S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/20/2020 - 22:13

స్వేచ్ఛ ఉంటేనే ఆడపిల్లలు ఏ రంగంలోనైనా రాణిస్తారని కథానాయిక, గాయని మంగ్లీ అన్నారు. రామానాయుడు ప్రివ్యూ థియేటర్‌లో ‘స్వేచ్ఛ’ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో నిర్మాత రాజునాయక్, సంగీత దర్శకుడు భోలే పాల్గొన్నారు. మంగ్లీ మాట్లాడుతూ -పోస్టర్‌లో నేను కనిపించటం లేదు. సీతాకోకచిలుకే కనిపిస్తోంది. అంతందగా డిజైన్ చేశారు. ఆడపిల్లలకు స్వేచ్ఛనిస్తేనే వాళ్లు ఎంచుకునే రంగాల్లో రాణించగలుగుతారు.

02/20/2020 - 22:12

అందం, అభినయంతో ఆకట్టుకున్న కథానాయిక -లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసి నుంచి అర్జున్ సురవరం వరకూ -మంచి పాత్రలతో మెప్పించిన లావణ్య.. ఇప్పుడు సెకెండ్ ఫేజ్ మొదలెట్టిన ఉత్సాహంతో కనిపిస్తోంది. ప్రస్తుతం సందీప్ కిషన్‌తో ఏ1 ఎక్స్‌ప్రెస్, కార్తికేయతో చావు కబురు చల్లగా చిత్రాలు చేస్తోన్న లావణ్య.. పాత్రల్లో పరిణితి చూపించేందుకు ప్రత్యేక కసరత్తులు మొదలెట్టింది.

02/20/2020 - 22:10

నయనతార మరో సస్పెన్స్ హారర్‌తో తెలుగు ఆడియన్స్ ముందుకొస్తోంది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో దూసుకుపోతున్న సూపర్ క్రేజీ హీరోయిన్ నయన్ -‘వసంతకాలం’ చిత్రంతో మరోసారి తన నట మాయాజాలాన్ని చూపించనుందని నిర్మాత దామెర విఎస్‌ఎస్ శ్రీనివాస్ అంటున్నాడు. సస్పెన్స్ హారర్ థ్రిల్లర్‌గా తమిళంలో ఇప్పటికే సెనే్సషన్ సృష్టించిన సినిమాను ‘వసంత కాలం’ టైటిల్‌తో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడు శ్రీనివాస్.

02/20/2020 - 22:09

బహుముఖ ప్రజ్ఞాశాలి, దర్శక నిర్మాత విజయ నిర్మల 74వ జయంతి పురస్కరించుకుని హైదరాబాద్ నానాక్‌రామ్‌గూడ నివాసంలో ఆమె విగ్రహాన్ని సూపర్‌స్టార్ కృష్ణ ఆవిష్కరించారు. కొడుకు నరేష్, స్టార్ హీరో మహేష్‌బాబు, సీనియర్ హీరో కృష్ణంరాజు తదితర సినీ ప్రముఖులు పాల్గొన్న కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ హాజరై విజయనిర్మలకు నివాళి ప్రకటించారు.

02/20/2020 - 22:06

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు నిర్మించిన పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ వెబ్ సిరీస్ -చదరంగం. ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానంలోని చిన్న ఎపిసోడ్‌ని తీసుకుని ఇప్పటి కాలమాన పరిస్థితులకు లింక్ చేస్తూ చేసిన వెబ్ చిత్రమిది. ఎన్టీఆర్‌గా శ్రీకాంత్ కనిపించనున్న చిత్రంలో సునైన్, నాగినీడు, కౌసల్య తదితరులు నటించారు.

02/19/2020 - 22:10

చిరంజీవిని ఆచార్యగా చూపిస్తూ దర్శకుడు కొరటాల మెగా 152 ప్రాజెక్టు తెరకెక్కిస్తున్నాడు. సోషియో పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రంలో రామ్‌చరణ్ ఎక్కువ నిడివి వున్న ప్రత్యేక పాత్రలో చేయనుండటం తెలిసిందే. నక్సలైట్ పాత్రలో చరణ్ కనిపిస్తాడని, తండ్రీ కొడుకులిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి ఆడియన్స్‌కి ఫీస్ట్ చేస్తారన్న కథనాలు నిన్నటి వరకూ వినిపించాయి.

02/19/2020 - 22:09

ఏడాదిన్నర గ్యాప్ తరువాత ‘ భీష్మ’ టైటిల్‌తో వస్తున్నాడు హీరో నితిన్. ఈ సినిమాలో -యంగ్ సెనే్సషన్ రష్మిక మండన్న నితిన్‌తో రొమాన్స్ చూపించనుంది. ‘చలో’ ఫేమ్ వెంకీ కుడుముల తెరకెక్కిస్తోన్న చిత్రం 21న థియేటర్లకు వస్తోంది. ప్రాజెక్టు ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం హీరో నితిన్ మీడియాతో మాట్లాడాడు.
* భీష్మ కథ ఎలా..?

02/19/2020 - 22:06

మరోసారి జూ.ఎన్టీఆర్ -త్రివిక్రమ్ కాంబినేషన్ ప్రాజెక్టు సెట్టైంది. ట్రిపుల్ ఆర్ తరువాత ఎన్టీఆర్ ఎవరితో సినిమా చేస్తాడన్న అంశంపై వినిపిస్తోన్న రకరకాల ఊహాగానాలకు తెరదించుతూ -అధికారిక ప్రకటన వెలువడింది. అయితే, ఇప్పటి వరకూ వినిపించిన ఊహాగానాల్లో త్రివిక్రమ్ తరువాతే మిగిలిన పేర్లు వినిపిస్తూ వచ్చాయి. సో, అంతా ఊహించినట్టే జూ.ఎన్టీఆర్, త్రివిక్రమ్‌తో ప్రాజెక్టును ఓకే చేసుకున్నారు.

02/19/2020 - 22:04

సీనియర్ హీరో రాజశేఖర్‌కు సరైన జోడీ దొరకడం కష్టమవుతోంది. గరుడవేగ తర్వాత కల్కిగా ప్రేక్షకులకు ముందుకొచ్చినా మ్యాజిక్ జరగలేదు. ఇప్పుడు తాజాగా రాజశేఖర్ వీరభద్రం చౌదరి దర్శకత్వంలో ఓ కన్నడ రీమేక్ చేస్తున్నాడు. రాజశేఖర్ ఏజ్‌ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు చౌదరి -సీనియర్ హీరోయిన్‌నే బోర్డ్‌లోకి ఎంపిక చేసుకున్నాడట. ఆమె ఎవరో కాదు -శ్రీయా శరణ్.

02/19/2020 - 22:02

విశ్వక్‌సేన్, రుహానీశర్మ జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంత్ త్రిపురనేని రూపొందిస్తున్న చిత్రం -హిట్. చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను నిర్మాత దిల్‌రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ -ట్రైలర్ చూస్తుంటే సినిమా తప్పక చూడాలన్న ఆసక్తి కలుగుతుందని, నైజాం వైజాగ్‌లలో సినిమాను తామే విడుదల చేస్తున్నామన్నారు.

Pages