S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/07/2018 - 22:03

సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో మెగా హీరో వరుణ్‌తేజ్ తాజాగా నటిస్తున్న చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన అంతరిక్షం సెట్స్‌లో షూటింగ్ జరుగుతోంది. ఘాజి తరువాత సంకల్ప్‌రెడ్డి చేస్తున్న సాటిలైట్ సినిమా ఇది. ఇందులో వరుణ్ తేజ్ వ్యోమగామిగా కనిపించనున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం వరుణ్‌తేజ్ ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకున్నాడు.

06/07/2018 - 21:49

సశేషం, భూ, దేవిశ్రీప్రసాద్ లాంటి విలక్షణమైన సినిమాలను తెరకెక్కించిన విలక్షణ దర్శకుడు శ్రీకిశోర్ ఇప్పుడు ‘మై ఇండియన్ బాయ్‌ఫ్రెండ్’ అనే చైనీస్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. చైనాలో ఓ ఇండియన్ అబ్బాయి..

06/07/2018 - 21:48

‘నీది నాది ఒకే కథ’ దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో శర్వానంద్, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటించబోతున్న చిత్రం ‘విరాటపర్వం 1992’. వేణు ఉడుగుల తన రెండో చిత్రంగా ఈ పీరియాడికల్ లవ్‌స్టోరీని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. 1990ల నేపథ్యంలో సాగే ఈ చిత్ర కథ చాలా ఆసక్తికరంగా ఉంటుందట. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు హృదయానికి హత్తుకునేలా చాలా ఎమోషనల్‌గా ఉంటాయని సమాచారం.

06/07/2018 - 21:47

నాగశౌర్య హీరోగా సుందర్ సూర్య దర్శకత్వంలో స్వాజిత్ మూవీస్ పతాకంపై రాజేష్ నిర్మించిన చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’ విడుదలై విజయవంతంగా రెండు వారాలు పూర్తిచేసుకొని మూడోవారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికీ మంచి కలెక్షన్స్‌తో ప్రదర్శితమవుతోందని చిత్ర దర్శకులు సుందర్ సూర్య చెబుతూ.. దర్శకుడిగా నా మొదటి చిత్రాన్ని ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్ళకు ముందుగా నా కృతజ్ఞతలు.

06/07/2018 - 21:46

జంబలకిడి పంబ పేరు వినగానే నరేష్ హీరోగా ఇవివి సత్యనారాయణ చేసిన నవ్వుల సందడి గుర్తుకొస్తుంది. తాజాగా అదే పేరుతో శ్రీనివాసరెడ్డి కథానాయకుడిగా ఓ సినిమా రూపొందుతోంది. శివమ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్స్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెక్కిస్తున్నాయి. సిద్ధి ఇద్నాని కథానాయిక. జె.బి.మురళీకృష్ణ (మను) దర్శకత్వం వహిస్తున్నారు. రవి, జోజో జోస్, ఎన్.శ్రీనివాస్‌రెడ్డి నిర్మాతలు.

06/07/2018 - 22:04

దేశముదురు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బొద్దుగుమ్మ హన్సిక ఇక్కడ చాలా సినిమాలు చేసి ప్రస్తుతం కోలీవుడ్‌లో సెటిల్ అయింది. తమిళ ప్రేక్షకులకు కాస్త బొద్దుగా ఉండే హీరోయిన్స్ ఇష్టం కాబట్టి అక్కడే వరుసగా అవకాశాలు అందుకుంది. అయితే ఈమధ్య ఈ అమ్మడు నటిస్తున్న సినిమాలన్నీ వరుసగా ఫ్లాపులు అవుతుండడంతో కొత్త అవకాశాలు తగ్గాయి. దాంతో స్లిమ్‌గా మారేందుకు తెగ కసరత్తులు చేసింది.

06/07/2018 - 22:06

అనూహ్యమైన కథాంశంతో ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కిన ‘సమ్మోహనం’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. సుధీర్‌బాబు హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన చిత్రం ‘సమ్మోహనం’. బాలీవుడ్ భామ అతిథిరావు హైదరీ ఇందులో నాయికగా నటించారు. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ- మేం ముందుగా అనుకున్న విధంగానే సినిమా చాలా బాగా వచ్చింది.

06/07/2018 - 22:05

రానా దగ్గుబాటి చేస్తున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘హాతి మేరే సాతి’ కూడా ఒకటి. తెలుగులో ‘అరణ్య’ పేరుతో ఈ చిత్రం విడుదల కానుంది. ఏనుగులు, మనుషులు మధ్య ఉండే స్నేహ బంధం అనే అంశం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో రానాకు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ కల్కి కొచ్లిన్ నటించనుంది. ఈ చిత్రంలో ఆమె తమిళనాడుకు చెందిన యువతిగా కనిపిస్తుంది.

06/07/2018 - 22:12

గరుడవేగ సినిమాతో సూపర్‌హిట్ కొట్టిన ప్రవీణ్ సత్తారుకు రామ్ పూర్తి కథ వినకుండానే అవకాశం ఇచ్చాడు. స్రవంతి మూవీస్‌లో ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుంది. కానీ స్క్రిప్ట్ మొత్తం విన్నాక బడ్జెట్ ఎక్కువయిందని స్రవంతి మూవీస్ ఈ సినిమా నుంచి తప్పుకుంది. దాంతో రామ్ హీరోగా రావాల్సిన ఈ సినిమా ఆగిపోయింది. ప్రవీణ్ సత్తారు ఇప్పుడు ఈ కథను ధనుష్‌తో చేస్తే బాగుంటుందని భావిస్తున్నాడట.

06/06/2018 - 22:34

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకంపై ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న చిత్రం ‘తేజ్’, ‘ఐ లవ్ యు’ అనేది ఉపశీర్షిక. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో భాగంగా ఎడిటింగ్, డబ్బింగ్ జరుగుతోంది. జూన్ 29న చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Pages