S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/04/2018 - 22:18

బాలీవుడ్ భాములు ఈ మధ్య బికినీ ట్రెండ్‌లో పడిపోయారు.. ఎప్పుడు ఎవరు బికినీలో షాక్ ఇస్తారో తెలియని పరిస్థితి. ఇక చాలామంది బికినీ భామలు బికినీల్లో అందాలు ఆరబోసి అవకాశాలు పెట్టేసిన దాఖలాలు ఉన్నాయి. ఇక బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అదేనండి కంగనా రనౌత్ బికినీలో షాక్ ఇచ్చింది. తాజాగా తెలుగు దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో మణికర్ణికా చిత్రంలో వీర మహిళగా నటిస్తున్న ఈ అమ్మడు ఇలా బికినీలో షాక్ ఇచ్చింది.

03/04/2018 - 22:11

మెగాస్టార్ చిరంజీవి ఎనిమిదేళ్ల తరువాత ఖైదీ నంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి ఇంకా తన స్టామినా తగ్గలేదని బాక్స్ ఆఫీస్ వద్ద నిరూపించాడు. బాహుబలి తరువాత రెండో స్థానంలో వసూళ్లతో దుమ్ము రేపాడు మెగాస్టార్. ఇక ఆయన నటిస్తున్న నెక్స్ట్ సినిమా సైరా నరసింహారెడ్డి. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల నుండి రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలు కానుంది.

03/04/2018 - 22:10

జనరల్‌గా సినిమా స్టార్స్ జీవితాలు సుఖంగా.. రాయల్‌గా సాగుతాయని అనుకుంటారు జనాలు. కానీ ఇక్కడ సుఖం.. సంతోషాలు ఉంటాయన్నది అపోహే అన్న విషయాన్నీ చాలా మంది స్టార్స్ బాహాటంగానే తెలిపారు. ఈ విషయంపై సౌత్ క్రేజీ భామ తమన్నా స్పందించింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె స్పందిస్తూ తమది ఆడంబరాలతో కూడిన జీవితమే తప్ప పెద్దగా ఆనందం ఉండదని అంటుంది.

03/04/2018 - 22:08

స్నేహచిత్ర పతాకంపై ఆర్.నారాయణమూర్తి రూపొందిస్తున్న చిత్రం ‘అన్నదాతా సుఖీభవ’. ఈ సినిమా పాత్రికేయుల సమావేశం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ ‘‘పొద్దు వాలక ముందే నాగలిని భుజాన వేసుకుని పొలానికి వెళ్లి అందరికీ అన్నం పెట్టే రైతు పరిస్థితి నేడు ఎలా ఉంది. రైతు తన ఉనికిని కోల్పోతున్నాడు. రైతు దేశానికి వెనె్నముక అన్న రైతు వెనె్నముక విరిగిపోతుంది.

03/04/2018 - 22:07

‘ప్రేమమ్’ లాంటి సూపర్ సక్సెస్ అనంతరం అక్కినేని నాగచైతన్య, చందు మొండేటిల క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘సవ్యసాచి’. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాధవన్, భూమికలు ప్రత్యేక పాత్రలు పోషిస్తుండగా ‘‘సవ్యసాచి’’ ఫస్ట్ లుక్ మరియు రిలీజ్ డేట్‌లను ఎనౌన్స్ చేసారు మైత్రీ మూవీ మేకర్స్.

03/04/2018 - 22:05

గోలిసోడా ఫిల్మ్ పతాకంపై సుర ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత మల్కాపురం శివకుమార్ సమర్పణలో అర్జున్‌రెడ్డితో యూత్‌ఫుల్ స్టార్‌గా మారిన విజయ్ దేవరకొండ హీరోగా, శివానీ సింగ్ నాయికగా శ్రీ్ధర్ మర్రి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఏ మంత్రం వేసావె. ఈ చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

03/04/2018 - 22:03

ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై.. 14 ఏళ్ల క్రితం హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, యువ హీరో నితిన్ కాంబినేషన్లో వచ్చిన ‘దిల్’ సినిమా ఎంత సెనే్సషనల్ హిట్ అయ్యిందో తెలిసిందే.

03/02/2018 - 20:50

స్లోఅండ్ స్టడీగా వరుసగా ఒకదాన్ని మించి మరో విజయాన్ని అందుకుంటున్నాడు యంగ్ హీరో నాని. డబుల్ హ్యాట్రిక్ అందుకున్న నానితో సినిమాలు చేసేందుకు పలువురు క్రేజీ దర్శకులు క్యూ కడుతున్నారు? ఇప్పటికే త్రివిక్రమ్ నానితో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఇప్పుడు మరో క్రేజీ దర్శకుడు కూడా నానితో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడట.. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో తెలుసా.. కొరటాల శివ? ఏంటి షాక్ అవుతున్నారా..

03/02/2018 - 20:49

బాహుబలి తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా. ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాసిన బాహుబలి సినిమా ఎన్నో రికార్డులను బద్ధలు కొట్టింది. రాజవౌళి దర్శకత్వ ప్రతిభకు యావత్ ప్రపంచం సలాం కొట్టింది. తాజాగా బాహుబలిలో సాహోరే బాహుబలి.. సాంగ్ అప్పట్లో ఒక ఊపు ఊపేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సాంగ్ యూ ట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ దాటేసి సంచలనం రేపింది.

03/02/2018 - 20:47

ఓవైపు నందమూరి తారకరామారావు జీవిత కథతో ఎన్టీఆర్ సినిమాకు సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయన తనయుడు బాలకృష్ణ ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ పేరుతో రూపొందిస్తుంటే మరో రెండు సినిమాలు లైన్‌లోనే ఉన్నాయి. తాజాగా మరో బయోపిక్ కోసం రంగం సిద్ధం అవుతుంది. అయితే ఈసారి బయోపిక్ రూపొందిస్తున్నది ఎవరిపైనో తెలుసా..

Pages