S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/26/2018 - 19:26

కార్తీ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దేవ్’. రజత్ రవిశంకరర్ దర్శకుడు. చిత్రంలో కార్తీ స్టైలిష్ లుక్‌ని తాజాగా విడుదల చేశారు. చేతిలో హెల్మెట్, వెనుక రేసింగ్ బైక్‌తో సరికొత్తగా కనిపిస్తున్నాడు. రకుల్ ప్రీత్‌సింగ్, నిక్కీ గల్రాని హీరోయిన్లు. ఖాళీ తరువాత కార్తీ, రకుల్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై పెద్ద అంచనాలున్నాయి.

10/25/2018 - 20:43

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రానికి టైటిల్ దాదాపు కన్ఫ్‌ర్మ్ అయినట్టే. ఇప్పటికే జగదేకవీరుడు, ముఠామేస్ర్తీ, రౌడీ తమ్ముడు లాంటి టైటిల్స్ వినిపించాయి.. తాజాగా వినయ విధేయ రామ అనే టైటిల్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు హీరో, దర్శకులు. ఈ నేపథ్యంలో వినయ విధేయ రామ టైటిల్‌పై యూనిట్ ఆసక్తిగా ఉన్నారట.

10/25/2018 - 20:41

జనరల్‌గా సినిమావాళ్ళ జీవితాలు అంటే పబ్లిక్ ప్రాపర్టీ లాంటివి. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో ఎలాంటి దాపరికాలు ఉండవు. ఒకవేళ దాపరికం మెయిన్‌టైన్ చేయాలన్న ఏదో ఓ సందర్భంగా బయటికి వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఈ విషయంలో గ్లామర్ భామ శ్రీయ మాత్రం సీరియస్‌గా ఉంది. ప్రొఫెషన్ లైఫ్ గురించి ఏదైనా మాట్లాడండి.. కానీ పర్సన్ లైఫ్ గురించి మీకు అవసరంలేదని కాస్త గట్టిగానే చెప్పింది.

10/25/2018 - 20:39

మాస్ రాజా రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అమర్ అక్బర్ ఆంటోనీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈనెల 29న టీజర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా మరో న్యూలుక్‌ను విడుదల చేశారు. రీ ఎంట్రీ ఇస్తోన్న ఇలియానా మరోసారి రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది.

10/25/2018 - 20:37

భారతదేశం గర్వించదగిన గాయకుల్లో గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు కూడ ఒకరు. అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా ‘ఘంటసాల’ బయోపిక్ రూపుదిద్దుకుంటోంది. సిహెచ్.రామారావు దర్శకుడు. యువ గాయకుడు కృష్ణచైతన్య ఘంటసాల పాత్రలో, మృదుల ఘంటసాల సతీమణిగా నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం విడుదల చేశారు. ఈ సందర్భంగా..

10/25/2018 - 20:35

మళ్లీరావా చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఉత్తరాది టీవీ నటి ఆకాంక్షాసింగ్. ఈ చిత్రంలో సుమంత్‌తో కలిసి నటించింది. సినిమా కూడా మంచి విజయం సాధించినా కానీ ఎక్కువగా అవకాశాలను రాబట్టుకోలేకపోయింది. ఇక ఈ చిత్రం తరువాత కింగ్ నాగార్జున, నాని కలిసి నటించిన మల్టీస్టారర్ దేవదాస్ చిత్రంలో నాగ్‌కి జోడీగా నటించింది. ఇటీవల విడుదలైన సినిమా యావరేజ్ అనిపించింది.

10/25/2018 - 19:32

తార క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ పారిశ్రామికవేత్త బ్రహ్మానందరెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘బైలంపుడి’. హీరో హీరోయన్లుగా హరీష్ వినయ్, అనుష్క తివారి, దర్శకుడిగా పి.జి.రాజ్ పరిచయమవుతున్నారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రాన్ని వైజాగ్‌దగ్గర చోడవరంలో షూటింగ్ జరుపుతున్నారు. గురువారం ఫిలిం ఛాంబర్‌లో చిత్రం పోస్టర్ ఆవిష్కరించారు.

10/25/2018 - 19:31

‘టాటా బిర్లా మధ్యలో లైలా’ చిత్రంతో నిర్మాతగా తన ప్రస్థానం ప్రారంభించిన లక్కీ మీడియా సంస్థ అధినేత బెక్కెం వేణుగోపాల్ ‘మేము వయసుకు వచ్చాం’, ‘సినిమా చూపిస్తమావ’లాంటి సూపర్‌హిట్లు తీశారు. ఈ సంస్థలో 9వ చిత్రంగా ‘హుషారు’గా తీస్తున్నారు. రియాజ్ మరో నిర్మాత.

10/25/2018 - 19:29

పెళ్లిచూపులు చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న యువ కమెడియన్ ప్రియదర్శి ఈ చిత్రం తరువాత వరుస ఆఫర్లతో బిజీగా మారాడు. ఇక ఆయన ఒక బయోపిక్‌లో నటించడానికి రెడీ అవుతున్నాడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన చేనేత కార్మికుడు మల్లేశం జీవితం ఆధారంగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ఒక బయోపిక్‌ను నిర్మించనుంది. ఈ చిత్రంలో మల్లేశం పాత్రలో ప్రియదర్శి నటించనున్నాడు.

10/25/2018 - 19:28

ధనంజయ మరియు ఇర్రా మోర్‌లు ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రేమకథా చిత్రం ‘్భరవగీత’. నూతన దర్శకుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నవంబర్ 22న రిలీజ్ కానుంది. తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కగా ఎమోషనల్ లవ్ స్టోరీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Pages