S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/25/2018 - 23:15

ప్రియాంత్‌ని హీరోగా పరిచయం చేస్తూ.. నిశ్చయ్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ సినిమా ‘కొత్తగా మా ప్రయాణం’. యామిని భాస్కర్ కథానాయిక. ‘ఈ వర్షం సాక్షిగా’ ఫేం రమణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది.

11/25/2018 - 22:26

చైతన్య దంతులూరి దర్శకత్వంలో ‘నారారోహిత్’ హీరోగా 1971 కాలంలో యుద్ధం నేపథ్యంలో సాగే ఓ పీరియాడిక్ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ నుండి షూట్‌కి వెళ్ళనుందని తెలుస్తోంది. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిందట. ఈసారి ఎలాగైనా హిట్‌కొట్టాలని చైతన్య దంతులూరి ఎన్నో జాగ్రత్తలు తీసుకొనిమరీ ఈ సినిమా చేస్తున్నారు.

11/25/2018 - 23:20

విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘టాక్సీవాలా’. జిఎ2 పిక్చర్స్, యువి క్రియేషన్స్ బ్యానర్‌పై రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో ఎస్‌కెఎన్ నిర్మించిన చిత్రం విడుదలై అఖండ విజయం సాధించింది. ఈ సందర్భంగా సినిమా టీమ్ విజయయాత్ర నిర్వహించింది.

11/25/2018 - 23:17

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నాయకురాలు జయలలితపై తమిళంలో మూడు బయోపిక్‌లకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూడు బయోపిక్‌లకు ప్రస్తుతం కథానాయికల సెర్చ్ సాగుతోంది. ఇప్పటికే ఓ బయోపిక్ టైటిల్‌ని ప్రకటించారు. ‘ది ఐరన్ లేడీ’-ఏ స్టోరీ ఆఫ్ రివల్యూషనరీ లీడర్- పేరుతో తెరకెక్కనున్న ఈ బయోపిక్‌లో కథానాయికగా నిత్యామీనన్‌ని ఫైనల్ చేశారు.

11/25/2018 - 23:19

కనులకు పండుగలా అనిపించే లొకేషన్స్‌తో, మనసుని హత్తుకునే సంగీతంతో ‘మంచు కురిసే వేళలో’ ఖచ్చితంగా విజయం అందుకుంటుందని ఆశిస్తున్నారు స్టార్ డైరెక్టర్ మారుతి. రామ్‌కార్తీక్, ప్రణాలి జంటగా బాల బోడెపూడి స్వీయ దర్శకత్వంలో ప్రణతి ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ‘మంచు కురిసే వేళలో’ సినిమా టీజర్‌ను ఇటీవల లాంచ్ చేశారు మారుతి. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ-టీజర్ చాలా బాగుంది. ఫొటోగ్రఫి అద్భుతంగా ఉంది.

11/25/2018 - 22:23

నాచురల్ స్టార్ నాని నటిస్తున్న పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’ విడుదల తేదీ ఖరారైయింది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కొద్దిసేపటి క్రితం ఈ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 19న విడుదలకానుంది.

11/23/2018 - 20:25

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శీను, మెగా టీం హీరో రామ్‌చరణ్ కాంబోలో వస్తున్న చిత్రం -వినయ విధేయ రామ. టైటిల్ సాఫ్ట్‌గావున్నా సినిమా మాత్రం దుమ్ములేపేదే అని బోయపాటి టీం చెప్పకనే చెబుతోంది. రామ్‌చరణ్ సరసన బ్యూటీ కెయిరా అద్వానీ కనిపిస్తుంటే, సినిమాలో వివేక్ ఓబెరాయ్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడు.

11/23/2018 - 20:22

పుష్కరకాలం కిందట వచ్చిన చిరుత సినిమాతో టాలీవులోకి ఎంట్రీ ఇచ్చిన నేహాశర్మ గుర్తుందిగా.. ఈమధ్య సినిమాల్లో కంటే సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. నేహ సినిమాల్లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోలేకపోయిందిగానీ ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం మంచి ఫాలోయింగే ఉంది. రీసెంట్‌గా ఈ పిల్ల ఒక హాట్ పిక్ పోస్టు చేసింది. ఈ అందాల భామ పుట్టినరోజు నవంబర్ 21న. అందుకే అలా రెడ్ హాట్‌గా దర్శనమిచ్చి నెటిజనుల కన్నులపండుగగా మారింది.

11/23/2018 - 20:20

వరుణ్‌తేజ్ హీరోగా సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అంతరిక్షం’. ఘాజి వంటి విభిన్న చిత్రాన్ని తెరకెక్కించిన సంకల్ప్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న నేపథ్యంలో సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. ఘాజి ఒక వర్గానికి మాత్రమే రీచ్ అయ్యింది. దాంతో అంతరిక్షంకు భారీ ప్రమోషన్ చేయాలనే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు.

11/23/2018 - 20:18

తెలుగు, తమిళంలో వైవిధ్యమైన కథలతో హీరోగా తనకంటూ ఇమేజ్ తెచ్చుకున్న సందీప్‌కిషన్ ఇపుడు నిర్మాతగా మారాడు. నెక్స్ట్ ఏంటి? అన్న ఆలోచనలో -సొంత బ్యానర్‌పై ప్రాజెక్టును సిద్ధం చేస్తున్నాడు. అనన్య సింగ్‌తో ‘నిను వీడని నీడను నేనే’ అంటూ కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాడు సందీప్. వెంకటాద్రి టాకీస్‌పై ద్విభాషా చిత్రంగా రాబోతున్న చిత్రానికి దర్శకుడు కార్తిక్‌రాజు. సినిమాకు సంబంధించి సందీప్ తొలి లుక్ ఇది.

Pages