S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/06/2016 - 21:31

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘డిక్టేటర్’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 14న సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమైంది. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమైన ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో 99వ చిత్రంగా తెరకెక్కింది. ఇప్పుడు బాలకృష్ణ 100వ సినిమాపై అంతటా ఆసక్తి నెలకొంది.

01/06/2016 - 21:29

ప్రముఖ దర్శకుడు సుకుమార్ సినిమాల్లో హీరోయన్లకు ప్రత్యేక క్రేజ్ వుంటుంది. సినిమాల్లోని వారి పాత్రలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. హీరోయిన్లు కేవలం నటన గ్లామర్‌కే పరిమితం కాకుండా వారి వారి శైలిలో ప్రతిభను ప్రదర్శించే అవకాశం వుంటుంది. తాజాగా ఇలాంటి ప్రయోగమే చేసింది అందాల భామ రకుల్ ప్రీత్‌సింగ్. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో ఈ భామ స్వంతంగా డబ్బింగ్ చెప్పిందట.

01/06/2016 - 21:22

ప్రియాంక పల్లవి, జ్ఞాన్, సూర్యశ్రీనివాస్ హీరోహీరోయిన్లుగా రైజింగ్ డ్రీమ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై పరంధ్‌కళ్యాణ్ దర్శకత్వంలో రైజింగ్ టీమ్ రూపొందిస్తున్న చిత్రం ‘నేనొస్తా’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధమైంది.

01/06/2016 - 21:20

కమెడియన్ నుంచి హీరోగా టర్న్ అయిన సునీల్ ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి జోరుమీదున్నాడు. ఇప్పటికే ‘కృష్ణాష్టమి’తోపాటు మరో చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘ఈడు గోల్డెహె’ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. వీరూ పోట్ల దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం సంస్థ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభమైంది.

01/06/2016 - 21:19

ఇప్పటికే గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవిత కథపై చాలా చిత్రాలు వచ్చాయి. వీరప్పన్ పాత్రల్లో పలువురు నటులు నటించి ఆకట్టుకున్నారు కూడా. తాజాగా వీరప్పన్ పాత్రలో నటిస్తున్నాడు రామ్‌జగన్. తమిళంలో ‘తిరు వీరప్పన్’ పేరుతో తెరకెక్కే ఈ చిత్రంలో ప్రధాన పాత్ర చేస్తున్నానని చెప్పారాయన. ఇటీవలే ‘ఇద్దరమ్మాయిలు’ సీరియల్ ప్రచారం కోసం ఆదోని వచ్చాడు.

01/06/2016 - 21:17

ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించాలని ప్రయత్నంలో ‘లవ్‌లీ’ సినిమా తరువాత కాస్త గ్యాప్ వచ్చింది. ఇకపై రెగ్యులర్‌గా ఈ బ్యానర్‌లో సినిమాలు చేస్తానని అంటున్నాడు నిర్మాత బి.ఏ.రాజు. ‘చంటిగాడు’, ‘ప్రేమికులు’, ‘ప్రేమలో పావని కళ్యాణ్’, ‘లవ్‌లీ’ వంటి సినిమాల తరువాత ఆయన నిర్మించే చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఈరోజు ఆయన జన్మదినం. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు...
కొత్త తారలతో వైశాఖం

01/06/2016 - 00:15

తెలుగులో కంటే తమిళంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు భామ అంజలికి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో తెలుగులోనూ స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది. ఆ తరువాత తెలుగులోనే వరుసగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్న ఈమె ప్రస్తుతం ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ సరసన డిక్టేటర్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

01/06/2016 - 00:13

ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ రూపొందించిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేశారు. సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.

01/06/2016 - 00:11

ఛార్లెస్ డికెన్స్ రాసిన ‘గ్రేట్ ఎక్స్‌పెక్టేషన్స్’ నవల ఆధారంగా నిర్మిస్తున్న ‘్ఫతూర్’ ట్రైలర్
విడుదల కార్యక్రమంలో బాలీవుడ్ తారలు టబు, ఆదిత్యరాయ్ కపూర్, కత్రినాకైఫ్
తళుక్కుమన్నారు. అభిషేక్ కపూర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న
ఈ చిత్రం ట్రైలర్‌ను ముంబైలో విడుదల చేశారు.

01/06/2016 - 00:06

ప్రముఖ నటుడు మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘బ్రహ్మోత్సవం’ చిత్రం ఊటీలో షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ వారంనుండి విజయవాడలో మరో షెడ్యూల్ జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ముగ్గురు అందాల భామలు సమంత, కాజల్, ప్రణీతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం విజయవాడ నేపథ్యంలో సాగుతుందని తెలిసింది.

Pages