S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/02/2016 - 21:10

మాస్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న రవితేజ తాజాగా ‘బెంగాల్ టైగర్’ సినిమాతో మరోసారి అలరించాడు. ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతోంది. ఈ సినిమా తరువాత ఆయన వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ఎవడో ఒకడు చిత్రంలో నటిస్తున్నాడు. దీంతోపాటు చక్రి అనే నూతన దర్శకుడి చిత్రానికి ఓకె చెప్పాడు. అలాగే ‘స్వామిరారా’ ఫేం సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయడానికి ఓకె చెప్పాడట.

01/01/2016 - 21:49

ప్రస్తుతం తెలుగులో హీరోయిన్‌గా మంచి జోరుమీదున్న అందాలభామ అంజలి వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. తాజాగా బాలకృష్ణతో నటించిన ‘డిక్టేటర్’ ఈనెల సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. తాజాగా మరో క్రేజీ చిత్రంలో కూడా నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది అంజలి. ఇటీవలే టీవీ యాంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘రాజుగారి గది’ మంచి విజయం సాధించిన నేపథ్యంలో, ఆ చిత్రానికి సీక్వెల్‌గా చేస్తున్న ఓ చిత్రంలో ఆమె నటిస్తోంది.

01/01/2016 - 21:47

మలయాళీ గ్లామర్ భామ కేథరీన్ ట్రెస్సా కన్నడ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా, ఆ తరువాత పలు తెలుగు చిత్రాల్లో నటించినా కూడా పెద్దగా లాభం లేకుండా పోయింది. గ్లామర్‌తో ఎంతగా ఆకట్టుకోవాలనుకున్నా, ఆ ప్రయత్నాలన్నీ బెడిసికొడుతూనే ఉన్నాయి. ఇప్పటికే తెలుగుతోపాటు తమిళ, మలయాళ సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ భామకు అక్కడ నిరాశే మిగిలింది. మళ్లీ తెలుగులోనే నిలబడాలనే ప్రయత్నాలు గట్టిగానే చేస్తోంది.

01/01/2016 - 21:44

తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా కెరీర్‌పరంగా ఒక్క పెద్ద కమర్షియల్ విజయం అందుకోలేకపోయింది గ్లామర్‌భామ శ్రద్ధాదాస్. ఈమధ్యే బాలీవుడ్‌లో కూడా ఓ సినిమాలో నటించిన ఈ భామకు తాజాగా బాలయ్య సరసన ఐటెం సాంగ్ చేసే అవకాశాన్ని కొట్టేసింది. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘డిక్టేటర్’ చిత్రంలో హాట్‌హాట్‌గా ఐటెం సాంగ్ చేసిందట. ఆమెతోపాటు మరో ఐటెం భామ ముమైత్‌ఖాన్ కూడా ఈ పాటలో పాల్గొంది.

01/01/2016 - 21:41

మై డ్రీమ్స్ అసోసియేషన్స్ పతాకంపై ఎస్.కృష్ణతేజ నాయుడు రూపొందిస్తున్న చిత్రం ‘రాజధానిలో.. ఓ ఇల్లు’. విక్రమ్ ఆర్య కథానాయకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత మాట్లాడుతూ, వైవిధ్యమైన కథాంశంతో త్వరలో ఈ షూటింగ్ ప్రారంభిస్తామని, విజువల్ ఎఫెక్ట్‌కు పెద్దపీట వేసి రూపొందిస్తున్న ఈ చిత్రం యూత్‌ను ఆకట్టుకుంటుందని తెలిపారు.

01/01/2016 - 21:32

శ్రీ చాముండేశ్వరి దేవి ఫిలింస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అర్జున్ ప్రసాద్ దర్శకత్వంలో ప్రసాద్‌బాబు, మధుబాబు రూపొందిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఈనెలలో ప్రారంభం కానుంది. గతంలో ‘ప్రియ నీమీదే ఆశగా’ చిత్రాన్ని రూపొందించిన నిర్మాతలు, కొత్తగా ఈ చిత్రాన్ని రివెంజ్ కామెడీ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నామని తెలిపారు.

01/01/2016 - 21:28

సౌత్ క్రేజీ గ్లామర్ సుందరి నయనతార ప్రస్తుతం సెలెక్టివ్‌గానే సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. వరుస విజయాలు అందుకుంటున్న నయనతార మరోసారి భయపెట్టే సినిమాల్లో నటించడానికి సిద్ధమైంది. ఇప్పటికే వరుసగా హారర్ చిత్రాల్లో నటిస్తున్న ఆమె, మరో చిత్రంలో నటించడంలో విశేషమేముంది అనుకుంటే పొరపాటు. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం హారర్‌తో నిండి వుంటుందట. ఇప్పటికే కథా చర్చలు కూడా పూర్తయ్యాయి.

01/01/2016 - 21:26

మహేష్‌బాబు కథానాయకుడిగా పి.వి.పి పతాకంపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ‘బ్రహ్మోత్సవం’ టీజర్‌ను శుక్రవారం మహేష్‌బాబు తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా విడుదల చేశారు.

01/01/2016 - 21:23

అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఈసారి ఓ మంచి హిట్‌తో ముందుకు రావాలని పట్టుదలతో ఉన్నారు. పలు కథలు వింటున్న ఆయన, ఓ బాలీవుడ్ రీమేక్ సినిమాను తెలుగులో చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమధ్య బాలీవుడ్‌లో వచ్చిన ‘ఏ దివాని హై జవాని’ చిత్రాన్ని రీమేక్ చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నారు.

01/01/2016 - 21:22

విజయ్‌చందర్ సాయిబాబాగా నటిస్తున్న తాజా చిత్రం ‘సాయే దైవం’. శ్రీ మల్లాది వెంకటేశ్వర ఫిలింస్, జి.ఎల్.బి. మూవీ మేకర్స్ పతాకాలపై జి.ఎల్.బి.శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్ ఈవారంలో ప్రారంభం కానుంది.

Pages