S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/08/2016 - 21:47

కొంత గ్యాప్ తర్వాత ప్రముఖ నటుడు చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ, ప్రత్యేకంగా రూపొందించే 150వ చిత్రంపై నిర్ణయం కొన్ని రోజులుగా వాయిదా పడుతూనే వస్తోంది. మెగాస్టార్ 150వ సినిమాకోసం అభిమానులు చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నారుకూడా. మొత్తానికి 150వ చిత్రం దాదాపు ఖరారైనట్టే. తమిళంలో ఘన విజయం సాధించిన ‘కత్తి’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కించే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరందుకున్నాయి.

01/08/2016 - 21:46

క్రేజీ హీరోగా టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రవితేజ నటించిన తాజా చిత్రం బెంగాల్ టైగర్‌తో మంచి హిట్‌ను అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన మూడు సినిమాలు చేయడానికి ఓకే చెప్పాడు. ఇప్పటికే దిల్‌రాజు, వేణుశ్రీరామ్‌ల ఎవడోఒకడు, సుధీర్‌వర్మ దర్శకత్వంలో మరో చిత్రం, దాంతోపాటు నూతన దర్శకుడు చక్రి దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో నటిస్తున్నాడు.

01/08/2016 - 21:44

వరుస విజయాలతో దూసుకుపోతున్న గోపీచంద్‌కు ‘సౌఖ్యం’ స్పీడ్‌కు బ్రేకేసింది. భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా ఫలితం అనుకున్న విధంగా లేకపోవడంతో ఇక తదుపరి సినిమాలపై మరింత కేర్ తీసుకుంటున్నాడు గోపీచంద్. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘ఆక్సిజన్’ చిత్రంతోపాటు ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది.

01/08/2016 - 21:42

‘బాహుబలి’ సినిమాతో భల్లాలదేవుడిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు రానా. ప్రస్తుతం ‘బాహుబలి-2’ షూటింగ్‌లో బిజీగా వున్న రానా మరో క్రేజీ సినిమాలో నటించేందుకు ఓకె చెప్పినట్లు తెలిసింది. సంకల్పరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మాణం కానుందట. 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో రూపొందే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోందని సమాచారం.

01/08/2016 - 21:38

‘అందాలరాక్షసి’గా తెలుగు ప్రేక్షకులను అలరించి ఆ తరువాత ‘దూసుకెళ్తా’ చిత్రంలో నటించి తాజాగా ‘్భలే భలే మగావడివోయ్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది లావణ్య త్రిపాఠి. అచ్చతెలుగు అమ్మాయిగా నటనతోపాటు గ్లామర్‌ను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ భామ తాజాగా అక్కినేని నాగార్జున సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.

01/08/2016 - 21:36

సుమంత్ అశ్విన్, పూజా జవేరి జంటగా మను దర్శకత్వంలో శ్రీ సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జె.వంశీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘రైట్ రైట్’. ‘బాహుబలి’ ఫేమ్ ప్రభాకర్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ అరకులో పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను గురించి నిర్మాత వంశీకృష్ణ వివరాలు తెలియజేస్తూ డిసెంబర్ 7 నుంచి ఈనెల 4 వరకు ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలు చిత్రీకరించామన్నారు.

01/08/2016 - 21:34

గత ఏడాది ‘్భలేభలే మగాడివోయ్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాని అదే జోరుతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం దాదాపు షూటింగ్ పూర్తికావచ్చింది. ‘అందాలరాక్షసి’ ఫేమ్ హను రాఘవపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘జై బాలయ్య’ అనే టైటిల్ పెడుతున్నట్టు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ టైటిల్ పెడితే బాగోదని, టైటిల్‌ని మార్చారట.

01/06/2016 - 21:37

తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ హీరోయిన్‌గా మంచి జోరుమీదున్న కాజల్ ప్రస్తుతం తెలుగులో పవన్ సరసన

01/06/2016 - 21:36

ప్రముఖ నటుడు రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కబాలీ. పి.ఎ.రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చెన్నైలో చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. రజనీకాంత్ వయసుకు దగ్గ పాత్రలో నటిస్తున్నాడు. మాఫియా డాన్‌గా రజనీ నటిస్తున్న ఈ సినిమా కోసం ఓ భారీ ఏక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించనున్నారట. ఈ చిత్రంలో విలన్లుగా హాలీవుడ్ నటులు కనిపిస్తారని తెలిసింది.

01/06/2016 - 21:33

సెన్సిబుల్ దర్శకునిగా మంచి పేరుతెచ్చుకున్న సుకుమార్ నిర్మించిన ‘కుమారి 21 ఎఫ్’ చిత్రంతో క్రేజీ హీరోయిన్‌గా మారింది హెబాపటేల్. ఈ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్న ఈ భామ ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘నాన్నకు ప్రేమ..’తో చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హెబా కనిపించేది కొద్దిసేపే అయినా కీరోల్ పోషిస్తోంది.

Pages