S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/03/2016 - 21:52

విజయ్‌దాట్లా, దీక్షాపంత్ జంటగా త్రిపురనేని విజయ్‌చౌదరి దర్శకత్వంలో అంజనీమూవీస్ పతాకంపై పువ్వల శ్రీనివాసరావు రూపొందించిన ‘కవ్వింత’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 8న విడుదలకు సిద్ధమైంది.

01/03/2016 - 21:50

విజయ్‌భరత్, అశ్విని, కాంచన ప్రధాన తారాగణంగా ఎస్.ఎస్. సెల్యులాయిడ్స్ పతాకంపై జై శ్రీరామ్ దర్శకత్వంలో పొట్నూరు శ్రీనివాసరావు రూపొందించిన హాస్య చిత్రం ‘వినోదం వంద%’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

01/03/2016 - 21:43

చిరంజీవి 150వ చిత్రం అదుగోపులి అంటే ఇదుగో తోక అన్నట్లు తయారైంది. మెగాస్టార్ చిరంజీవి నటించే ఆ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమాలు జోరు అందుకున్నాయి. తమిళంలో సూపర్‌హిట్ అయిన ‘కత్తి’కి రీమేక్‌గా రూపొందే ఈ చిత్రానికి చిరంజీవి భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. 30 కోట్లు పైగా అని పుకారు షికారు చేస్తోంది. ఇప్పటికే అడ్వాన్స్ కూడా అందిందని అంటున్నారు.

01/03/2016 - 21:41

నాగశౌర్య హీరోగా నటించిన ‘అబ్బాయితో అమ్మాయి’ సినిమా ద్వారా పరిచయం అయింది కొత్త హీరోయిన్ పల్లక్ లల్వాని. జె.జి.సినిమాస్, కిరణ్ స్టూడియోస్ పతాకాలపై రమేష్‌వర్మ దర్శకత్వంలో కిరీటి, శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించిన ‘అబ్బాయితో అమ్మాయి’. జనవరి 1న విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ పల్లక్ లల్వానితో మాటామంతి....
ఈ అవకాశం ఎలా వచ్చింది?

01/03/2016 - 21:35

భీమనేని శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ‘సుందరపాండ్యన్’ను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, సోనారిక జంటగా నిర్మిస్తున్న ‘స్పీడున్నోడు’ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు.

01/03/2016 - 21:34

సంక్రాంతి పండుగకు స్పెషల్ ఐటెమ్ కోడిపందాలు. ఈసారి తెలుగు తెర కూడా కోడిపందాలను జరుపుకోనుంది. ఈ పందెంలో గెలుపు పుంజులు ఎవరు అనేది త్వరలో తెలియనుంది. సంక్రాంతికి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘డిక్టేటర్’ రంగంలోకి దిగుతుండగా, జూ. ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ కూడా విడుదలవుతోంది. తానేం తక్కువ కాదంటూ ఈసారి నాగార్జున సంక్రాంతికి రంగంలోకి దిగుతున్నాడు సోగ్గాడిగా.

01/03/2016 - 21:32

నాగశౌర్య, మాళవికానాయర్ జంటగా శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై బి.వి.నందినీరెడ్డి దర్శకత్వంలో కె.ఎల్.దామోదరప్రసాద్ రూపొందించిన తాజా చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు. బిగ్ సీడీని, ఆడియో సీడీని హీరో రామ్ విడుదల చేసి తొలి కాపీని మరో హీరో సుమంత్ అశ్విన్‌కు అందజేశారు.

01/02/2016 - 21:20

డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ మూవీస్ పతాకంపై అల్లు వంశ్, ప్రియాంక అగస్త్యన్ జంటగా పృధ్వీదత్తా రూపొందిస్తున్న చిత్రం ‘పృధ్వీదత్తా.. ఓ పరిచయం’. టాకీపార్ట్ పూర్తిచేసిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

01/02/2016 - 21:19

శ్రీకృష్ణా క్రియేషన్స్, జి.ఆర్. పిక్చర్స్, జడ్3 ప్రొడక్షన్స్ పతాకాలపై సందీప్ భరద్వాజ్ కథానాయకుడిగా రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘కిల్లింగ్ వీరప్పన్’. ఈ చిత్రాన్ని జనవరి 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేసినా, సెన్సార్ సర్ట్ఫికెట్ జారీచేయడంలో ఆలస్యం కావడంతో ఈనెల 7న విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

01/02/2016 - 21:17

విశాల్ కథానాయకుడిగా పాండ్యరాజ్ దర్శకత్వంలో విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రూపొందించిన చిత్రం ‘కథకళి’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 14న సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమైంది.

Pages