S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/19/2020 - 22:00

కారంపురి క్రియేషన్స్, మైక్ మూవీస్ పతాకాలపై విశ్వక్‌సేన్, సాయిరోనక్, ప్రీతి అస్రానీ ప్రధాన తారాగణంగా సుజోయ్, సుశీల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం -ప్రెజర్ కుక్కర్. ఈనెల 21న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. హీరో విశ్వక్‌సేన్ బిగ్ సీడీ విడుదల చేశారు.

02/19/2020 - 21:58

బగ్గిడి ఆర్ట్స్ మూవీస్ పతాకంపై రూపొందించిన బయోపిక్ రైట్ రైట్ బగ్గిడి గోపాల్ చిత్రానికి సంబంధించిన ప్రీరిలీజ్ వేడుక 23న పుంగనూరులో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సినిమా వివరాలను బగ్గిడి గోపాల్ వివరిస్తూ -1982 మార్చిలో జరిగిన ఎన్నికల్లో కీలక మార్పులు జరిగాయని, ఆరోజు తాను ఎన్టీఆర్‌తో కలిసి నడిచానన్నారు.

02/19/2020 - 21:56

లక్ష్ చదలవాడ, దిగంగన సూర్యవంశీ జోడీగా రమేష్ కుదుముల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ -వలయం. 21న సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో హీరో లక్ష్ మీడియాతో మాట్లాడాడు. -అదృశ్యమైన భార్యను వెతుక్కునే హీరో కథే ఇది. కథానాయకుడి పాత్రా అనుమానాస్పదం కావడంతో థ్రిల్లింగ్ ఎలిమెంట్సేతో సాగుతుంది. పైగా యూత్ కోరుకునే అన్ని ఎలిమెంట్స్‌తో వస్తోన్న పుల్ ప్యాక్ట్ సినిమా -వలయం. హీరోగా నాకిది ఐదో సినిమా.

02/19/2020 - 21:55

మూడే మూడు పాత్రలతో ఆడియన్స్‌ని రెండు గంటల పాటు థియేటర్లో కూర్చోబెట్టే ప్రయోగంగా వస్తోన్న చిత్రం -స్క్రీన్ ప్లే. విక్రమ్ శివ, ప్రగతి యాదాటి లీడ్‌రోల్స్‌లో కెఎల్ ప్రసాద్ తెరకెక్కించారు. బుజ్జి బుడుగు ఫిలిమ్స్ బ్యానర్‌పై అరుణకుమారి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ట్రైలర్ విడుదలైంది.

02/19/2020 - 21:53

ఇస్మార్ట్ శంకర్‌లో ఇద్దరు బ్యూటీలున్నా -సక్సెస్‌ను పూర్తిగా క్యాప్చర్ చేసిన ఇస్మార్ట్ మాత్రం -నభానటేష్. ఇస్మార్ట్ రామ్ పక్కన టర్కీ కోడిగా చెలరేగిపోవడంతో -నభాను వెతుక్కుంటూ అవకాశాలు బాగానే వచ్చాయి. అలా ఎంపిక చేసుకున్న వాటిలో ఈమధ్యే వచ్చిన ‘డిస్కోరాజా’ ఫ్లాపైనా ఆ ఇంపాక్ట్ తనపై పడకుండా నభా జాగ్రత్తపడింది.

02/18/2020 - 22:10

చాలా సినిమాలు హీరోకి పేరు తెస్తే -అప్పుడప్పుడూ కొన్ని మాత్రం డైరెక్టర్‌ని హీరోగా మార్చేస్తుంటాయి. గత రెండేళ్లలో అలాంటి స్టార్ ఇమేజ్ అందుకున్నవాడు -సందీప్ వంగా. అర్జున్‌రెడ్డి హిట్ తెచ్చిన ఇమేజ్ ఇక్కడ పెట్టుబడిగా పెట్టకుండా బాలీవుడికి వెళ్లిన సందీప్ -అక్కడా రీమేక్ ‘కబీర్ సింగ్’తో మరికొంత ఇమేజ్ తెచ్చుకున్నాడు.

02/18/2020 - 22:09

అల.. వైకుంఠపురములో చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు త్రివిక్రమ్. అత్తారింటికి దారేది చిత్రం తరువాత.. ఆ స్థాయి హిట్టందుకున్న చిత్రం అలే. తరువాతి ప్రాజెక్టును జూ.ఎన్టీఆర్‌తో చేస్తాడంటూ వార్తలొచ్చాయి. అధికారిక ప్రకటన లేకున్నా -త్రివిక్రమ్‌తో ప్రాజెక్టుకు ఎన్టీఆర్ సైతం ఆసక్తి చూపిస్తున్నాడన్న కథనాలూ వినిపించాయి. సో, వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ప్రాజెక్టు కష్టమైన విషయమేం కాదు.

02/18/2020 - 22:07

గీతా ఆర్ట్స్‌తో జిఎమ్‌బి జాయింట్ వెంచర్‌లో అభిరుచివున్న నిర్మాతలు కలిశారు. కాంబో ట్రెండ్‌పై ఎక్కువ ఆసక్తి చూపే ఇండస్ట్రీలో -గీతా ఆర్ట్స్ -హారిక హాసిని క్రియేషన్స్ కలసి అల వైకుంఠపురములో చిత్రాన్ని రూపొందించాయి. యువీ క్రియేషన్స్, జిఎ 2 సంస్థలు సంయుక్తంగా వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్‌లాంటి సంస్థలూ భాగస్వామ్య సినిమాలు చేస్తున్నాయి.

02/18/2020 - 22:03

స్టార్ హీరోయిన్ రకుల్‌ప్రీత్ ఇప్పుడేం చేస్తోంది? అన్న ప్రశ్నకు -కెరీర్‌ను ఎంత డౌన్‌ఫాల్‌కు తీసుకెళ్లొచ్చో తీవ్రంగా ఆలోచిస్తోందంటూ సెటైర్లు వేస్తోంది ఇండస్ట్రీ. రకుల్ గురించి టాలీవుడ్, బాలీవుడ్‌లోనూ ఇదే మాట వినిపిస్తోంది. ఎంతవేగంగా స్టార్ హీరోల సరసన చాన్స్‌లు అందుకుందో.. బాలీవుడ్‌కి వెళ్లాక అంతే వేగంగా అసలు అవకాశాలకే దూరమైపోయింది రకుల్. ఆమె చేతిలో ఇప్పుడు సినిమాలు లేవట.

02/18/2020 - 22:01

కృతిగార్గ్, అభిరామ్ వర్మ లీడ్‌రోల్స్‌లో డైరెక్టర్ సుబ్బు వేదుల తెరకెక్కించిన చిత్రం -రాహు. కాలకేయ ప్రభాగర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తి చేసుకున్న సినిమా 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం నిర్వహించిన మీడియా సమావేశంలో జీవిత రాజశేఖర్, నిర్మాత రాజ్ కందుకూరి, మధుర శ్రీధర్ పాల్గొన్నారు.

Pages