S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/06/2016 - 00:04

సునీల్, నిక్కీగల్రాని జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై వాసువర్మ దర్శకత్వంలో రాజు నిర్మించిన ‘కృష్ణాష్టమి’ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ దినేష్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను ఈనెల 9న విడుదల చేయనున్నామని, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అందరికీ నచ్చేలా రూపొందిందని తెలిపారు.

01/06/2016 - 00:01

లేటెస్టుగా విడుదలైన ‘బెంగాల్ టైగర్’ చిత్రంతో మంచి జోరుమీదున్నాడు రవితేజ. ఈ సినిమా తరువాత ఆయన మూడు సినిమాల్లో నటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ‘ఎవడో ఒకడు’ షూటింగ్ జరుగుతోంది. దాంతోపాటు చక్రి దర్శకత్వంలో మరో చిత్రం కూడా సెట్స్‌పైకి రానుంది. దీంతోపాటు ‘స్వామిరారా’ ఫేం సుధీర్‌వర్మతో ఓ సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు.

01/06/2016 - 00:00

యానిమేషన్ చిత్రాల తయారీ రంగంలో మంచి ప్రఖ్యాతి సంపాదించుకున్న గ్రీన్ గోల్డ్ సంస్థ అందిస్తున్న నాలుగో చిత్రం ‘చోటా భీమ్’ హిమాలయాస్ అడ్వెంచర్ చిత్రాన్ని ఈనెల 8న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. హిందీలో రూపొందిన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా 500 స్క్రీన్లలో విడుదలవుతోంది.

01/05/2016 - 23:58

నిరంజన్ దేశ్‌పాండే, దిశా పాండే జంటగా చంద్రమోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బొంబాయి మిఠాయి’. కన్నడలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులోకి భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ ట్రైలర్ ఆవిష్కరించారు.

01/05/2016 - 23:56

ఆదిత్య, సోనాలి జంటగా కోట మునీష్ దర్శకుడిగా ఆదిత్య క్రియేషన్స్ పతాకంపై లక్ష్మీ శ్రీవాత్సవ నిర్మాతగా రూపొందిస్తున్న ప్రేమికులపై పిహెచ్‌డి చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని పూర్తిచేసుకుని ఈనెల 22న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్న సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ- మంచి ప్రేమకథతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో రూపొందుతోంది.

01/05/2016 - 23:55

సినిమాలతో రాఘవ లారెన్స్ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పటికే ‘కాంచన’ సినిమా ఆయనకు మంచి క్రేజ్ తెచ్చింది. దానికి సీక్వెల్‌గా రూపొందిన గంగ సినిమా కూడా మంచి విజయం అందుకుంది. దాంతో ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘మెట్టశివ... కెట్టశివ’ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. దాంతోపాటు మరో రెండు సినిమాలతో కూడా బిజీగా ఉన్నాడు. లేటెస్ట్‌గా ‘్భరవ’ సినిమాతో భయపెట్టడానికి రెడీ అవుతున్నాడు మరోసారి!

01/04/2016 - 21:47

తెలుగు ప్రజల గుండెల్లో నిత్యం తన పాట ద్వారా పలకరించే సినీ నేపథ్య గాయని పి.సుశీల హైదరాబాద్‌లోని సిఎం క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావును మర్యాద పూర్వకంగా కలిశారు. ఐదురోజులపాటు ప్రపంచ శాంతికై ముఖ్యమంత్రి అయుత చండీ మహాయాగాన్ని విజయవంతంగా పూర్తిచేసినందుకు అభినందించారు. ప్రజలకోసం మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె సిఎంను కోరారు.

01/04/2016 - 21:46

దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన ‘బాహుబలి’ సినిమాకు సీక్వెల్ ‘బాహుబలి-2’

01/04/2016 - 21:45

శర్వానంద్, సురభి జంటగా యువి క్రియేషన్స్ పతాకంపై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వంశీ ప్రమోద్ రూపొందించిన చిత్రం ‘ఎక్స్‌ప్రెస్ రాజా’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

01/04/2016 - 21:44

శే్వతామీనన్, మహత్ రాఘవేంద్ర, చేతన ఉత్తేజ్, సోనియా అగర్వాల్ ముఖ్యపాత్రల్లో పర్సా రమేష్ మహేంద్ర దర్శకత్వంలో మహేశ్వర ఆర్ట్స్ పతాకంపై కల్వకుంట్ల తేజేశ్వరరావు నిర్మిస్తున్న ‘షి’ చిత్రం హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సోమవారం లొకేషన్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత తేజేశ్వరరావు మాట్లాడుతూ- అన్నిరకాల కమర్షియల్ అంశాలుండే సినిమా ఇది.

Pages