S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/05/2017 - 19:29

సినిమా రంగంలో మహిళా దర్శకుల సంఖ్య ఎప్పుడూ తక్కువే. ఆ ఉన్నవాళ్ళల్లో కూడా కమర్షియల్ విజయాలు అందుకునేవారు ఇంకా అరుదు. టాలీవుడ్‌లో మహిళా దర్శకురాలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నందినిరెడ్డి అలా మొదలైంది చిత్రం తరువాత చేసిన సినిమాలన్నీ పరాజయాలు చవిచూశాయి. అయితే తన ప్రయత్నాలు తాను చేస్తూనే వుంది. తాజాగా విజయ్ దేవరకొండతో ఓ చిత్రాన్ని చేయడానికి సిద్ధమైంది.

12/05/2017 - 19:29

అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. గత నెల 30 నుండి అక్కడే షూటింగ్ జరుగుతుండగా, హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కూడా షూటింగ్‌లో చేరింది. హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

12/05/2017 - 19:41

తమన్నాకు ఈమధ్య కాలం సరిగ్గా కలిసిరావడంలేదు. బాహుబలి, అభినేత్రి చిత్రాల తరువాత అవకాశాలు కరువైన తమన్నా, ప్రస్తుతం బాలీవుడ్ రీమేక్ క్వీన్ చిత్రంలో మాత్రమే నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తరువాత మళ్లీ ఆమె ఫోకస్ రీమేక్ చిత్రాలపైనే పడింది. అందుకే పలువురు రీమేక్ సినిమాలతో వస్తే ఆ చిత్రంలో నటించేందుకు ఆసక్తి చూపిస్తోంది.

12/03/2017 - 20:49

అమెరికాలో తెలుగు సంస్థగా పేరుగన్న ‘ఆట’ (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న జీవన సాఫల్య పురస్కారాన్ని ఈసారి నటశేఖర కృష్ణకు అందించనున్నారు. నవంబర్ 26 నుండి డిసెంబర్ 23 వరకు జరుగనున్న ఆట కార్యక్రమాల్లో కృష్ణకు ఈ పురస్కారాన్ని అందజేయనున్నామని అధ్యక్షులు కరుణాకర్ అశిరెడ్డి తెలిపారు.

12/03/2017 - 20:47

అల్లు శిరీష్, సురభి, సీరత్‌కపూర్ ప్రధాన తారాగణంగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో లక్ష్మీనరసింహా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చక్రి చిగురుపాటి రూపొందిస్తున్న చిత్రం ‘ఒక్క క్షణం’. ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ను ఆదివారం హైదరాబాద్‌లో హీరో శిరీష్ విడుదల చేశారు.

12/03/2017 - 20:46

హాలీవుడ్ స్టన్నింగ్ బ్యూటీ సన్నీలియోన్ కథానాయికగా తెలుగులో నటిస్తోంది. ఇండియన్ కల్చర్ బ్యాక్ డ్రాప్ చారిత్రత్మక యుద్ధ నేపథ్యంలో ఈ చిత్రాన్ని వి.సి వడివుడయాన్ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. స్టీవ్స్ కార్నర్ పతాకంపై హోమ్స్ స్టీఫెన్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో నవదీప్, నాజర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం సన్నీలియోన్ కత్తియుద్ధం, గుర్రపు స్వారీ లాంటి విద్యలు నేర్చుకుని వున్నారు.

12/03/2017 - 20:44

వైవిధ్య కథలను ఎంచుకొంటూ తెలుగులో తనకంటూ ఓ గుర్తింపు సాధించాడు విజయ్ ఆంటోని. తాజాగా ఆయన ‘ఇంద్రసేన’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీనివాసన్ దర్శకత్వంలో ఎన్.కె.ఆర్. ఫిలిమ్స్ పతాకంపై నీలం కృష్ణారెడ్డి అందించిన ఈ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. సినిమాకు సంబంధించిన విజయోత్సవ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది.

12/03/2017 - 20:43

మహేష్‌బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను’ అన్న చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి కావస్తోంది. జనవరికల్లా సినిమా పూర్తి చేయనున్నారు. మహేష్‌బాబు 25వ చిత్రం ఫిబ్రవరి నుండి మొదలుకానున్నదని తెలుస్తోంది. వంశీ పైడిపల్లి ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.

12/03/2017 - 20:41

రజనీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో తాజాగా రూపొందించిన ‘రోబో2.0’ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. ఆ అంచనాలకు తగిన విధంగా ఈ చిత్రం ఇండియన్ సినిమాల్లో 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో హైటెక్నికల్ హంగులతో హాలీవుడ్ స్థాయిలో రూపొందింది. బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ విలన్‌గా విభిన్నమైన పాత్ర పోషిస్తుండగా, కథానాయికగా అమీజాక్సన్ నటిస్తోంది.

12/03/2017 - 20:40

సినిమా అనగానే ఇప్పుడు వస్తున్న ఏదో నాలుగు పాటలు, నాల్గు ఫైట్లు, కాస్త కామెడీ వున్న సినిమాలు కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఎఎన్నార్ లాంటి ప్రముఖ నటులు నటించిన పౌరాణిక సినిమాలైన ‘పాతాళభైరవి’, ‘సువర్ణసుందరి’లాంటి చిత్రాలు హిందీలో రీమేక్ చేయబడి జాతీయ స్థాయిలో అఖండ విజయాన్ని సాధించి వాటికున్న సత్తాను చాటుకున్నాయి. ఇదంతా 1950, 1960 సం.లో జరిగిన విషయం.

Pages