S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/06/2018 - 20:49

కామెడీ కింగ్ అల్లరి నరేష్, టాప్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర కాంబినేషన్‌లో వచ్చిన ‘అహనా పెళ్లంట, యాక్షన్ 3డి, జేమ్స్‌బాండ్’ చిత్రాలు మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ హ్యాట్రిక్ హిట్ అనంతరం అల్లరి నరేష్ - అనిల్ సుంకరల కాంబినేషన్‌లో నాలుగో చిత్రం రానుంది.

03/06/2018 - 20:47

‘లె ఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేమ్ సుధాకర్ కొంత విరామం అనంతరం మళ్లీ వెండితెరపై కనువిందు చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు.

03/05/2018 - 20:47

అనిల్ నెమలి, మేఘన హీరో హీరోయిన్లుగా తారానీలు కార్పొరేషన్ పతాకంపై అనురాగ్ (ఎమ్. ఎస్. బాబు) స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమయింది. నాయకా నాయికలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీరామ్ క్లాప్‌నివ్వగా, భూపతి రాజా కెమెరా స్విచ్చాన్ చేశారు. దాసరి కిరణ్‌కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు.

03/05/2018 - 20:44

ఈ మధ్య కాలంలో సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపుల విషయంలో పలువురు హీరోయిన్స్ సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. కొందరు కాస్టింగ్ కౌచ్‌కు గురయ్యామని బాహాటంగానే చెప్పి సంచలనం రేపారు. తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ క్రేజీ భామ రకుల్ ప్రీత్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో స్పందించింది.

03/05/2018 - 20:42

త్రివిక్రమ్ సినిమా కోసం రెడీ అవుతున్నారు ఎన్టీఆర్. ఈ సినిమాలో ఆయన చాలా స్లిమ్‌గా కొత్తలుక్‌లో కనిపించేందుకు జిమ్‌లో కుస్తీలు పడుతున్నారు. అందుకే ఈ మధ్య ఎన్టీఆర్ బయట ఎక్కడా కనిపించడం లేదు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌తోనే అందరికీ షాక్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాడు. మరోవైపు త్రివిక్రమ్ కూడా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ నెల 26 నుండి ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది.

03/05/2018 - 20:37

పెళ్లిచూపులు చిత్రం ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన విజయ్ దేవరకొండ మలి చిత్రం అర్జున్‌రెడ్డితో వరల్డ్‌గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కేవలం రెండు చిత్రాలతో ఇంతటి క్రేజ్‌ని, పాపులారిటీనీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ నిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యారు.

03/05/2018 - 20:36

అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో చంద్ర బాలాజీ పతాకంపై సాయికృష్ణ కె.వి.ని దర్శకుడిగా పరిచయం చేస్తూ కె.చంద్రరావు నిర్మిస్తున్న చిత్రం ‘అనగనగా ఒక ఊళ్ళో’. పల్లెటూరికి వినోద యాత్ర అనేది ట్యాగ్‌లైన్. అశోక్‌కుమార్, ప్రియాంక శర్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఆడియో వేడుక అత్యంత వైభవంగా జరిగింది.

03/05/2018 - 20:33

తేజ దర్శకత్వంలో బాలకృష్ణ నటించబోతున్న ఎన్టీఆర్ సినిమా ఈ నెల 29న ప్రారంభం కానుంది. మార్చి 29న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆ రోజు సినిమాను ప్రారంభించబోతున్నారు. కీరవాణి సంగీతం అందించబోతున్న ఈ సినిమాకు బుర్రా సాయిమాధవ్ మాటలు రాస్తున్నారు. కళ్యాణ్ రామ్ అబ్బాయి ఈ సినిమాలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో బాలయ్య 72 విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారు.

03/05/2018 - 20:32

బాలీవుడ్‌లో హీరోయిన్‌గా కంటే కూడా క్రికెట్‌లో లేడీ యాంకర్‌గా క్రేజ్ తెచ్చుకున్న మందిరాబేడీ తెలుసుగా.. ఈ మధ్య ఈ అమ్మడు తన వయసును బాగా తగ్గించుకుని టూ పీస్ బికినీలు.. బీచ్‌లలో హాట్ హాట్ ఫోజులతో పిచ్చెక్కిస్తుంది. ఫిట్నెస్ విషయంలో చాలా కేర్ తీసుకునే ఈ అమ్మడి అందాల ప్రదర్శన ఎందరో రసిక హృదయాలను అల్లకల్లోలం చేసింది. తాజాగా ఈ భామ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో సినిమాలో నటిస్తుంది.

03/05/2018 - 20:29

డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల తీరును నిరసిస్తూ శుక్రవారం నుండి ఐదు రాష్ట్రాల నిర్మాతల మండలి సంయుక్తంగా థియేటర్ల బంద్ చేసిన విషయం తెలిసిందే. బంద్ విజయవంతంగా జరుగుతున్న సందర్బంగా తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.

Pages