున్న చిత్రం ‘జానకిరాముడు’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ క్లైమాక్స్ దశకు వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

01/11/2016 - 04:10

సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ త్వరలో హీరోగా నటించనున్నారన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ చిత్రంలో నటించే కథానాయిక కోసం అనే్వషణ జరిగింది. చివరికి అనేకమంది పేర్లు పరిశీలించి, సమంతని ఎంపిక చేశారు. చివరకు సమంత అయితేనే ఈ చిత్రానికి న్యాయం జరుగుతుందని ఆమెను అడగడం, దానికి ఆమె ఒప్పుకోవడం జరిగింది. త్వరలో ఈ విషయంపై పూర్తి సమాచారం తెలియనుంది.

01/11/2016 - 04:09

ఈమధ్యకాలంలో హీరోహీరోయిన్లు నటననే కాకుండా పాటలు పాడడానికి కూడా రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌లు పాటల పాడి ఆకట్టుకున్నారు. తాజాగా ఈ లిస్టులోకి చేరింది గ్లామర్ భామ కాజల్. ఇప్పుడు ఈమె సరసన మరో హీరోయిన్ చేరనుంది. దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుని, తనదైన గ్లామర్‌తో ఆకట్టుకున్న ప్రియమణికి ఈమధ్య అసలు కలిసిరావడం లేదు.

01/11/2016 - 04:07

సాధారణంగా సినిమా పరిశ్రమలో మహిళా దర్శకులు చాలా తక్కువ. తెలుగు చిత్ర పరిశ్రమలో వాళ్లను వేళ్లపై లెక్కించవచ్చు. మీడియా రంగంనుండి దర్శకురాలిగా తాను చేసిన తక్కువ సినిమాలతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు బి.జయ. తాజాగా ‘లవ్‌లీ’ చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆమె ‘వైశాఖం’ చిత్రాన్ని కొత్త నటీనటులతో తెరకెక్కించనున్నారు.

01/11/2016 - 04:06

‘తేనెటీగ’, ‘గజబలుడు’, ‘గెలుపుగుర్రాలు’ చిత్రాలు రూపొందించిన నిర్మాత సి.ఆర్.రాజన్ ఇకముందు ప్రజలకు సందేశం ఇచ్చే చిత్రాలను నిర్మిస్తామంటున్నారు. జన్మదినోత్సవ సందర్భంగా పలు నిర్ణయాలను తీసుకున్న తాను ఇకనుండి మంచి చిత్రాలను రూపొందిస్తానని అంటున్నారు.

Pages