S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/09/2018 - 20:52

తేజ దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తోన్న సినిమా ‘ఆటా నాదే వేటా నాదే’. ఈ చిత్ర షూటింగ్ వచ్చేవారం హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. అనుప్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను సురేష్‌బాబు అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ ప్రొఫెసర్ రోల్‌లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా వెంకటేష్ లుక్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఫాన్స్ వెంకటేష్ లుక్ చూసి ఖుషీ అయిపోతున్నారు.

03/09/2018 - 20:51

పార్లమెంటు సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి డా.టి.సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో కాకతీయ కళాపరిషత్ సంస్థను స్థాపించిన విషయం తెలిసిందే. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వైభవోపేతంగా అలనాటి కాకతీయ సామ్రాజ్య కళావైదుష్యాన్ని, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో నెలకొల్పిన ఈ కళాపరిషత్ కార్యక్రమాన్ని ఈనెల 11న మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించనున్నారు.

03/09/2018 - 20:48

చిత్ర పరిశ్రమలో బంద్ అనేది బ్రహ్మాస్త్రం లాంటిది. దానిని ఉపయోగించి తెలుగు ఫిలించాంబర్ ఏం సాధించిందో అర్థం కావడంలేదన్నారు నారాయణమూర్తి. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ రేట్లు తగ్గించాలంటూ సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఒక తాటిమీదకొచ్చి మార్చి 2నుంచి థియేటర్లు బంద్ చేసిన విషయం తెలిసిందే.

03/09/2018 - 20:46

రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడూ పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు..
రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడూ పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు..
గొల్లభామ వచ్చి నా గోరు గిల్లుతుంటే..

03/10/2018 - 02:31

ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ తనయుడు తేజ వివాహం నాగశ్రీతో గురువారం రాత్రి హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ రాజకీయరంగ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను
ఆశీర్వదించారు.

03/09/2018 - 20:42

నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మేలు కోసం కాకుండా కొందరు వ్యక్తులు స్వార్థ ప్రయోజనాల కోసమే సినిమా థియేటర్ల బంద్ జరుగుతోందని నిర్మాత నట్టికుమార్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నట్టికుమార్ మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ చిన్న సమస్య కోసం గత ఆరు రోజులుగా థియేటర్లను బంద్ చేయించడం విడ్డూరంగా ఉంది.

03/09/2018 - 20:41

ఆరాధ్య ప్రొడక్షన్స్ పతాకంపై శివ, సుప్రియ, సురేష్ జెండా, సునీల్, పద్మ ముఖ్య నటీనటులుగా ప్రదీప్‌రాజ్ దర్శకత్వంలో, పెనాక దయాకర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘‘దెయ్యం చెప్పిన కథ’’. నవీన్ జె.సంగీత దర్శకత్వంలో రూపొందిన పాటలు ఫిలిం చాంబర్‌లో ఘనంగ విడుదలయ్యాయి.

03/08/2018 - 21:38

దశాబ్ద కాలం పాటు దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ శ్రీయ గురించి తాజాగా ఓ వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది. రష్యాకు చెందిన వ్యక్తిని ప్రేమిస్తుందనీ త్వరలో వీరిద్దరి వివాహం జరగనుందంటూ వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా శ్రీయతో పాటు అతగాడున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ నానా రచ్చ చేస్తున్నారు.

03/08/2018 - 21:36

ఈ మధ్య తెలుగు, హిందీ, తమిళ సినిమాలకు సంబంధించిన డిజిటల్ హక్కులను ప్రముఖ చానల్ ఆమెజాన్ సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ కంపెనీ అందరికంటే ఎక్కువ మొత్తానికి సదరు సినిమాలకు సంబంధించిన డిజిటల్ హక్కులను తీసుకుంటూ ఆ సినిమాకు మరింత క్రేజ్ తీసుకొస్తుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా డిజిటల్ హక్కులు ఏకంగా 30 కోట్లకు కొనేసిన అమెజాన్ సంస్థ తాజాగా నాగ్ ఆఫీసర్ హక్కులు కొనేసింది.

03/08/2018 - 21:33

‘ఈగ’ ఫేమ్ సుదీప్ హీరోగా నిత్యమీనన్ హీరోయిన్‌గా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో కన్నడ, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం ‘కోటిగొబ్బ 2’. ఈ చిత్రం ఇటీవల విడుదలై సెనే్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయి 120 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ చిత్రాన్ని దుహర మూవీస్ పతాకంపై యువ నిర్మాత కళ్యాణ్ ధూళిపాళ్ల ‘కోటికొక్కడు’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

Pages