S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/24/2020 - 21:59

భీష్మ ఆనందం చల్లారకముందే -నితిన్ ‘అంధాధున్’ మొదలెట్టేశాడు. వరుస ఫ్లాపులతో సతమతమైన నితిన్ ఏడాదిన్నర గ్యాప్ తరువాత దర్శకుడు వెంకీ కుడుములతో చేసిన సినిమా భీష్మ. గత శుక్రవారం విడుదలైన సినిమా హిట్ టాక్‌తో నడుస్తుండగానే -కొత్త సినిమాను లాంఛనంగా మొదలెట్టాడు నితిన్. బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానా చేసిన అంధాధున్ -మూడు జాతీయ అవార్డులు కొల్లగొట్టడం తెలిసిందే.

02/24/2020 - 21:57

తమిళనాడు దివంగత సీఎం జయలలిత 72వ జయంతి సందర్భంగా ‘తలైవి’నుంచి కంగన కొత్త లుక్ వదిలారు. దర్శకుడు ఎఎల్ విజయ్ తెరకెక్కిస్తోన్న జయ బయోపిక్‌లో కంగనారనౌత్ లీడ్‌రోల్ చేస్తుండటం తెలిసిందే. తాజాగా విడుదల చేసిన కంగన లుక్‌లో -30ఏళ్ల క్రితం జయలలిత వర్చస్సు కనిపిస్తోంది. నలుపు ఎరుపు బార్డర్‌తో వున్న తెల్లని చీరలో జయలలితగా కంగన లుక్ ఆసక్తి కలిగిస్తోంది.

02/24/2020 - 21:55

ఎంత గ్లామరున్నా సరైన హిట్ లేకపోతే కెరీర్ సున్నా. హిట్‌లేని హీరోయిన్ ఛాయల్లో ఏ నిర్మాత, దర్శకుడూ కనిపించడు. హిట్ పడ్డాక సరైన ప్లానింగ్ లేకపోయినా కెరీర్‌ని ముందుకు తీసుకెళ్లడం కష్టమే. అలా ఫెయిలైన హీరోయిన్ల జాబితాలో తాజాగా నిధి అగర్వాల్ పేరు వినిపిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ హిట్టు పడటంతో నిధికి అవకాశాలు వరుస కట్టడం ఖాయమనే అనుకున్నారు.

02/24/2020 - 21:52

చిరంజీవి సినిమాలో మహేష్‌బాబు ఓ పాత్ర చేస్తే? ప్రాజెక్టుకు అంతకు మించి కమర్షియాలిటీ ఏముంటుంది? వినిపిస్తున్న కథనాల్లో రోజురోజుకూ పెరుగుతోన్న ఇంటెన్సిటీని చూస్తే -చిరు ప్రాజెక్టులో మహేష్ దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టే కనిపిస్తోంది. చిరు-కొరటాల కాంబో ప్రాజెక్టులో చరణ్ కోసం ఓ పాత్ర అల్లుకున్నారు. అయితే, డేట్స్, ఈక్వెషన్స్ సరిచూసుకుని చరణ్ పాత్రలోకి బన్నీని తేవాలనుకున్నారు.

02/24/2020 - 21:50

శాంతిరాజు, దీపాలిరౌత్, అఖిల్‌ప్రియ, సోముఉండర్ల ప్రధాన తారాగణంగా కొండారెడ్డి ప్రొడక్షన్స్‌పై అంబికా విజయ్ దర్శకత్వంలో బీవీ కొండారెడ్డి రూపొందించిన చిత్రం -వై తరుణి రాణా. చిత్రానికి సంబంధించిన బిగ్ సీడీ, ట్రైలర్‌ను జెమిని సురేష్, ప్రతాని రామకృష్ణగౌడ్, కాశం సత్యనారాయణ, అంజనా కార్గో సంయుక్తంగా హైదరాబాద్‌లో విడుదల చేశారు.

02/24/2020 - 21:48

అడవిపై మానవ పంజా -కథాంశాన్ని తీసుకుని దర్శకుడు ప్రభుసాల్మన్ తెరకెక్కిస్తోన్న చిత్రం అరణ్య. హీరో రానా దగ్గుబాటి చేస్తోన్న బహు భాషా చిత్రమిది. ‘హాథీ మేరే సాథి’గా హిందీలో, కాండన్‌లో తమిళంలోనూ రూపుదిద్దుకుంటోంది. విడుదల సమయం దగ్గర పడుతున్నకొద్దీ ఆడియన్స్‌లో ఆసక్తి రేకెత్తించే అప్‌డేట్స్, పోస్టర్స్‌ను చిత్రబృందం వదులుతోంది.

02/24/2020 - 21:47

బాలీవుడ్ బ్యూటీ -అనగానే ఆడియన్స్ మైండ్‌లో స్పెషల్ మూడ్ ఉంటుందన్న నమ్మకం టాలీవుడ్‌ని ఇంకా వీడలేదు. అందుకే ప్రాజెక్టుని బతికించటం కోసం -పారితోషికాలకు వెరవకుండా బాలీవుడ్ అందాలను టాలీ స్క్రీన్‌పై చూపించే ప్రయత్నాలు కంటిన్యూ అవుతున్నాయి. బాలీవుడ్ బ్యూడీలకూ -టాలీవుడ్ స్క్రీన్ ‘స్పెషల్’ అట్రాక్షన్ అవుతుండటంతో ఏ పాత్రకైనా ఓకే చెప్తున్నారు.

02/23/2020 - 22:51

శాండిల్‌వుడ్ బ్యూటీ రష్మిక -హైదరాబాద్‌ను అడ్డా చేసుకోనుందట. టాలీవుడ్‌లో ఇప్పుడు రష్మిక టైం నడుస్తోంది. చేస్తున్న ప్రాజెక్టులన్నీ సక్సెస్ ట్రాక్‌లో పరుగులు తీస్తుంటే, -టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేయడానికి పెద్ద స్కెచ్చే వేసుకుంటోందన్న మాట వినిపిస్తోంది. దర్శక, నిర్మాతలకు ఎంత అందుబాటులో ఉంటే అవకాశాలు అంత చేజారకుండా ఉంటాయన్నది ఆమె ఆలోచన.

02/23/2020 - 22:47

మహేష్‌బాబు 26వ చిత్రంగా సరిలేరు నీకెవ్వరు ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడం తెలిసిందే. ఈ ప్రాజెక్టు సెట్స్‌పై ఉన్నపుడే -మహేష్ తదుపరి ప్రాజెక్టు వంశీ పైడిపల్లితో ఉందంటూ కథనాలు వినిపించాయి. మహేష్ సైతం ఆ విషయాన్ని ఇన్‌డైరెక్ట్‌గా నిర్థారిస్తూ వచ్చాడు. కొద్దిరోజుల్లో మహర్షి కాంబో మళ్లీ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని అనుకుంటున్న టైంలో -బిగ్ బ్రేకింగ్ న్యూస్ వినిపిస్తోంది.

02/23/2020 - 22:45

ఎప్పుడో కొట్టిన హిట్లు తప్ప -లేటెస్ట్ సినిమాల గురించి చెప్పుకునే పరిస్థితి లేదు హీరో సూర్యకు. ఇటీవలి కాలంలో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర చతికిలపడినా -తమిళం, తెలుగులో సూర్య ఇమేజ్ ఇసుమంతైనా తగ్గలేదట. ప్రస్తుతం సూర్య చేతిలో వున్న సినిమా -ఆకాశం నీ హద్దురా. తెలుగమ్మాయి సుధా కొంగర తెరకెక్కిస్తోన్న చిత్రమిది.

Pages