S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/15/2015 - 00:52

తెలుగులో ఒకటి రెండు చిత్రాల్లో నటించిన బాలీవుడ్ భామ మనార చోప్రా బాలీవుడ్‌లో ‘జిద్’ చిత్రంతో హాట్ భామగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం సునీల్ సరసన ఓ చిత్రంలో నటిస్తున్న ఈమెకు లేటెస్టుగా మెగా అవకాశం దక్కింది. ఈమధ్య వరుస విజయాలతో దూసుకుపోతున్న సాయిధరమ్‌తేజ్‌కు జోడీగా ఎంపికైంది. ప్రస్తుతం సాయిధరమ్ అనీల్ రావిపూడి దర్శకత్వంలో సుప్రీమ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

12/15/2015 - 00:50

ప్రముఖ హీరో మహేష్‌బాబు ప్రస్తుతం నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ చిత్రం జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా దాదాపు సగంపైగా షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ సినిమా తరువాత మహేష్ తన తదుపరి చిత్రానికి అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టాడట. ప్రముఖ తమిళ క్రేజీ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.

12/15/2015 - 00:47

డిక్టేటర్ చిత్రంలో నందమూరి బాలకృష్ణ

12/15/2015 - 00:06

‘అందాల రాక్షసి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై మొదటి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ‘దూసుకెళ్తా’,‘్భలే భలే మగాడివోయ్’ సినిమాలతో మంచి విజయాలను అందుకుంది. ప్రస్తుతం నాగార్జున సరసన ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రంలో నటిస్తోంది. ఈరోజు లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా ఇంటర్వ్యూ...
భలే భలే మగాడివోయ్ హిట్‌తో మంచి జోరుమీదున్నారు?

12/14/2015 - 23:17

తెలుగులో పలు చిత్రాల రచయితగా పనిచేసిన శ్రీనివాస చక్రవర్తి సోమవారం ఆకస్మికంగా మృతి చెందారు. కథా రచయితగా ఆయన ప్రస్థానం ‘పట్నం వచ్చిన ప్రతివ్రతలు’ చిత్రంతో మొదలైంది. ‘అన్నదమ్ముల సవాల్’ వంటి చిత్రాలకు రచయితగా పనిచేసిన ఆయన చాలా చిత్రాలకు కథలను అందించారు. ఆయన ఆకస్మిక మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు.

12/14/2015 - 23:10

ప్రముఖ తెలుగు సినీ రచయిత, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తండ్రి జి.సత్యమూర్తి ఇకలేరు. సోమవారం చెన్నైలోని ఆయన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు. దాదాపు 90 సినిమాలకు రచయితగా పనిచేసి స్టార్ రైటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన రచయితగా చేసిన అనేక చిత్రాలు సంచలన విజయాలు సాధించాయి.

12/14/2015 - 23:07

మంచు విష్ణు, సోనారిక, రాజ్‌తరుణ్, హెబాపటేల్ హీరో హీరోయిన్లుగా జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందే చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

12/14/2015 - 23:05

బైలో జరిగిన ‘బిగ్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పలువురు బాలీవుడ్ తారలు అందాలొలికించారు. ప్రఖ్యాత డిజైనర్లు స్టెల్లా మెక్‌కార్ట్నీ, రమిఅల్‌అలీ రూపొందించిన
విభిన్నమైన దుస్తులు ధరించిన దీపికపదుకొనె, సోనమ్‌కపూర్, అతియాశెట్టి ఆహూతులను అలరించారు.

12/14/2015 - 23:02

మూడు దశాబ్దాలుగా ప్రముఖ దర్శకుడు కె.వి.రెడ్డి పేరుతో యువకళావాహిని సంస్థ అందిస్తున్న ప్రతిష్ఠాత్మక అవార్డును ఈ ఏడాదికిగాను ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న దాసరి నారాయణరావు అవార్డును అందజేశారు.

12/14/2015 - 05:28

ప్రశాంత్, లావణ్య, శిల్ప ప్రధాన తారాగణంగా హని, ప్రణి ఫిలిమ్స్ పతాకంపై నంది వెంకట్‌రెడ్డి దర్శకత్వంలో ఎ.వి.ఆర్. రూపొందించిన చిత్రం ‘వేటపాలెం’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత ఎ.వి.ఆర్.

Pages