S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/23/2018 - 19:48

రాఘవ్‌ను హీరోగా పరిచయం చేస్తూ.. నంది క్రియేషన్స్ పతాకంపై నిర్మాతలు కె.ఎం.డి.రఫి, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మాణంలో కోటేంద్ర దుద్యాలను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిన చిత్రం ‘బంగారి బాలరాజు’. కరోణ్య కత్రిన్ హీరోయిన్. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఈనెల 25న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హీరో రాఘవ్ మీడియాతో ముచ్చటించిన విశేషాలు..

10/23/2018 - 19:45

మంచి పేరు తెచ్చుకోవాలి- చాందిని
గీతానంద్, చాందినీ భగవనేనీ జంటగా చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో రాజ్ ధారపనేని నిర్మించిన చిత్రం ‘రథం’. ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా హీరోయిన్ చాందిని ముచ్చట్లు.

10/23/2018 - 19:43

అనంతలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై ముళ్లగూరు అనంతరాముడు, రమేష్ నాయుడు తెలుగు, కన్నడ భాషల్లో సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘టూ ఫ్రెండ్స్’. ‘ట్రూ లవ్’ ట్యాగ్ లైన్. సూరజ్, అఖిల్ కార్తిక్, సోనియా, ఫర హీరో హీరోయిన్లు. శ్రీనివాస్ జిఎల్‌బి దర్శకుడు. ఈనెల 26న విడుదలవుతున్న చిత్రం ప్రీరిలీజ్ వేడుకను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు.

10/23/2018 - 19:42

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటివరకు క్రేజీ హీరోగానే చూసాం... కానీ ఇప్పుడు అదే క్రేజ్‌తో నిర్మాతగా మారుతున్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. నిజానికి అల్లు అర్జున్‌కు సపరేట్‌గా బ్యానర్ పెట్టాల్సిన అవసరంలేదు. ఎందుకంటే ఇప్పటికే గీత ఆర్ట్స్ అనే ప్రతిష్టాత్మక బ్యానర్ ఉంది. అల్లు అరవింద్ నేతృత్వంలో ఎన్నో సంచలన చిత్రాలను నిర్మించారు.

10/23/2018 - 19:39

లంచగొండుల కుత్తుక తెగ్గోసి, తప్పుడువాళ్ల గుండెల్లో నిద్రపోయిన సేనాపతి గుర్తున్నాడా? అతనే -కమల్‌హాసన్, శంకర్‌ల కాంబోగా వచ్చిన భారతీయుడు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ చేయనుండటం తెలిసిందే. కమల్‌తో మొదలెట్టనున్న రెండో భారతీయుడు డిసెంబర్‌లో సెట్స్‌పైకి రానుందని సమాచారం. 1996లో శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ నటించిన భారతీయుడు సంచలన విజయం అందుకున్న విషయం తెలిసిందే.

10/23/2018 - 19:38

తన తండ్రిపై లేనిపోని అభియోగాలు మోపినంత మాత్రాన పరిశ్రమలో నమ్మేవాళ్లెవరూ లేరంటోంది అర్జున్ కుమార్తె ఐశ్యర్య. ‘నాకు తెలిసి మా నాన్న పబ్‌కే ఎప్పుడూ వెళ్లలేదు. బాధ్యత కలిగిన వ్యక్తిగా ఆయన పనేదో ఆయన చేసుకుని వెళ్తుంటారు. అలాంటిది తనపట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ శ్రృతి హరిహరణ్ అభియోగాలు మోపినంత మాత్రాన నమ్మేసేవాళ్లు ఎవరూ లేరు’ అంటోంది ఐశ్వర్య.

10/22/2018 - 22:08

ప్రభాస్ పేరు చెబితే అభిమానులకు పూనకం. తోటి హీరోలకు ప్రేమపూర్వక ఈర్ష్య. చిన్న హీరోలకు అలా ఎదగాలన్న కల. ప్రస్తుతానికి ఆఫ్ స్క్రీన్‌లోనూ అతనే -బాహుబలి. రెబల్‌స్టార్ కృష్ణంరాజు నటవారసుడిగా స్క్రీన్‌కు వచ్చిన ప్రభాస్ ‘హీరో అంటే వీడేరా’ అనే స్థాయికి ఎదిగాడు. ఆరడుగుల స్ఫురద్రూపం. ఆకట్టుకునే ఆహార్యం. పరిణితి కలిగిన నటనతో తనకంటూ సెపరేట్ ట్రాక్ వేసుకుంటూ వచ్చాడు ప్రభాస్.

10/22/2018 - 22:04

బాలీవుడ్ జంట దీపికా పదుకొనె, రణ్‌వీర్‌సింగ్ ప్రేమ పెళ్లి వ్యవహారం అధికారికంగా బహిరంగమైంది. నవంబర్ 14, 15 తేదీల్లో జరగన్నున వివాహ వేడుకతో ఒకటి కాబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించేశారు. ఈ వార్త అభిమానులకే కాదు, ఇండస్ట్రీలోని చాలామంది ప్రముఖులకూ సర్‌ప్రైజే. ఇటలీలోని లేక్ కోమోలో అంగరంగ వైభవంగా పెళ్లి జరగనున్నట్టు సమాచారం. ఇదంతా ఒకే..

10/22/2018 - 22:02

‘మీ టూ’ ఉద్యమం దేశాన్ని ఊపేస్తోంది. ఈ ఉద్యమ స్ఫూర్తితో ఎంతోమంది మహిళలు లైంగిక వేధింపులపై గొంతు విప్పుతున్నారు. ఇక్కడ టెమ్ట్ రవి కూడా ‘మీ టూ’ అంటూ ముందుకొస్తున్నాడు. ‘ఏడు చేపల కథ’ చిత్రంలో టెమ్ట్ రవి వైవిధ్యమైన పాత్రతో మెప్పించబోతున్నాడు. అడల్ట్ కామెడీ జోనర్‌లో పూర్తిగా కొత్తవారితో నిర్మిస్తోన్న చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

10/22/2018 - 21:58

తెలుగు ప్రజలకు.. నందమూరి అభిమానులకు.. నందమూరి బాలకృష్ణ దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలతోపాటు ఎన్టీఆర్ బయోపిక్‌లోని వేటగాడు స్టిల్ విడుదల చేసారు. ఆకుచాటు పిందె తడిసే అంటూ అప్పట్లో అన్నగారు వేసిన స్టెప్పులోనే ఇప్పుడు బాలయ్య కనిపించారు. ఈ పిక్ అభిమానులతోపాటు ప్రేక్షకులను కూడా విశేషంగా అలరిస్తుంది.

Pages